24వ రోజు ( హైలెట్స్ ) – విశాఖపట్నం వారాహి బహిరంగ సభ

వారాహి

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ :

  • కాలం చాలా గొప్పది, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం సుస్వాగతం సినిమాకి ఇదే జగదాంబ సెంటర్లో బస్ మీద ఎక్కి డ్యాన్స్ వేసాను, 25 సంవత్సరాల తరవాత వారాహి ఎక్కి మీతో మాట్లాడుతున్నాను.
  • సినిమాల్లో నుండి పారిపోకుండా కాలం నన్ను ఉంచింది, అదే కాలం ఇదే జగదాంబ సెంటర్లో మీతో మన రాష్ట్రం ప్రజల, సమాజం కోసం మాట్లాడేలా చేసింది, ఇన్ని వేల మంది ప్రజల మధ్యన కోట్ల ప్రజల కోసం మాట్లాడే ధైర్యం ఇచ్చింది ఈ విశాఖ నగరం
  • నటనలో ఓనమాలు నేర్పింది విశాఖ నగరం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సాహిత్యం నాకు నేర్పింది
  • ఈరోజు ఏం మాట్లాడుతానని కోపంగా, నా గొంతు నులిమేద్దాం అని ఈ సభ చూస్తున్న వైసీపీ నాయకులకు నమస్కారం
  • ఉదయాన్నే పథకం క్రింద డబ్బులు ఇచ్చి, సాయంత్రం మద్యం పేరిట దోచేసింది వైసీపీ ప్రభుత్వం
  • ప్రశాంతమైన నగరం విశాఖ, ఇలాంటి నగరం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో చిక్కుకుంది, దోపిడీలకు నిలయంగా మారింది
  • జగదాంబ సెంటర్ నుండి మాట ఇస్తున్నాను
    మన ప్రభుత్వంలో అరాచకాలు చేసే గూండాలు, మిమ్మల్ని బెదిరించే రౌడీలు విశాఖ నగరం వైపు చూడకుండా చేస్తాను
  • ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు శ్రీ గద్దర్ గారు చనిపోయే ముందు హాస్పిటల్ లో నుండి నాకు మెసేజ్ చేశారు, ఆయన్ని కలిశాను, ఆయన నాకు చెప్పింది కాలం చాలా గొప్పది, 60 శాతం ఉన్న యువతకు నువ్వు నాయకత్వం వహించి విజయం సాధించాలి అని చెప్పారు
  • దేశం కోసం వేలాదిమంది ప్రాణత్యాగాలు చేస్తే స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం ప్రాధమిక హక్కులు, విధులు కల్పించింది, వాటిని రక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వాలదే
  • ఎంతోమంది మేధావులు ప్రజాస్వామ్య రక్షణ కోసం కష్టపడితే, ఒక్కడు వచ్చాడు, నాశనం చేయడానికి వైయస్ జగన్ అనే వ్యక్తి
  • జగన్ నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయవు, పోలీసులను, అధికారులను బెదిరిస్తావు, అందరూ నీ కింద ఉండాలని చూసే వ్యక్తివి నువ్వు వైయస్ జగన్
  • రాష్ట్ర సాధనకు కృషిచేసిన పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాం, అడ్డగోలుగా దోచుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఉంటాయి
  • నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రజలు అనుకోవాలి, నేను అనుకుంటే సరిపోదు, మీరు అనుకోండి
  • ఈ వైసీపీ ని ఆంధ్రప్రదేశ్ నుండి తరిమేసే వరకు, ప్రజల భద్రత కోసం నిరంతరం జనసేన పోరాటం చేస్తోంది. ముందుగా విశాఖ జిల్లా నుండి ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఉండకూడదు
  • 2019 లో నేను ముందే చెప్పాను, వైసీపీ గెలిస్తే విశాఖ లో కొండలతో సహా దొచుకుంటాడు అని అప్పుడు మీరు నమ్మలేదు, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడో, మీరు ఎన్నుకుంది చాలా దోపిడీలు చేసిన వ్యక్తిని, 5 సంవత్సరాలు ఆ దోపిడీలు భరించాలి, అందుకే అప్పుడు వైసీపీ ని గెలిపించవద్దు అని
