26వ రోజు ( హైలెట్స్ ) – సి.ఎన్.బి.సి ల్యాండ్స్ సందర్శన

  • హత్య జరిగే సమయానికి వాలంటీరుగా పని చేస్తున్నాడు, తర్వాత ముందే తీసేసామని చెప్తున్నారు – పవన్ కళ్యాణ్ గారితో హత్యకు గురైన వృద్దురాలి కుటుంబ సభ్యులు
  • మా అమ్మగారిని తన తల్లిగారిగా భావించి మాకు జరిగిన అన్యాయంపై పోరాడటానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు – వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి గారు కుమారుడు
  • దండుపాళ్యం బ్యాచ్ కు వైసీపీపార్టీ బ్యాచ్ కు తేడా లేకుండా పోయింది. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారు – జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • వాలంటీర్ ఒక మహిళను చంపేస్తే కనీసం ఒక్క వైసీపీపార్టీ నాయకులు కూడా వచ్చి పరామర్శించలేదు
    నన్ను విమర్శించడానికి అయితే ముందుంటారు, వ్యవస్థలను సక్రమంగా పనిచేయించడంలో అట్టడుగుకి పోయారు
  • వరలక్ష్మి గారు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి ఎప్పుడు వచ్చే వాలంటీర్ ఆవిడ మెడలో బంగారు పుస్తెల తాడు కోసం దాడి చేసి చంపేశాడు
  • చిన్న ప్రభుత్వ ఉద్యోగం, పాస్ పోర్ట్ కోసం కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, మరి వాలంటీర్లను నియమించేప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చెయ్యలేదు
  • ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు అని నేను అంటే నన్ను విమర్శించారు, ఈరోజు నర్సీపట్నం నుండి నాకు ఈ అంశంపై పిర్యాదులు వచ్చాయి
  • వైసీపీ నాయకులు పట్టించుకోపోయినా, కేసును విచారించిన బయటకు తీసిన పోలీస్ శాఖకు నా ధన్యవాదాలు
  • నేరస్థులు నేరాలు చేయడం చూశాం, నాయకులు, MLA లు, వారి అనుచరులు నేరాలు చేస్తుంటే ఏం చేయాలి
  • కనీసం సొంత పార్టీ MP కి రక్షణ లేదు, MP కుటుంబాన్ని రౌడీ షీటర్ కిడ్నాప్ చేస్తే, ఆఖరికి ఆ ఎంపీ కూడా నేరస్థులను, తనపై దాడి చేసిన వారిని వెనకేసుకు వస్తున్నారు
  • ఒకప్పుడు విశాఖలో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా పెరిగింది, దీనికి కారణం ఎవరు
  • విశాఖలో జరుగుతున్న నేరాలపై కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేయనున్నాం
  • ఖచ్చితంగా వరలక్ష్మి గారి హత్యకు కారణమైన నిందితుడికి శిక్ష పడేలా పోరాడుతాం

 

 

  • రాష్ట్రంలో ముఖ్యమంత్రే పెద్ద దొంగ
    సొంత పేషి లో CM డిజిటల్ సిగ్నేచర్ మాయమైంది, ఆ సంతకం ఉపయోగించి ఏ సంతకాలు పెడుతున్నారో, ఏ పాలసీల, జీవోలు ఇస్తున్నారో, ఎవరిని బెదిరిస్తున్నారో తెలీదు
  • జగన్ కు జనసేనాని హెచ్చరిక
    అడ్డగోలుగా భూములు దొచేస్తున్నావ్, కొత్త ప్రభుత్వం రాగానే విచారణ వేయిస్తా, నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి గుర్తుపెట్టుకో
  • MP కి సిగ్గులేదా? ఇక్కడి నుండి పారిపోతారు అంటావా? ఎందుకు పోటీ చేశావ్? ఎందుకు ప్రజలతో ఓట్లు వేయించుకున్నావ్? రాజీనామా చేసి వెళ్ళు
  • CNBC ల్యాండ్స్ లో 18 వేల గజాలు క్రిస్టియన్ సొసైటీకి చెందినది, వాటిని అమ్మకూడదు, కబ్జా చెయ్యకూడదు అని కోర్టు స్టేటస్ కో ఇచ్చినా కూడా వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయ, మసీద్, చర్చ్ భూములు లాక్కున్నారు వైసీపీపార్టీ నాయకులు

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్