23వ రోజు ( హైలెట్స్ ) – తణుకు వారాహి బహిరంగ సభ

తణుకు

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ : 

  • తణుకు ప్రాంత కవి శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి మన జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తినిచ్చింది.
  • పార్టీ కోసం నిలబడిన విడివాడ రామ చంద్ర రావు గారు లాంటి బలంగా నిలబడే నాయకుడికి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా, సీట్ ఇవ్వక పోయినా సరే బలంగా నిలబడ్డాడు, సీట్ ఇచ్చిన వ్యక్తి 30వేల పైన ఓట్లు వచ్చినా నిలబడలేదు.
  • ఇక మొదలెడదామా  Let us do a critical analysis on వైసీపీ పార్టీ  & వైయస్ జగన్  ruling.
  • ముఖ్యమంత్రి జగన్ కు తణుకు నుండి చెబుతున్నా…
  • నువ్వు కొంపలు అంటిస్తావు, నేను గుండెలు అంటిస్తాను
  • వైసీపీ కొంపలు అంటిస్తుంది, జనసేన గుండెలు అంటిస్తుంది.
  • జగన్ ఈరోజు నువ్వు అంటించిన కొంపలు గురించి చెబుతాను
  • అధికారంలోకి రాగానే 32 లక్షల భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చేశావు, 32 మందిని బలితీసుకున్నావు, వారి సంక్షేమ నిధి నుండి డబ్బులు తీసుకున్నావు.
  • నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని, చిన్నప్పుడు కష్టాలు చూసాను, నాకు అవగాహన ఉంది, ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసు.
  • ఈరోజు బటన్ ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేది తెలుసు.
  • జగన్ నువ్వు అధికారంలోకి వచ్చాక ఇంటి పన్ను 600 పెరిగింది, చెత్త మీద ఎప్పుడు పన్నులేదు, ఈ చెత్త ముఖ్యమంత్రి వచ్చాక చెత్త మీద ₹100 పన్ను వేశాడు. ఇసుక 10 వేలు ఉంటే ఈరోజు 40 వేలు చేసావు, చినపండు, వంట నూనె, కందిపప్పు, పంచదార, మినపప్పు అన్ని రేట్లు పెరిగాయి. ఇంతక ముందు ₹60 ఉన్న మద్యాన్ని ₹140 చేశావ్ జగన్.
  • మద్యపాన నిషేదం అని చెప్పి 30వేల కోట్లు దోచేసావ్ జగన్. జనాలకు మొహం చూపించలేక, ఎక్కడ కొడతారో అని పరదాల చాటున , హెలికాప్టర్లో వెలుతున్నవా జగన్.
  • ఇల్లు లేని వాడికి ఇళ్లు కట్టిస్తాను అని చెప్పి, టిడ్కో ఇళ్ల కోసం 9,159.99 కోట్లు తీసుకుని దీనిని బడ్జెట్ లో పెట్టలేదు అని CAG చెప్పింది, ఇళ్లు, కాలేజీలు కట్టలేదు, డబ్బులు ఏమైపోయాయి వైయస్ జగన్ .
  • అవసరం లేని ఇక్కడ స్థలాలు సేకరిస్తామని అని చెప్పి, దూరాన ఉన్న స్థలాలు కోని 309 కోట్లు కాజేసారు.
  • తణుకు లోనే 309 కోట్లు TDR బాండ్స్ స్కాం చేశాడు  ఈ జగన్.
  • పట్టాలు ఇవ్వక ముందే, మట్టి పూడ్చడానికి అని చెప్పి 30 నుండి 50వేలు ప్రజల నుండి కలెక్ట్ చేశారు జగన్ మీ నాయకులు.
  • ఇక్కడ జరిగిన స్కాంపై ACB అధికారులు వస్తే నాయకులు తప్పించుకుని కమిషనర్ నీ పట్టించారు. జనసేన పోరాటం చేస్తోంది రాజకీయ అవినీతి మీద.
  • జగన్ కనీసం తణుకులో డంపింగ్ యార్డ్ లేదు చెత్త పడేయడానికి, అలాంటిది ఎలా చెత్త మీద పన్ను వేస్తావ్ జగన్, ఈ చెత్త ప్రభుత్వం.
  • రైతు చాలా భాదల్లో ఉన్నారు, సాగు నీరు అందించలేరు, మద్దతు ధర ఇవ్వలేరు, కానీ మొన్న వరదల్లో ధాన్యం తడిస్తే వాటిని కొనమని అడిగితే రైతులపై దువ్వ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు.
