20వ రోజు ( హైలెట్స్ ) – దెందులూరు నియోజకవర్గ జనసైనికులతో సమావేశం

దెందులూరు

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • జగన్ రెడ్డి ఎవరో పెట్టిన పార్టీని నడుపుతున్నాడు. YSRCP అంటే యువజన రైతు కాంగ్రెస్ పార్టీ
  • యువజనులకు ఏమీ చేయని, శ్రామికులను దోచేసిన, రైతుల పొట్ట కొట్టిన పార్టీ ఈ వైయస్ జగన్, వైసీపీ పార్టీ
  • కొల్లేరు గురించి మాట్లాడటానికి కారణం పర్యావరణాన్ని పరిరక్షించేదుకు, లక్షల పక్షులు, మత్స్య జాతులు, వృక్ష సంపద దెబ్బతింటుంది. అక్కడ వారి జీవితాలు దెబ్బతీయడం కోసం కాదు
  • నేను పబ్లిక్ పాలసీల కోసం ఎవరి మీద ఆధారపడను, చదువుతాను, పరిస్థితులు అర్దం చేసుకుంటాను.
  • నన్ను బెదిరించిన వారు ఉన్నారు, వందల కోట్లు ఇస్తాం అని చెప్పినవారు ఉన్నారు, కాంట్రాక్టులు ఇస్తాం రాజకీయాల నుండి వెళ్ళిపొండి అని చెప్పినవారు ఉన్నారు, కానీ నేను అంబేద్కర్ గారి ఆశయాలతో వచ్చిన వాడిని, అలా పదవుల కోసం, డబ్బుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు .
  • జగన్ అంటే నాకు వ్యక్తిగత కోపం లేదు, అతను ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు, పాలసీలపై అవగాహన లేని వ్యక్తి.
  • YS రాజశేఖర్ రెడ్డి వచ్చిన తరవాత చేసిన పాలసీ వలన వ్యవస్థ నాశనం అయింది, ఒక పేద వర్గానికి చెందిన వ్యక్తిపై భారం పడింది, నాయకులు చేసిన తప్పుల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
  • మాట్లాడితే దళితులకు మేనమామ అని చెపుతాడు జగన్, మరి దళితులపై దాడులు జరుగుతుంటే ఏం చేశావ్ నువు వైయస్ జగన్
  • వాలంటీర్లపై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయి, వారు తప్పు చేస్తే పిర్యాదు చేయచ్చు, కానీ వాలంటీర్లకు చట్టబద్దత లేదు, వారు తప్పు చేస్తే ఎవరు బాధ్యులు?
  • ఉపాధి హామీ పథకం కోసం పనికి వెళ్ళే వారి కంటే తక్కువ వేతనం రోజుకు 160 మాత్రమే ఇస్తూ వాలంటీర్ల పేరుతో యువత శ్రమను దోపిడీ చేస్తుంది వైసీపీ పార్టీ  ప్రభుత్వం, డిగ్రీలు, MA లు చేసిన వ్యక్తులకు 5 వేలు సరిపోతాయా
  • యువతలో ఎంతో టాలెంట్ ఉన్న వారు ఉన్నారు, వారి టాలెంట్ 5 వేలకు కుదిస్తారా? వారికి ఎదిగే అవకాశాలు కల్పించడం లేదు అనేది నా భాద, ఆ జగన్మాత సాక్షిగా చెబుతున్నా వాలంటీర్ల కడుపు కొట్టాలని లేదు నాకు.
  • ఎంతో సున్నితమైన వ్యక్తిగత డేటా వాలంటీర్ల మొబైల్ లో ఉంటుంది,  ఆధార్, బ్యాంక్, నగదు వివరాలు, బార్య భర్తలు, వితంతువులు, ఇంట్లో వ్యక్తిగత విషయాలు అన్ని కూడా వాలంటీర్లు వద్దకు చేరుతున్నాయి, ఇది చాలా ప్రమాదకరం.
  • మంత్రులు MLA లు అరగంట, గంట ఎవరితో మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు, కానీ అరగంట, గంట లో మహిళలను వేధిస్తే సమస్య.
  • వైయస్ జగన్  నువ్వు పబ్ జి ఆడుతావో, ఆన్లైన్ గాంబ్లింగ్ ఆడుతావో మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల డబ్బుతో ఆడితేనే సమస్య.
