29వ రోజు ( హైలెట్స్ ) – స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య
  • ఎంతోమంది మహనీయులు మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఎందరో ప్రధానులు దేశాన్ని ఉన్నతంగా పాలించారు, సైనికులు దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తున్నారు – స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వీర మహిళలతో జనసేనపార్టీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
  • ఏ స్వార్దం లేకుండా ప్రజల పక్షాన నిలబడే నాయకులు చాలా తక్కువ. నేను ఒక జనసైనికుడిగా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి గర్వపడుతున్నాను. ఆయన నిరంతరం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కృషిచేస్తున్నారు, సమాజం కోసం తపన పడే వ్యక్తి ఆయన
  • ఇప్పటికీ ఇంకా మహిళలకు రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆలోచించాలి
  • జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయ భావాలు నింపుకుని పనిచేసే పార్టీ
  • తెనాలి నియోజకవర్గంలో పెద్దరావూరు గ్రామం నుండి కందుల దుర్గమ్మ అనే మహిళ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని అరెస్ట్ అయ్యారు, 16 నెలలు జైల్లో ఉంటే మహాత్మా గాంధీ గారు ఆమె స్ఫూర్తికి తెనాలి వచ్చి కలిశారు
  • భవిష్యత్తు కోసం నిలబడే పార్టీ జనసేన
  • దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే లా ఒక క్యాలెండర్ విడుదల చేయాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు
  • ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు – స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వీర మహిళలతో జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • రాజ్యాంగం ఎంతో మంది మహానుభావులు కలిసి రూపొందించారు. ఎప్పుడు రాజ్యాంగం రూపొందించిన వారిలో మగవారి పేర్లు మాత్రమే వినిపిస్తాయి కానీ మహిళలు కూడా భాగస్వాములు అయ్యారు. విభజన సమయంలో ఎంతోమంది మహిళలు బాధలు పడ్డారు, త్యాగాలు చేశారు
  • అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 15 మంది మహిళలు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వామ్యులు అయ్యారు
  • భారతదేశం మాతృస్వామ్య వ్యవస్థ. భరతమాత అని మహిళలకు గౌరవం ఇస్తాం. రాజ్యాంగ రూపకల్పనకు సహకరించిన 15మంది మహిళా మేధావులకు ధన్యవాదాలు
  • మహిళ వంటగదికి పరిమితం కాకూడదు, తన స్వంత కాళ్ళ మీద నిలబడాలి అని కోరుకుంటాను. చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ప్రాధాన్యత ఉండాలి
  • దేశం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు పెట్టుకోవడం మన ఉనికికి చాలా అవసరం
  • రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి సరైన గౌరవం దక్కలేదు, ప్రభుత్వాలు ఆయనను విస్మరించాయి, ఒక వర్గానికి ఆయనను పరిమితం చేశాయి, జనసేన పార్టీ ఇలాంటి మహనీయులను గౌరవించుకుంటాం
  • భారతదేశ గొప్పతనం అన్ని మతాలకు సముచిత గౌరవం ఇచ్చింది
  • భారతదేశం సంపన్న దేశం. మనం ఎప్పుడు ఏ దేశంపై దండెత్త లేదు, మనపై అన్ని దేశాలు సంపద కోసం దండెత్తి వచ్చాయి
  • స్వాతంత్య్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఒకే దేశంగా ఉండే మనం ఇండియా – పాకిస్తాన్ గా విడిపోయాం
  • ఏ గొడవలు జరిగినా సరే అని నడుగా ఆడపడుచుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న మణిపూర్ రాష్ట్రంలో 2 తెగల మధ్య గొడవలో ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటన జరిగింది. ఇది చాలా బాధాకరం
  • చరిత్రను మనం గుర్తు ఉంచుకోవాలి. మన రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ కు గురైతే కనీసం ఒక్క సమీక్ష జరగలేదు. రాష్ట్రంలో 155 మంది చిన్న పిల్లలు ట్రాఫికింగ్ కు గురయ్యారు
  • కుల,మతాలకు అతీతంగా మహిళల్లో, పిల్లలకు రక్షణ కల్పిస్తాం
  • మొన్న ఒక లైవ్ డిబేట్ లో పార్టీ అధికార ప్రతినిధి కీర్తన మాట్లాడుతుంటే, వైసీపీపార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి వ్యక్తిగత విమర్శలు, ఆమె అలంకరణపై దుర్భాషలాడాడు. ఇంత నీచానికి దిగజారిన పరిస్థితులు ఉన్నాయి. ఒక మహిళ తనకు తాను అలంకరించుకునే హక్కు లేదా?