  • నువ్వు ఎలాగో పోలవరం కట్టలేవు జగన్, కనీసం ఇక్కడ 30కోట్లు ఖర్చుపెట్టి ఎర్ర కాలువ అయిన సరిచేయవచ్చు కదా? తణుకు అత్తిలి పరిసర ప్రాంతాలను ఆడుకోవచ్చుగా జగన్.
  • 1,100 కోట్లు PDA అకౌంట్లకు మళ్ళించావు, సుప్రీం కోర్టు నువ్వు దొంగతనం చేశావ్ అన్నప్పుడు విపత్తు నివారణ నిధులు మళ్ళీ ఇచ్చావ్ జగన్. అందుకే నిన్ను జగ్గుభాయ్ అనేది, దొంగతనాలు చేస్తున్నావ్ జగన్ నువ్వు.
  • జగన్ పథకాలు ఎలా ఉంటాయి అంటే, కార్పొరేషన్ ఫండ్స్ తీసుకుని మీకు అమ్మఒడి, వాహన మిత్ర అన్ని పథకాలు అందులోంచి ఇస్తున్నాడు, మీకోసమే ఖర్చుపెట్టా అని అంటాడు. ఖర్చు పెట్టాల్సిన ఫండ్స్ తను తరలించుకుంటాడు, ఈ మాత్రం కోసం నవరత్నాలు అని ఎందుకు.
  • ఇప్పటికే  కేంద్ర పథకాలు ఈయన పేరు మార్చి ఇస్తున్నాడు, వృద్ధాప్య పింఛన్లు తో సహా.
  • జగన్ CPS రద్దు చేస్తాం అని మాట మార్చి, కనీసం జీటాలుంకూడ సరిగ్గా సమయానికి ఇవ్వలేదు. ఆఖరికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసావు జగన్ నువ్వు. కాగ్ పట్టుకుంటే అప్పుడు టెక్నికల్ ఎర్రర్ అని తప్పించుకున్న దొంగవు జగన్ నువ్వు.
  • మైనింగ్ చేసేవాడికి ప్రావిడెంట్ ఫండ్ విలువ ఏం తెలుస్తుంది.
  • నువ్వు దొంగవి జగన్ అందుకే జగ్గుభాయ్ అని అంటాము.
  • నేను జగన్ అని ఏకవచనం పిలిస్తే నాయకులు ఫీల్ అవుతున్నారు.
  • నన్ను పవన్, దట్టపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అని అన్నప్పుడు ఏమయ్యారు? అప్పుడు నీతులు ఏమయ్యాయి.
  • శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేసిన వాడివి జగన్ నువ్వు.
  • రైతులు గిట్టుబాటు ధర గురించి మాట్లాడితే ఎర్రిపప్ప అని వైసీపీ నాయకులు తిడతారు.
  • ప్రస్తుతం జగన్ నుండి జగ్గుభాయ్ కి వచ్చాను, ఇంకా మీరు నోరు జారితే జగ్గు అంటాను ఆ తరవాత ఏమని పిలుస్తానో తెలియదు, వైసీపీ పార్టీ  నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే నేను నోరు అదుపులో పెట్టుకుంటా.
  • వర్షంలో తడిచి ధాన్యం మొలకలు వచ్చాయి అని మంత్రికి చెప్తే, మొలకలు రాక ఏం వస్తాయి ఎర్రిపప్ప అని అంటాడు, మళ్ళీ వచ్చి ఏర్రిపప్ప అంటే బుజ్జి కన్నా అని అంటాడు.  వైసిపి ఎర్రిపప్పలు అని మేము కూడా అంటాము కరుమూరి వెంకట నాగేశ్వరరావు.
  • CPS ఎందుకు హామీ ఇచ్చి రద్దు చేయలేదు అంటే, సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి మా వాడు పసివాడు, ఏం తెలిక హామీ ఇచ్చాడు అని అంటాడు.
  • ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమందికి అమ్మఒడి ఇస్తాం అని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒకరికే అని అంటాడు ఈ జగన్.
  • అన్నవరంలో పురోహితులను వేలం వేశాడు ఈ పెద్దమనిషి వైయస్ జగన్ , ఎందుకు కేవలం హిందూ ధర్మానికి ఇలా చేస్తున్నారు? ఇతర మతాల్లో ఇలా వేలం వేస్తారా? ఇది హిందూ మతాన్ని దెబ్బతీయడం కాదా?
