పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ :
- మనందరం గర్వించే SV రంగారావు గారి సమక్షంలో సభ జరగడం ఆనందంగా ఉంది. సహజ నటనకు పర్యాయపదం, తన నటనతో అందరినీ డామినేట్ చేయగల గొప్ప నటుడు స్వర్గీయ SV రంగారావు గారు, ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను.
- జగన్ గారు నమస్కారము అండి, నేనండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండి, తాడేపల్లిగూడెం నుండి మాట్లాడుతున్నా అండి వైయస్ జగన్ .
- నేను రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాను, తరవాతి తరాన్ని, నా ఆడపడుచుల, ఉద్యోగుల భద్రత కోసం, శ్రామికుల శ్రమ దోపిడీ లేకుండా, అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండడం కోసం వచ్చాను.
- ముఖ్యమంత్రి జగన్, నాకు ఏకవచనం పిలవడం నచ్చదు, ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా కాల్ చేసి పిలిచాడు, నేను అభినందనలు చెప్పాను, ప్రజలు బలమైన మద్దతు ఇచ్చారు, నేను నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాను, ప్రజా సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకొస్తాను అని హుందాగా చెప్పాను.
- ఆఖరికి ఫ్యాక్షనిష్టులు, రాజుల కాలంలో కూడా మహిళలు, చిన్నపిల్లల జోలికి రాలేదు, నేను మహిళల భద్రత, యువతకు ఉపాధి, పోలీస్ అధికారుల సమస్యలు, స్కూల్స్ సమస్యల పై మాట్లాడను తప్ప ఏరోజు వారి కుటుంబ సభ్యులపై మాట్లాడలేదు, కానీ ఆయన, ఆయన పార్టీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఆడవారిపై, పిల్లలపై అసభ్యంగా మాట్లాడారు.
- జగన్ మీ సతీమణి రాజకీయాల్లో లేరు, ఒకవేళ ఎప్పుడైనా ఆమె ప్రస్తావన వచ్చినా భారతీ రెడ్డి గారు, మేడమ్ అని మాట్లాడుతామని, రాజకీయాల్లో లేని వ్యక్తి గురించి మాట్లాడం. కానీ జగన్ మాట్లాడితే పెళ్ళాం, పెళ్ళాం అంటాడు, సంస్కార హీనుడివి జగన్ నువ్వు, భార్య, సతీమణి, సహధర్మచారిణి అని గౌరవంగా పిలవాలి, అనే ఇంగితజ్ఞానం లేని వ్యక్తి వి జగన్ నువ్వు వైయస్ జగన్ .
- ఇంట్లో పిల్లలను చూసుకునే ఆడవారిపై పిల్లలు ఉన్న సభలో మాట్లాడిన వ్యక్తిని జగన్ నువ్వు, ఇంత సంస్కార హీనుడిగా మారతావు అనుకోలేదు జగన్ నేను, నువ్వు నీచంగా దిగజారావు జగన్ వైయస్ జగన్ .
- జగన్, వారి మనుషులు అనే మాటలకు నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఏం చేయలేని, ప్రజా జీవితంలోకి వచ్చాను, నా వల్ల నిన్ను అంటున్నారు క్షమించు అని నేను నా భార్యకు చెప్పాను, ఆడబిడ్డల అవమానించే వ్యక్తిని జగన్ నువ్వు వైయస్ జగన్
- గత కొన్ని రోజులుగా నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను, 2.5 లక్షల వాలంటీర్లు నా చెల్లెళ్ళు, తమ్ముళ్లు లాంటి వారు. నేను మీ పొట్ట కొట్టాలి అనిన్నేను ఎప్పుడు అనుకోను, అవసరమైతే ఇంకో 5 వేలు కలిపి మీకు 10వేలు ఇచ్చే వ్యక్తిని నేను.
- ఒక బుట్ట మామిడిపండ్లు 2 కుళ్ళిపోతే వాటిని తీసేయాలి లేకపోతే మొత్తం కుల్లిపోతాయి. అలాగే వాలంటీర్లలో కొంతమంది తప్పులు మీపై పడుతున్నాయి, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను.