  • ప్రొద్దుటూరు లో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడులు చేస్తే ఏ మీడియా నిందితుల గురించి మాట్లాడలేదు, కానీ నా వ్యక్తిగత జీవితంపై గంటల పాటు డిబేట్లు పెడతారు.
  • జగన్ మీ మెదళ్ళలో ఒక సాప్ట్ వేర్ పెట్టేసి, ఆయన చెప్పినట్లుగా బ్రతికేలా నిర్దేశిస్తున్నాడు, ఏ వ్యక్తికి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించే హక్కు లేదు, అది జగన్ కైనా సరే .
  • ఇంట్లో మహిళలు మిస్ అవుతుంటే ఊగిపోకుండా జగన్ లా శాంతంగా చేతులు ఊపుతూ మాట్లాడలేము, ఆవేశం వస్తుంది.
  • క్రియాశీలక కార్యకర్తలు జ్ఞానాన్ని సంపాదించండి, పాలసీలపై అవగాహన తెచ్చుకోండి.
  • నిన్న వాలంటీర్లు నా ఫోటోలను చెప్పులతో కొడుతున్నారు, ఆవేశంగా ఉన్నారు అని చెప్పారు. నేను మాట్లాడిన మాటలకు ఇంత ఆవేశ పడుతున్నారు అంటే తప్పు జరుగుతుంది అని వారికి అర్దం అయింది, నేను సరైన మార్గంలో వెళుతున్నాను, వాలంటీర్లు చేసేది తప్పు, ప్రజల డేటా ఎక్కడ పెడుతున్నారు అనేది ఆలోచించండి, నేను మీ పొట్ట కొట్టాలని మాట్లాడటం లేదు, తప్పు చేయిస్తున్నారు మీతో.
  • ప్రజలను లొంగదీసుకోవడం చాలా తేలిక, జగన్ అదే పద్దతి అనుసరిస్తున్నాడు. 6 లక్షల వాలంటరీ వ్యవస్థ 5 కోట్ల మంది ప్రజలను కంట్రోల్ చేస్తున్నారు అనేది ప్రజలుబర్డం చేసుకోవాలి.
  • మన రక్షణకు మనమే భాధ్యత తీసుకోవాలి, వేరేవారి చేతిలో పెట్టకండి.
  • రాష్ట్రంలో రోడ్ల దుస్థితి వలన ప్రతీ 3 ప్రమాదాల్లో ఒకరు చనిపోతున్నారు.
  • వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్క కులాన్ని ఒక్కోలా ఎఫెక్ట్ చేయదు, అందరినీ నాశనం చేస్తుంది, అలాగే సామాన్య అవసరాలు నీరు, గాలి, ఆహారం, మౌలిక సదుపాయాలు లాంటివి అందరి అవసరం, అలాంటి వాటి కోసం అందరం కలిసి పనిచేయాలి.
  • హోంమంత్రి taneti vanita , దొంగతనానికి వెళ్లి అత్యాచారం చేశారు, కావాలని చేయలేదు అని మాట్లాడుతారు, మాట్లాడే పద్దతి ఇదేనా? ఇలా మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ  నాయకులు.
  • 33 వేల ఆడపిల్లలు మిస్ అయితే అది మన సమస్య కాదు అంటారు, పోలీసులు మాకు తెలీదు అంటారు, నాయకులు మా కులం కాదు అంటారు, ఇలా ఎవరికి వారు నాకెందుకులే అనుకుంటే సమస్య మన ఇంటివరకు వస్తుంది.
  • అంధ్రప్రదేశ్ ని పట్టిపీడిస్తున్న “జగన్ అనే జలగకు” , నాలాంటి కోట్లాది మందికి  తెలిసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే కోపం వస్తుంది. 
  • జగన్ అనే జలగకు కోపం వస్తుంది, కిరాయి మూకలను దింపుతాడు.
  • జగన్ అనే జలగకు తెలియంది ఏంటంటే ఇన్నాళ్లు ఫ్యాక్షన్ వాళ్ళతో గొడవలు పెట్టుకున్నాడు, నాలాంటి విప్లవకారుడితో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలీదు

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్