  • మొన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో తన అక్కను ఏడిపించ వద్దు అని అడిగినందుకు 14 ఏళ్ల అమర్నాథ్ ను తగలబెట్టి చంపేసిన దుర్ఘటన జరిగింది
  • నిన్న అనకాపల్లి నియోజకవర్గం, విస్సన్నపేట భూములు పరిశీలించడానికి వెళ్తే ఒక మహిళ వచ్చి లెటర్ ఇచ్చింది, తన కొడుకుని చంపేశారు, స్పందన కార్యక్రమానికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా న్యాయం జరగలేదు అని చెప్పింది
  • ఇంకోసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్  వస్తే మేము ఇక్కడ ఉండలేం, వేరే రాష్ట్రాలకి, దేశాలకు పారిపోతాం అని చెప్తున్నారు, ఎక్కడకు వెళతారు? ఏకక్డకు వెళ్ళినా వివక్ష ఉంటుంది, మీరెందుకు మీ నేల విడిచి వెళ్లిపోవాలి? ఎదురు తిరగాలి కదా
  • కొన్ని సంవత్సరాల క్రితం వరంగల్ లో స్వప్నిక అనే ఆడబిడ్డ యాసిడ్ దాడికి గురైతే నేను వెళ్తే ఆ బిడ్డ నాతో అన్నమాట నా పరిస్థితి ఇంకొకరికి రాకుండా చూడు అన్నా అని చెప్పింది
  • ఆయేషా మీర, విజయవాడ శ్రీలక్ష్మి హత్య, సుగాలి ప్రీతి ఇలా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇవి ఆపేందుకు ప్రభుత్వాలు ఎందుకు బలంగా పనిచేయడం లేదు
  • సెక్యులరిజం పేరిట ఇతర మతాలను తిడతాం అంటే కుదరదు, స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించనంత వరకే
  • స్త్రీ తలచుకుంటే మార్పు ఖచ్చితంగా వస్తుంది, మీరు భాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం
  • భావ స్వేచ్ఛ ఉంది కదా అని వైసీపీపార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి లాగా నువ్వెందుకు అలాంటి బట్టలు వేసుకున్నావు, ఎవరిని ఆకర్షించడానికి అంటే అది భావ స్వేచ్ఛ అవ్వదు, వ్యక్తిగత దాడి అవుతుంది
  • రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశిక సూత్రాలను వైసీపీపార్టీ ప్రభుత్వం పాటించడం లేదు, పర్యావరణ పరిరక్షణ చేయకుండా రుషికొండ లాంటి వాటిని ధ్వంసం చేస్తున్నాడు
  • 38 కేసులు ఉన్న వైయస్ జగన్  కోర్టు తీర్పులను తప్పు పడతాడు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన
  • అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది, రాజ్యాంగం సూచించింది కానీ, వైయస్ జగన్  అధికారంలోకి రాగానే జపనీస్ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకున్నాడు
  • ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వైయస్ జగన్  ఒక ప్రాంతాన్ని కులానికి అంటగట్టి మాట్లాడుతాడు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
  • ప్రజలు ప్రాథమిక భాద్యతలు పాటించాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీపై ఉంది, నాయకులు సరైన వారా కాదా అనేది అర్దం చేసుకోవాలి. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు, ఈరోజు CPS రద్దు, మధ్య నిషేదం, జాబ్స్ విషయాలపై ప్రశ్నించలేకపోతున్నారు
  • తప్పు జరిగినప్పుడు ప్రతిఘటటించాల్సిన భాధ్యత ప్రతీ ఒక్కరిది, మీరు మీ బిడ్డలకు నేర్పాలి
  • జనసేన పార్టీ అధ్వర్యంలో “ప్రజా కోర్టు” అని సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేయనున్నాం
  • చెత్త మీద కూడా టాక్స్ వేస్తున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే కూడా టాక్స్ వేస్తాం అంటే అత్యధిక పన్ను వైసీపీపార్టీ కడుతుంది
  • అక్రమ ఆస్తులపై, దోపిడీలో సమాచారం ఇచ్చేవారికి బహుమతి ఇచ్చే పద్దతి తీసుకొస్తాం
  • పారిశ్రామిక వేత్తలు టీవీ లో ప్రభుత్వ కాంట్రాక్టులకు 6 నుండి 8 శాతం కమీషన్ ముఖ్యమంత్రి, మంత్రులకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పినా చర్యలు తీసుకోలేక పోతున్నాం
  • ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్ గా, కాలుష్యానికి నిలయంగా మారింది
  • కనీసం గోదావరి జిల్లాల్లో త్రాగునీరు ఇవ్వలేని పరిస్థితి, భవిష్యత్తు లో ఇంకెలా ఉంటుందో ఆలోచించాలి
  • డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుని కాపాడాము. విశాఖ ఉక్కు కూడా కాపాడుకుంటాం
  • వైసీపీని గెలిపించకపోతే పథకాలు రావు అని భయం వద్దు. ఇంకా మంచి చేసే పథకాలు ఇస్తాం. దయచేసి అండగా నిలబడండి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పనిచేస్తాం

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్