  • జగన్ ముఠా తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంది, అందుకే అక్కడ వారు తన్ని తరిమేశారు
  • రుషికొండ ను త్రవ్వేసారు, తుఫాను ల నుండి రక్షించే కొండని చెక్కేసారు, ఎర్రమట్టి దిబ్బలను దొచేస్తున్నారు
  • వైసీపీ దోపిడీలు అడ్డుకోలేరా? ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి, మీకోసం నేను నిలబడతా, దోపిడీలు అడ్డుకుంటాను
  • అధికారంలోకి రాగానే ఇసుక ఆపేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. భవన నిర్మాణ కార్మికుల తరపున నేను విశాఖలో గళమెత్తాను, విశాఖ నేను ఓడిపోయినా సరే నాకు మళ్ళీ బలం ఇచ్చింది, నాతో నిలబడిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు, నేను ఓడిపోయినా సరే బలంగా నిలబడ్డాను
  • మన రాష్ట్రంలో 30వేల పైన మహిళలు, అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అని నేను చెప్తే ప్రతీ వైసీపీ పార్టీ గూండాలు తిట్టారు, మొన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిజమే అని చెప్పారు
  • నేను హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పాను, మొన్న నోబెల్ పురస్కార గ్రహీత శ్రీ సత్యమూర్తి గారు నిజమే దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ముఖ్యంగా విశాఖ నుండి ఎక్కువ మంది పిల్లలు హ్యుమన్ ట్రాఫికింగ్ కు గురయ్యారు అని చెప్పారు
  • నేను వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడాను, సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా, మీ పొట్ట కొట్టాలని చూడను, అవసరమైతే ఇంకో 5 వేలు ఎక్కువ ఇచ్చేవాడిని, కానీ వైయస్ జగన్ మీతో తప్పు చేయిస్తున్నాడు, ప్రజల ఆధార్, బ్యాంక్ వ్యక్తిగత వివరాలు కలెక్ట్ చేసి నానక్ రామ్ గూడ లోని FOA_AP కి ఇస్తున్నారు
  • వాలంటీర్స్ కలెక్ట్ చేసే డేటా రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ ఉద్యోగులకు, వాలంటీర్లతో వైయస్ జగన్ తప్పు చేయిస్తున్నాడు, గతంలో అక్క, అన్న అని చెప్పి IAS, IPS అధికారులతో చెప్పి వారితో తప్పులు చేయించి వారిని జైల్లో వేయించాడు
  • ఇదే వైజాగ్ లో నన్ను ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు, ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు, ఈ నేల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తాను
  • పెందుర్తి లో వాలంటీర్ ఒక వృద్ధురాలిని చంపి నగలు దోచేశారు
  • కొయ్యల గూడెంలో వాలంటీర్ లక్ష 70 వేల రూపాయలు వేలిముద్ర తో మహిళ బ్యాంక్ నుండి దోచేశారు
  • వాలంటీర్లకు OTP తో పనేంటి? OTP అడిగి మొన్న రాజమండ్రిలో డబ్బు దొచేసే ప్రయత్నం చేశారు
  • నేరాలపై పోలీసులు FIR నమోదు చేయటం లేదు, పోలీసులు తిరస్కరించిన కేసులు జనవాణి ద్వారా నా దగ్గరకు వచ్చాయి
  • వైజాగ్ లో ఒక రౌడీ షీటర్ MP ని, కుటుంబ సభ్యులను బందిస్తే దిక్కులేదు, వైయస్ జగన్ లాంటి వ్యక్తి ఉంటే లా & ఆర్డర్ ఎక్కడ ఉంటుంది
  • 250 వచ్చే కరెంట్ బిల్లు ఈ నేల 560 వచ్చింది, ఇష్టారాజ్యంగా పెంచారు, చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి వైయస్ జగన్