- నేను యువత ఎదగాలి అనే కదా 10లక్షల పెట్టుబడి సాయం ఇస్తాను అన్నాను, అలాంటిది 5వేల సంపాదన విషయంలో నేను పొట్ట కొట్టాలి అని ఎలా అనుకుంటాను? జరుగుతున్న తప్పులు చెప్పాను.
- శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేసిన వ్యక్తి వైయస్ జగన్ .
- వాలంటీర్ వ్యవస్థ అంటే ఏమిటి? వాలంటీర్ అనేది చాలా గొప్ప పని..
- స్వచ్ఛందంగా, జీతం ఆశించకుండా, పని చేసే వ్యక్తి.
- భారత్ రెడ్ క్రాస్ సంస్థకు రాష్ట్రపతి, రాష్ట్ర శాఖలకు గవర్నర్లు ప్రెసిడెంట్ గా భాద్యతలు వ్యవహరిస్తారు.
- జగన్ నీ వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరు చెప్పు.
- జగన్ మా నాన్న కానిస్టేబుల్ గా మొదలు పెత్తి, ASI గా రిటైర్ అయిన వ్యక్తి, వైయస్ జగన్ తండ్రిలా 6% కమిషన్ ముఖ్యమంత్రి కొడుకుని కాదు. కష్టపడ్డాం, నటులు అయ్యం, సంపాదిస్తున్నాము.
- వాలంటీర్స్ వ్యవస్థ కేంద్రం హైదరాబద్ నానక్ రామ్ గూడలో ఉంది. అంధ్రప్రదేశ్ ప్రజల డేటా హైదరాబాద్ నానక్ రామ్ గూడ కంపెనీలో ఎందుకు పెట్టావ్? దీనిపై నీ సమాధానం ఏంటి వైయస్ జగన్ ?
- వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించే విషయంలో మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిపై మాట్లాడుతున్నాను.
- శింగనమల లో ఇద్దరు 16ఏళ్ల బాలికలను కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు
- బాపట్లలో 17 ఏళ్ల యువతిపై 3 నెలలు అత్యాచారం చేశారు
- పశ్చిమగోదావరి జిల్లా లక్కవరంలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు
- ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు
- తిరువూరులో స్నానం చేస్తున్న బాలిక వీడియోలు తీసి వేధింపులు చేస్తున్నారు
- ఇలాంటివి చాలా ఉన్నాయి జగన్, నీ వాలంటరీ వ్యవస్థలో కొంతమంది దుర్మార్గులు, కిరాతకులు ఉంటే ఏం చేస్తున్నావ్? వీటికి జవాబుదారీ ఎవరు వైయస్ జగన్
- భారత్ రెడ్ క్రాస్ సంస్థకు రాష్ట్రపతి, రాష్ట్ర శాఖలకు గవర్నర్లు ప్రెసిడెంట్ గా భాద్యతలు వ్యవహరిస్తారు, నీ వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరు, భాధ్యత ఎవరు తీసుకుంటారు వైయస్ జగన్
- తిరుపతిలో నీ వాలంటీర్లు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారు, గుంటూరులో యువకుడిపై రౌడీయిజం చేశారు, మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు, అద్దంకిలో లంచం తీసుకుని అనర్హులకు అర్హులుగా పథకాలు ఇస్తున్నారు. 6, 8 సంవత్సరాల బాలికలపై లైంగిక దాడులు చేసేవారిని ఈ వైయస్ జగన్ & కో దైవాంశ సంభూతులు అని అంటున్నారు.
- మాట్లాడితే నా మీద నోటీసులు పంపే మహిళా కమిషన్, వైయస్ జగన్ కు చెబుతున్నా, మీ వాలంటీర్లు రెక్కీ చేస్తున్నారట, ఒంటరి ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారట, తల్లితండ్రులు పనులకు వెళ్ళినప్పుడు అవకాశాలు చూస్తున్నారట, లోంగకపోతే పథకాలు తొలగిస్తాం, పాత్రలు సరిగా లేవు అని బెదిరిస్తున్నారట నీ వాలంటీర్లు వైయస్ జగన్ .
