2వ రోజు ( హైలెట్స్ ) – పిఠాపురం జనవాణి

జనవాణి
  • 15వ తేదీన గురువారం ఉదయం గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గ అంశాలు, పరిస్థితులు, సమస్యలుపై స్థానికంగా ఉన్న ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, ఇతర రంగాల పెద్దలతో సమావేశం అయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • జనవాణి వేదికగా రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు, భిన్న వర్గాల ప్రజలు ఆవేదనలు సమస్యలు తెలుసుకున్నారు.

( ఈరోజు పిఠాపురం జనవాణి కార్యక్రమం ద్వారా 34 అర్జీలు స్వీకరించారు )

  • కాకినాడ MLA ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులు చంపేస్తామని బెదిరిస్తున్నారు, ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తున్నారు – జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారితో పిఠాపురం యువకుడు.
  • 4 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్న ఉప్పాడ ప్రాంత గ్రామంలో, కనీసం స్మశాన వాటిక లేకపోవడం దురదృష్టకరం. గ్రామ పంచాయితీ కూడా వైసీపీ పార్టీ నాయకులు దొచేస్తున్నారు – జనవాణి కార్యక్రమంలో జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 
  • తుఫాన్ సమయంలో కనీసం షెల్టర్లు లేవు, ఇళ్లు ధ్వంసం అయితే కనీసం ప్రభుత్వం కట్టించలేదు, తుఫాన్ బాధితులను పట్టించుకోవడం లేదు – జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారితో ఉప్పాడ తీర ప్రాంత యువకుడు. 
  • జర్నలిస్టులకు అక్రిడియేషన్ సమస్య గురించి వారి తరపున జనసేన పోరాడుతోంది, మీకు అండగా నిలబడుతుంది – జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • గొల్లప్రోలు – తాటిపర్తి వెళ్ళే రోడ్డు దారుణంగా ఉంది, వర్షం వస్తే ప్రయాణాలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ముగ్గురు వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డుపై కొట్టుకొని పోయి చనిపోయారు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు – జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారితో గొల్లప్రోలు యువత. 
  • జిల్లాలో కాకినాడ MLA ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజమండ్రి MLA జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో గంజాయి సాగు, అమ్మకాలు జరుగుతున్నాయి. విద్యార్థులను గంజాయి బాట పట్టిస్తున్నారు – జనవాణి కార్యక్రమంలో యువకుడు
  • ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వైసీపీ పార్టీ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు  – జనవాణి కార్యక్రమంలో యువకుడు
  • మా భూములు ప్రభుత్వం తీసుకుని కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు, భూమి విలువని తగ్గించారు, స్పందన కార్యక్రమానికి వెళ్ళిన ఎటువంటి స్పందన లేదు – జనవాణి కార్యక్రమంలో పిఠాపురం యువకుడు
  • మా ఊరి చెరువుల్లో నుండి అక్రమంగా గ్రావెల్ తరలిస్తుంటే అడ్డుకున్నా అని నాపై తప్పుడు కేసులు పెట్టారు, పెళ్ళై 5 యేళ్లు అవుతున్నా రేషన్ కార్డ్ ఇవ్వట్లేదు, వైసీపీ పార్టీ నాయకులు వేధిస్తున్నారు  – జనవాణి కార్యక్రమంలో యువకుడు
  • పక్క రాష్ట్రాల్లో వేల సంఖ్యలో IT కంపెనీలు వచ్చి లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంటే, మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కంపెనీలు లేవు, వెయ్యి ఉద్యోగాలు లేవు. ఉన్న ఊరు వదిలేసి బెంగుళూరు వెళ్లి బ్రతకాల్సి వస్తుంది – జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారితో IT ఉద్యోగి

  పవన్ కళ్యాణ్ స్పీచ్ 

  • తాడేపల్లి లో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఒక ఆడబిడ్డ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు, ఇళ్లు కూల్చేస్తున్నారు అని నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే, ఆమె అన్నాను దారుణంగా చంపేశారు వైసీపీ పార్టీ గూండాలు. ఆ ఆడపిల్ల బాధ జనవాణి కార్యక్రమానికి స్ఫూర్తి
  • సుధాకర్ అనే వైద్యుడు మాస్కులు లేవు అన్నందుకు అతన్ని పిచ్చివాడుగా ముద్ర వేసి, అతని చావుకుంకారణం అయ్యారు వైసీపీ పార్టీ నాయకులు
  • చెరువుల్లో మట్టిని దోచేస్తున్నారు, పూడిక పేరుతో 40 అడుగుల లోతు త్రవ్వి గొయ్యి చేశారు. నీరు అందుబాటులోకి రాని స్థితికి తీసుకొచ్చారు వైసీపీ పార్టీ నాయకులు
  • ఈరోజు జన వాణి కార్యక్రమం ద్వారా 34 అర్జీలు స్వీకరించాను. ఇందులో యువత, రెల్లి కార్మికులు, మత్స్యకారులు, వివిధ వర్గాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి, రేపు పిఠాపురంలో వారాహి విజయ యాత్ర సభలో మాట్లాడుతాను
  • వారాహి విజయ యాత్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకురానుంది
  • మేము సీరియస్ రాజకీయాలు చేస్తున్నాం, మార్పు కోసం పనిచేస్తున్నాం. వైసీపీ పార్టీ నాయకుల పిచ్చి విమర్శలపై మాట్లాడను, రానున్న కాలంలో వారి ప్రతీ మాటకు సమాధానం మార్పు ద్వారా వస్తుంది. 

 

  • పట్టు రైతులు, చేనేత కళాకారులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమావేశం చేబ్రోలు పిఠాపురం నియోజకవర్గం
  • పిఠాపురం నియోజకవర్గం వీర మహిళలతో సమావేశం అయన జనసేనాని

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్