  • గంజాయి కి అడ్డాగా మారింది విశాఖ జిల్లా
  • ఆంధ్రా యూనివర్సిటీ 29వ స్థానం నుండి 76వ స్థానానికి పడిపోయింది. వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. సెక్యూరిటీ వాళ్ళు గంజాయి అమ్ముతారు, వైసీపీ పార్టీ మీటింగ్స్ పెడతారు, ఫీజులు పెంచారు, కీలకమైన డిపార్ట్మెంట్స్ తీసేసారు, అధ్యాపకుల భర్తీ లేదు, VC వెళ్లి వైసీపీ MLC కి ఓటు వేయండి అని ప్రచారం చేస్తాడు. ఖచ్చితంగా VC పై కేంద్రానికి, HRD కి పిర్యాదు చేస్తాను
  • PhD విద్యార్థులకు కనీసం ఆంధ్రా యూనివర్సిటీ లో ప్రోత్సాహం లేదు, వైయస్ జగన్ ఆంధ్ర యూనివర్సిటీ నీ బ్రష్టు పట్టించాడు. జనసేన పార్టీ రాగానే ప్రక్షాళన చేసి తీరతాను
  • జగన్ గుర్తు పెట్టుకో, కేంద్రం తో నిన్ను ఆడించకపోతే చూడు, మీ నాయకుల అక్రమాల పై ఫైల్ కేంద్రానికి ఇస్తాను , ఖచ్చితంగా మీపై చర్యలు ఉండబోతున్నాయి
  • విశాఖ క్రైమ్ కి, ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మారింది అని హోం మంత్రి శ్రీ అమిత్ షా గారు చెప్పారు
  • అమ్మ ఒడి అని చెప్తాడు వైయస్ జగన్ 3 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి బయటకు వచ్చారు, 50 వేల టీచర్ల ఉద్యోగాలు భర్తీ చెయ్యలేదు, ఇక్కడే ఉండే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతి నెల DSC నోటిఫికేషన్ అంటాడు ఎప్పుడు విడుదల చేసి భర్తీ చేస్తారో తెలీదు
  • టీచర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 500 కోట్లు బైజుస్ అనే నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇస్తారు ఈ వైయస్ జగన్
  • విశాఖ ఏం నష్టపోయింది?
  • సర్క్యూట్ హౌస్ 2.94 ఎకరాలు, సీతమ్మధార లోని తహశీల్దార్ ఆఫీస్ ఎకరం, R&R క్వార్టర్స్ 3 ఎకరాలు, పాలిటెక్నిక్ కాలేజీ 23.58 ఎకరాలు, ITI కాలేజ్ 17.23 ఎకరాలు, రైతుబజార్ 3.8 ఎకరాలు, డైరీ ఫామ్ 30 ఎకరాలు, సిల్క్ డిపార్ట్మెంట్ 5.78 ఎకరాలు, పోలీస్ క్వార్టర్స్ 8.58 ఎకరాలు, EE బంగ్లా 3.5 ఎకరాలు, PWD కార్యాలయం 3.5 ఎకరాలు, CE బంగ్లా 5.55 ఎకరాలు. మొత్తంగా 128.70 ఎకరాల ప్రభుత్వ ఆస్తులు 25 వేల కోట్లకు తాకట్టు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆస్తులు పెంచాలి కానీ తాకట్టు పెట్టడం ఏంటి? ఇది మీ డబ్బు
  • ఉత్పాదకత, అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ఉపయోగం ఏముంది?
    జగన్ నాయకుడు కాదు వ్యాపారి, కమీషన్ ఏజెంట్, నాకెంత వాట అని అడుగుతాడు
  • ఎంత డబ్బు తింటావ్ జగన్? ఏం చేసుకుంటావ్ జగన్ ఇంత డబ్బు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎందుకు డబ్బు పిచ్చి
  • 2024 లో ఇంకో అవకాశం జగన్ కు ఇస్తారా?
    బొగ్గును సర్ఫ్ తో కడిగినా నల్లగానే ఉంటుంది, జగన్ ఎన్ని చెప్పినా మనిషి మారడు, ఆయన్ని ఇంకోసారి గెలిపిస్తే ముక్క మిగల్చడు
  • మద్యం మీద 30 వేల కోట్లు అక్రమంగా సంపాదించాడు వైయస్ జగన్, మద్య నిషేధం అన్న వ్యక్తి మద్యం మీద ఆదాయం సంపాదించాడు, వచ్చే ఎన్నికల కోసం సిద్ధం అయ్యాడు
  • ప్రజలను బాగా పాలించమని వైయస్ జగన్ కు అధికారం ఇచ్చారు, పీడించమని కాదు