- పరువు పోతుందని చాలా మంది తల్లితండ్రులు వాలంటీర్లు దారుణాలపై బయటకు చెప్పట్లేదు.
- మీరు ధైర్యంగా బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, స్పందించకపోతే సలెక్టర్ కు కంప్లైంట్ ఇవ్వండి, మీకు నేను జనసేన అండగా ఉంటుంది.
- నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదు, మా జగన్ నేరం చేసి జైలుకు వెళ్లి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, మేము కూడా నేరం చేసి జైలుకు వెళ్లి వచ్చి నాయకుల అవుతాం జగన్ లా అని అనుకుంటున్నారు. వైయస్ జగన్ ఇది నువ్వు తీసుకొచ్చిన మార్పు, నీ లెగసీ.
- వాలంటీర్లకు కనీసం డబ్బులేనా ఇస్తున్నారా అంటే, 5,200 , అందులో 200 సాక్షి పేపర్ కి ఇవ్వాలంటే. 12 నెలలకు 60 వేల జీతం. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద పనిచేసే వారికి 264 రూపాయలు రోజుకి, వాలంటీర్ కు రోజులు ₹164.38 పైసలు. రాష్ట్రంలో ఆంధ్రా గోల్డ్ విస్కీ ₹130, బూమ్ బూమ్ 220 రూపాయలు ఉంది.
- మీ జీవితం బూమ్ బూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ కు ఎక్కువ అన్నట్లుగా మార్చేశారు ఈ వైసీపీపార్టీ నాయకులు.
- జనవాణి ప్రారంభం అయింది ఒక వాలంటీర్ వేదన వల్ల.
- అందరినీ మింగేసే జగన్ అనే అనకొండ వాలంటీర్ శివ శ్రీ ఇంటిని దోచేసింది, నాకు కంప్లైంట్ ఇచ్చినందుకు ఆ అమ్మాయి అన్నను చంపేసి శవాన్ని ఇంటికి పంపారు, ఇది వైయస్ జగన్ చేసింది
- నేను మిమ్మల్ని మంచి వ్యాపారస్తులు గా, పారిశ్రామిక వేత్తలుగా, సైంటిస్టులుగా చూడాలి అని అనుకుంటున్నాను.
- మాట్లాడితే మా జగన్ పసివాడు, విస్కీ, బ్రాందీ తాగడు, ఆవుపాలు తాగే పసిబిడ్డ అంటారు. ఈ వ్యక్తి మద్యపాన నిషేదం అని చెప్పి వచ్చి లక్ష కోట్ల మద్యం ఎలా అమ్మాడు? కల్తీ మద్యం ఎలా అమ్మాడు? ఆడబిడ్డల తాళిబొట్టు ఎలా తెంపారు? నవ్వుతుంటాడు.
- మన మహేష్ బాబు గారి తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయి, మహేష్ గారు దుఖంలో ఉంటే నేను వెళ్లి వచ్చాను, కాసేపటికి ఈ వైయస్ జగన్ వెళ్లి నవ్వుతూ ఉన్నాడు, ఇదేనా సంస్కారం.
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతమంది డిగ్రీలు, B tech, B.ED పూర్తి చేస్తున్నారు, వారికి ఉపాధి ఎక్కడ ఉంది అనేది ఆలోచించండి.
- పాపం జగన్ రోడ్డు మీద తిరిగాడు అండి, తండ్రిలేని బిడ్డ అండి అని అవకాశం ఇచ్చారు, ఆ తండ్రి లేని బిడ్డ లక్ష కోట్లు వెనకేసాడు. రోడ్డు మీద తిరుగుతుంటే నిన్ను భరించలేక ముఖ్యమంత్రిని చేశారు, నువ్వు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్ళావు.
- ఆడపడుచులు కోరుకున్న చోట మద్యనిషేధం చేస్తాం, కాలేజీలు, కాలనీల దగ్గర మహిళలు ఇబ్బంది పడే చోట్ల సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తాం. ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ మొదటి ప్రాధాన్యత.
- ప్రపంచంలో సంపూర్ణ మద్యపాన నిషేదం ఎక్కడా జరగలేదు, మహిళలు కోరుకున్న చోట్ల తప్ప.
- జనసేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కల్తీ మద్యం లేకుండా చేస్తాం, స్వచ్ఛమైన మద్యం పాతరేట్లకు ఇస్తాం, మహిళలు కోరుకున్న చోట నిషేదం చేస్తాం.
- జగన్ గురించి “అయోగ్యుడు మావాడు” అని పుస్తకం రాయండి, ముందుమాట నేను రాస్తాను.
- చాప్టర్లు:
- సంస్కార హీనత
- వనరులు, ఖనిజాల, మానవ వనరుల దోపిడీ
- శాడిజం, పైశాచిక ఆనందం
- డబ్బు మాది, దారిదోపిడి దొంగల్లా ప్రజల డబ్బు ఎలా దొచుకోవచ్చు
- దౌర్జన్యం, రౌడీయిజం ఎలా చేయచ్చు
- ఆఖరి ఘట్టం: జనసైనికులు, వీర మహిళలు, విప్లవకారుల చేతిలో చావుదెబ్బ ఎలా తిన్నాం
- పుస్తక నీతి by జగన్: నాలా ఎవరు అవ్వకండి, అయితే నాలా అయిపోతారు.
- మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు ఈ జగన్, RTI ద్వారా వివరాలు తెప్పించాం
- భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుండి ₹1,569 కోట్లలో, ఈరోజు 900 కోట్లు ఉంది, ₹669 కోట్లు దొచేసావు జగన్. కార్మికుల పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఆరోగ్యం, చనిపోతే ఇవ్వాల్సిన మట్టి ఖర్చుల సొమ్ము దొచేసావ్ జగన్.
- రాష్ట్రవ్యాప్తంగా 33 వేల భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ పెండింగ్ లో ఉన్నాయి, తాడేపల్లిగూడెంలో 250 క్లెయిమ్ పెండింగ్ లో ఉన్నాయి. నువ్వు ₹669 కోట్లు దోచేయడం వల్లనే జగన్.
- నాకు ముస్లిం సొదరులంటే ఎంతో ఇష్టం, వారికి నేనంటే ఇష్టం, కానీ నేను బీజేపీ తో కలిసి ఉన్నాను అని వారికి నచ్చదు, ఓటు వేయ్యం అంటారు, మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ 16 కోట్ల 47 లక్షలు పెట్టి, కేవలం 7 శాతం 1 కోటి 20 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాడు అని కాగ్ చెబుతుంది. మీరు నమ్మే జగన్ మీ షాది ముబారక్ తీసేసాడు అలాంటి వ్యక్తిని నమ్మకండి. నేను మీకోసం నిలబడే వ్యక్తిని, నేను బీజేపీ తో ఉన్నానా లేదా అని కాదు, మీకోసం నిలబడతానా లేదా అని ఆలోచించండి.
- ఆశా వర్కర్లు, టీచర్లు , ఉద్యోగులకు సకాలంలో నిధులు, జీతాలు రావడం లేదు. ₹291.07 కోట్లు, కానీ ఖర్చుపెట్టింది 22%, 64 కోట్లు మాత్రమే జగన్. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఖర్చు పెట్టకుండా మీ నిధులు మళ్ళించాడు.
- ఏ కులం వ్యక్తి అని కాదు, నాయకుడు మంచివాడా, కాదా, అందరికోసం నిలబడేవాడా కాదా అని ఆలోచించండి, నాయకుడు సరైనొడు కాకపోతే మన కులం వాడు అయినా ఉపయోగం లేదు.
- BC వర్గాల్లో రాజకీయ రిజర్వేషన్లు తీసేయడం వలన ఇప్పటికే నష్టపోయారు, ₹1,215 కోట్లు మీ సంక్షేమానికి విడుదల చేయకుండా మళ్ళించాడు, ₹144.07 కోట్లు బడ్జెట్ లో పెట్టి 25 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. YSR పెన్షన్ కానుకలో BC లకు ₹1,215 కోట్లు విడుదల చేయలేదు.