  • గుడుల్లో చెప్పుల స్టాండ్, ప్రసాదాలు, శిరోముండనం, పూడు, కొబ్బరి కాయలు వేలం వేయచ్చు, పురోహితులను కాదు జగన్, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. జనసేన తరపున కోర్టులో దీనిపై కేస్ వేస్తాం, ఇష్టారాజ్యంగా గుడులను దోచేస్తున్నారు, వైసీపీ పార్టీ  నాయకులు హిందూ ధర్మాన్ని అగౌరవ పరుస్తున్నారు.
  • ఇస్లాం మత ప్రార్థన మందిరాలలో నువ్వు వేలం వేయగలవా వైయస్ జగన్ ? హిందూ ధర్మం అంటే పట్టించుకునే వారు లేరు అనుకున్నావా? చర్చ్ లో ఫాదర్స్ ను వేలం వేయగలవా.
  • జగన్ నువ్వెవడివి, నీ మంత్రులు ఎవరు మేము ఎలా బ్రతకాలో చెప్పడానికి? ఇది మా దేశం, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ఇది, ఆఖరికి కంకర కనుక్కోవాలన్నా సరే మీకు డబ్బులు ఇవ్వాలంటే ఎలా? నువ్వెవడివి వైయస్ జగన్
  • మీ వైసీపీ పార్టీ  ఎర్రిపప్పలకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి జగన్?
  • ఎర్రిపప్పలు అన్నందుకు భాద పడితే, మా రైతులను అన్నప్పుడు నేను బాధపడ్డాను, భరించండి కరుమూరి వెంకట నాగేశ్వరరావు.
  • మీరు ప్రస్తుతం నడుపుతున్న బైరైటిస్ గనులు ఎవరివి? ఒకప్పుడు బలిజలవి కావా? మీరు వారి నుండి లాక్కొలేదా? ఆఖరికి ఇళ్లు నచ్చింది అని అది కూడా లాగేసుకున్నావు కదా జగన్.
  • పార్లమెంట్ లో మహిళల మీద ఎన్ని నేరాలు జరిగాయి అని ప్రశ్న అడిగితే
  • మద్యం మత్తులో 52 వేల దాడులు జరిగాయి అని చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తా అని మద్యం అమ్మిన నువ్వు భాధ్యత తీసుకోవాలి వైయస్ జగన్  
  • ఒకప్పుడు 60 రూపాయలకు నాణ్యమైన మద్యం వచ్చేది, ఇప్పుడు 160 రూపాయలు చేసి కల్తీ మద్యం అమ్ముతున్నారు, నేను టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పా అప్పుడు లక్షా 60 వేల బెల్ట్ షాపులు ఉంటే, ఇప్పుడు 3 లక్షలు చేసావు జగన్.
  • దిశా యాప్ అంటావు
  • నీ పాలనలో 3,378 మంది ఆడవారు మానభంగాలకు గురయ్యారు తెలుసా వైయస్ జగన్ ?
  • మిస్సింగ్ కేసుల వారు తిరిగి వచ్చారు అని మీరు అంటారు, వారు ఏ పరిస్థితిలో వచ్చారో అని కనీసం కనుక్కున్నావా? మహిళా కమిషన్ పద్మవాసిరెడ్డి  ఏం చేస్తున్నారు, మహిళా మంత్రులు, హోమ్ మంత్రి తానేటి వనిత ఏం చేస్తున్నారు.
  • పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ కు చెందిన హెరాయిన్ విజయవాడలో దొరికింది, గట్టిగా అడిగితే మీ చుట్టూ నే అది చేసిన వారు ఉన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లావు వైయస్ జగన్
  • వాలంటీర్ల కడుపు కొట్టే వ్యక్తిని కాదు, 5 వేలకు ఇంకో 5 వేలు ఇచ్చే వ్యక్తిని.
  • ఒక వాలంటీర్ శివ శ్రీ అనే చెల్లి కన్నీళ్లు జన వాణి కార్యక్రమానికి నాంది.
  • వాలంటీర్స్ మీరు వైయస్ జగన్  వలన ఇబ్బంది పడతారు.మీచేత మేరకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు. గతంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో IAS, IPS ఆఫీసర్లు ఒత్తిడికి లొంగీ తప్పు చేసారు, తరవాత జైలుకు వెళ్ళారు, అలాగే మీతో తప్పు చేయిస్తున్నాడు, ఇది రాజ్యాంగ విరుద్ధం.
  • వాట్సప్ గ్రూప్ లో ఉన్న డేటా ఎక్కడకు వెళుతుంది జగన్? వాలంటీర్స్ వ్యవస్థకు హెడ్ ఎవరు? నువ్వు నవ్వితే సరిపోదు జగన్, నువ్వు జవాబుదారీగా ఉండాల్సిందే.