  • ఒకే కులానికి అన్ని కీలకమైన పదవులు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి, ఒకే కులానికి పదవులు అనే విధానానికి జనసేన వ్యతిరేకం
  • జగన్ ఒక డెకాయిట్, దొంగ
    CAG లెక్కల్లో కొన్ని వేల కోట్లు లెక్కలు బయట పెట్టలేదు, ఏమయ్యాయి
  • గాంధీ గారిని పక్కన పెట్టుకుని ఫోటోలు పెట్టడం కాదు జగన్, పంచాయతీ నిధులు ఎక్కడికి మల్లించావ్? 4,500 కోట్లు, 7,569 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. పంచాయితీకి రావలసిన నిధులు వాలంటీర్లకు జీతాలు గా ఇచ్చాడు వైయస్ జగన్
  • జగదాంబ సెంటర్ నుండి మాట ఇస్తున్నాను, పంచాయితీ నిధులు పంచాయితీలకు వచ్చేలా జనసేన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, గ్రామసభలు బలోపేతం చేస్తాం
  • స్థానిక వనరులు, గనులపై గ్రామసభలకే ఆధిపత్యం , నిర్ణయాధికారం ఉండాలి
  • చిన్నపాటి క్లాస్ IV ఉద్యోగానికి పోలీస్ క్లియరెన్స్ కావాలి, అలాంటిది 38 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎలా ముఖ్యమంత్రిగా అర్హుడు? ప్రజలు ఆలోచించాలి
  • విశాఖలో పారిశ్రామిక కాలుష్యం, పరవాడ ఇండస్ట్రీ కాలుష్యం ఎక్కువగా ఉంది, వైయస్ జగన్ విశాఖ వస్తా అన్నావ్ కదా వచ్చి పరవాడ ఇండస్ట్రీల మధ్య ఉండు, రుషికొండ ఎందుకు? ఉత్తరాంధ్ర ను డంపింగ్ యార్డ్ గా మార్చేశారు
  • మీరు ప్రశ్నించకపోతే, నిలదీయకపోతే మీరే నష్టపోతారు
  • విశాఖ దోపిడీపై చర్యలు తీసుకుంటాం, కేంద్రం చాలా సీరియస్ గా ఉంది, ఖచ్చితంగా ప్రతీ ఒక్క దోపిడీ దారుడిపై చర్యలు ఉంటాయి
  • జగన్ మీ మెదడులో అత్యాశ , దోచుకునే తత్వం పెడుతున్నాడు, మీ శక్తిని గ్రహించండి, ఈజిప్ట్ లో హోస్నీ ముబారాక్ అనే పాలకుడి పై దేశం ఎదురుతిరిగి దించేసింది, అలాగే మీరు అందరూ కలిస్తే జగన్ ను దించేయొచ్చు
  • ఎట్టి పరిస్థితుల్లో ఓటు చీలకూడదు, జగన్ అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళకూడదు. 2014 లో TDP విధానాలు నచ్చనప్పుడు, కొంతమంది అడిగినప్పుడు TDP కి వ్యతిరేకంగా వెళ్ళాను, నన్ను అత్యంత ఇష్టపడే ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి కి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కోసం వెళ్ళాను. నా ప్రాధాన్యత ప్రజలు, నా నేల, నా రాష్ట్రం, నా దేశం
  • రాముడున్నాడు – రాజ్యం ఉన్నాది
    ఉన్న ఊరిలోనే మనం బ్రతకాలి, ఎక్కడకు వలస వెళతారు? ఇంకోసారి జగన్ వస్తే రాష్ట్రం వదిలిపోవాలి అంటున్నారు, మీరెందుకు వెళ్ళాలి, వైయస్ జగన్ ను పంపించేయండి. పారిపోకుండా నిలబడి ఉండండి. కుదిరితే నేను కూడా ఇక్కడ ఇల్లు తీసుకుంటాను
  • గంధపు స్మగ్లర్ వీరప్పన్ మీకు ఇష్టమా? అమాయకులైన గిరిజనులతో గంధం చెట్లు కొట్టించేవాడు, వారికి అది తప్పు అని తెలీదు.
    మన వీరప్పన్ జగన్ వాలంటీర్లతో డేటా సేకరిస్తున్నాడు, ఇది గంధం చెట్లు కొట్టినంత నేరం

 

  • అభివృద్ధి జరగాలంటే..
    అరాచకం ఆగాలంటే..
    జనం బాగుండాలంటే..

 

  • ఒక్కటే నినాదం..

      “హల్లో ఏపీ…బై బై వైసీపీ!”
      “హల్లో ఏపీ…బై బై వైసీపీ!!”

          “Hello AP…Bye Bye YCP”

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్