- నేను జానీ అని, భీమ్లా నాయక్ అని, నారాజు గాకుర మా అన్నయ్య అని ఎందుకు పెట్టానో తెలుసా, నేను రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు ఏకలవ్య శిష్యుడిని
- సినిమాల్లో హీరో ఎప్పుడు పెద్ద పేర్లు కాదు అని జానీ అనే ఒక దళిత యువకుడి కథ, భీమ్లా నాయక్ అని ఒక ట్రైబల్ హీరో పేరుతో సినిమా తీశాను.
- AP SC ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి దళితులకు సంబందించిన 336.47 కోట్ల డబ్బు తీసుకుని, మీకు విదేశీ విద్యా దీవెన, దళిత పథకాల డబ్బు మీకు ఇవ్వకుండా మోసం చేశాడు. మీ డబ్బులు తీసుకుని డబ్బు ఏమైందో ఎవరికి చెప్పలేదు, అలాంటి వ్యక్తిని మీ వాడు అని అనుకోవద్దు అని SC సమాజానికి చెబుతున్నాను
- అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రా కార్పొరేషన్ నుండి ₹363.81 కోట్లు అప్పు తీసుకుని బడ్జెట్ లో ఎందుకు చూపించలేదు? తాడేపల్లిగూడెంలో ఎందుకు రోడ్డు వేయలేదు? డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నావు జగన్? ఇది నీ ఇళ్లు కాదు జగన్.
- ఆఖరికి 18 కోట్లకు కూడా దోపిడీ చేస్తావేంటి జగన్ మరి దరిద్రంగా.
- బతుకుల మీద చెత్త టాక్స్ వేసే చెత్త ముఖ్యమంత్రివి జగన్, చెత్త ప్రభుత్వం నీది.
- నానక్ రామ్ గూడ లో FOA అనే ఏజెన్సీ కి ఆంధ్రప్రదేశ్ లోని ఆడపడుచుల, ప్రజల ఆధార్ కార్డ్ డేటా ఎందుకు ఇచ్చావ్? వాలంటీర్లు సేకరించిన డేటా అక్కడకు ఎందుకు వెళుతుంది? FOA ఏజెన్సీ ఎవరిది? ఏం చేస్తుందో విచారణ జరిపించాలి.
- వాలంటీర్లు రాజకీయ కారణాలు చెప్పి 24 ఆడపడుచులు పథకాలు ఆపేశారని హైకోర్టు కు వెళ్తే, ఏ లీగల్ అథారిటీ లేకుండా వాలంటీర్లు ఎలా ప్రజల నుండి అప్లికేషన్లు తీసుకుంటారు అని జస్టిస్ దేవానంద్ గారు ప్రశ్నించారు, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఎలా తీసుకుంటారు, డేటా లీక్ అయితే ఎవరు భాధ్యత వహిస్తారు అని జస్టిస్ కామెంట్ చేయలేదా జగన్.
- పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తావు, ఉపాధి అవకాశాలు కల్పించవు, ఎలా బ్రతకాలి జగన్, ఇక్కడకు పోవాలి జగన్, మా దగ్గర, ప్రజల దగ్గర మీ నాన్న లా దొచిపెట్టిన డబ్బు లేదు జగన్, మేము ఇక్కడే పనిచేసుకును బ్రతకాలి జగన్.
- అంగన్వాడీ వర్కర్ల ను కొట్టించడం ఏంటి జగన్? తెలంగాణ లో కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి అసలు జీతాలు ఇవ్వకుండా ఎందుకు భాద పెడుతున్నావు జగన్, మ్యానిఫెస్టోలో పెట్టవు కదా.
- జగన్ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారింది అంటే, టంగుటూరు లో హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ ఆడపడుచు తన హక్కులు అడిగినందుకు మీ కార్యకర్తలు చంపేశారు జగన్.
- జగన్ ఈ రాష్ట్రానికి డేంజర్.
- ఈ 4 సంవత్సరాల్లో లక్ష కోట్లు తన వారికి, కంపెనీలకు దొచిపెట్టాడు. ఉదాహరణ వాలంటీర్లకు 200 చొప్పున 2.9 లక్షల మంది జగన్ సొంత పేపర్ సాక్షికి సంవత్సరానికి 43.20 కోట్లు పంపిస్తున్నాడు, ఇది దోపిడీ కాదా.