  • ప్రభుత్వంలో ఒక శాఖ నుండి మరో శాఖ కు డేటా బదిలీ అవ్వాలంటే లిఖిత పూర్వకంగా ఉంటుంది, మరి వాలంటీర్స్ నుండి డేటా పంపించడానికి ఏ లిఖితపూర్వక అనుమతి ఉంది? 164 రూపాయల రోజు జీతంతో మీ చేత తప్పు చేయిస్తున్నారు గుర్తుంచుకోండి వాలంటీర్స్, వారు చేసే తప్పుకు మీరు బలవుతారు.
  • వసతి దీవెనకు ఇవ్వాల్సిన ₹705 కోట్ల రూపాయలు వాలంటీర్లకు సత్కారం అని ఇచ్చాడు ఈ జగన్, మరి విద్యార్థులకు ఇంకెలా ఇస్తాడు.
  • జగన్ లేనప్పుడు పెన్షన్లు లేవా, రేషన్ లేదా? ఎందుకు ఇన్ని సమాంతర వ్యవస్థలు? చేసే మనసు లేనప్పుడు ఎన్ని వ్యవస్థలు ఉన్నా నిరుపయోగం.
  • వాలంటీర్స్ తో వైసీపీ కండువాలు ఎందుకు వేయిస్తున్నావు? వారు నీ పార్టీ కానప్పుడు?  VRO, VRA లకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు.
  • జనసేన వి అండగా ఉండే చేతులు
  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగకూడడు అని దీపానికి చేతులు అడ్డుపడితే, జగన్ దీపాలు ఆర్పేస్తున్నాడు.
  • 4 ఏళ్లలో వివిధ రూపాల్లో లక్ష కోట్లు జగన్ దోచేసాడు, భారతీ సిమెంట్స్ కి దాదాపు 22 వేల కోట్లు దోచిపెట్టాడు.
  • గ్రామ పంచాయితీలను జగన్ నాశనం చేస్తున్నాడు.
  • అప్పుడు తెలుగుదేశం జన్మభూమి కమిటీలు తప్పు అని చెప్పాను, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తప్పు అని చెప్పాను, నేను మాట మార్చలేదు.
  • పంచాయితీ ఎన్నికలు జరిగితే నిధులు వస్తాయి అని చెప్పి, ఎందుకు ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా నిధులు మళ్ళిస్తున్నావు? గ్రామ పంచాయితీలలో కనీసం బ్లీచింగ్ వేయడానికి కూడా నిధులు లేకుండా చేసావు జగన్ నువ్వు.
  • పంచాయితీకి నిధులు 1,342 కోట్లు విడుదల చేయకుండా, 1,144.71 కోట్లు విలేజ్ వాలంటీర్స్ కి, 1,555 గ్రామ సచివాలయానికి ఎలా ఇస్తావు? పంచాయితీ నిధులు ఎలా ఇస్తావు? దీనిపై కోర్టుకు వెళతాం జగన్ వైయస్ జగన్ .
  • నేను ఒకరోజు 2 కోట్లు సినిమాల్లో సంపాదించే వ్యక్తిని, ఒకరోజు బయటకు వస్తే 2 కోట్లు పోగొట్టుకున్నట్లు, అయినా సరే నేను మీకోసం వచ్చాను, నాకు సంపాదన మీద ఆశ లేదు, మీ కష్టాలు తీర్చాలని వచ్చాను.
  • మీరు పోరాడి నిలబడతారా, లేక పారిపోతారా అని ఆలోచించండి.
  • ప్రజల కష్టాలకు చలించి ఏడ్చే వాడు కావాలి, మీకు అండగా నిలబడే వాడు, యువతకు ఉపాధి అవకాశాలు , పారిశ్రామిక వేత్తలు గా మార్చే వారు కావాలి. ఎంతసేపు మీకు గొర్రెలు, బర్రెలు ఇస్తాం అంటే కాదు, ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు జనసేన ప్రభుత్వం గ్రాంట్ గా 10 లక్షలు ఇస్తుంది.
  • నేను పోరాటం చేయడానికి, దెబ్బతినడానికి, తణుకు నుండి విడివాడ రామ చంద్ర రావు గారిని MLA గా చేయడానికి ఉన్నాను.
  • ప్రజలందరూ కలిసి నడిస్తే వైసీపీ పార్టీ  ప్రభుత్వం దిగొస్తుంది. మన ఆంధ్రా ను రక్షించుకోడం కోసం
  • హల్లో ఆంధ్రా – బైబై జగన్

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్