- మిలటరీ మాధవరం 2,700 మంది సైనికులను దేశానికి ఇచ్చిన గ్రామం. అలాంటి గ్రామంలో కనీస వసతులు లేవు, సరిహద్దుల్లో బలిదానాలు చేసే ఈ గ్రామాన్ని కనీసం ఈ చెత్త ముఖ్యమంత్రి పట్టించుకోడు, మిలటరీ మాధవరం గ్రామానికి జనసేన అండగా ఉంటుంది.
- నేను భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో ఒకడిని, నాకు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉందా? నేను ఇతర హీరోలతో పోటీ పడితే సంవత్సరానికి వెయ్యి కోట్ల సంపాదన ఉంటుంది. కానీ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో ఆలోచించండి.
- మీ భవిష్యత్తు భద్రంగా ఉండాలి, ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలి, రోడ్డుపై వ్యాపారాలు చేసుకునే వర్తకుల జీవితాలు బాగుండాలి, విద్యార్థుల సమస్యలు, లా & ఆర్డర్ సమస్యలు తీరుద్దాం అని వచ్చాను.
- నేను పెట్టుకుంటుంది దుర్మార్గులతో, సొంత చిన్నాన్న ను గొడ్డలితో చంపించిన వ్యక్తులతో, సొంత తల్లిని, చెల్లిని బయటకు పంపించిన వ్యక్తితో, సొంత బాబాయ్ కూతురుని అవమానించే వ్యక్తులతో, వారిపైనే గౌరవం లేని వ్యక్తికి బయట వారిపై గౌరవం ఏముంటుంది.
- సొంత తల్లిని, చెల్లిని బయటకు పంపించిన సంస్కార హీనుడు వైయస్ జగన్ వేరే వారి భార్యను పెళ్ళాం అని కాక గౌరవంగా ఎలా మాట్లాడుతాడు.
- నా బిడ్డలను ఏదైనా చేస్తాం అని అంటున్నారు, నాపై దాడులు చేస్తాం అని అంటున్నారు, అయినా సరే ఇలాంటి వ్యక్తులపై నేను పోరాడుతాను.
- నా భార్యను ఈ సంస్కార హీనుడు, నీచుడు వైయస్ జగన్ తొ తిట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రజల కోసం మీ జీవితాలు నాశనం అవ్వకూడదు అని మాటలు పడుతున్నాను.
- జగన్ నువ్వు నాపై ఎన్ని కేసులైనా పెట్టించుకో, నా వెంట్రుకతో సమానం జగన్, నేనేమీ భయపడను.
- జగన్ నువ్వు ఇప్పటివరకు రాజకీయ నాయకులతో, అధికారం కోసం వచ్చే వారితో పోరాడావు,మొదటిసారి నాలాంటి విప్లవకారుడు, రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తితో పోరాడుతున్నావు వైయస్ జగన్ .
- ఆఖరికి మహిళా ఉద్యోగులలో కూడా సంబంధాలు అంటగట్టే స్థాయికి ఈ జగన్ మనుషులు దిగజారారు, అమ్మా భారతి రెడ్డి గారు, ఈ సంస్కార హీనుడైన వైయస్ జగన్ కు, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులకు చెప్పు తల్లి, మీకు ఆడబిడ్డలు ఉన్నారు, మీకు భాద తెలుసు, వీరికి అర్థమయ్యేలా చెప్పండి, పనిచేసుకునే ఆడవారిపై అసభ్యంగా మాట్లాడకూడదు అని.
- కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు ధర్మం వైపు ఉన్నట్లుగా, ఈసారి ధర్మం మనవైపు ఉంది, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది, మన ప్రభుత్వం వస్తుంది.
- అభివృద్ధి జరగాలంటే..
- అరాచకం ఆగాలంటే..
- జనం బాగుండాలంటే..
- ఒక్కటే నినాదం..
- “Hello AP…Bye Bye YCP”
- “Hello AP… Welcome JSP”
- జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి
- “Hello AP…Bye Bye YCP”
- “Hello AP… Welcome JSP”
- Jaihind 🇮🇳