19వ రోజు ( హైలెట్స్ ) – ఏలూరు జనవాణి

జనవాణి

నాదెండ్ల మనోహర్ గారి స్పీచ్ 

  • ఏ రాజకీయ పార్టీలో కూడా మహిళలు పెద్ద స్థాయిలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరు, ఒక్క జనసేనలో మాత్రమే అత్యధిక సంఖ్యలో రాజకీయ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు – జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
  • వర్తమాన రాజకీయాల్లో పార్టీ కార్యకర్తల రక్షణ కోసం, వారి గురించి ఆలోచించే పార్టీ జనసేన, దానికి ఉదాహరణ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం.
  • ప్రతీ ఒక్క జనసైనికుడు, నాయకులు, వీర మహిళలు ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాలి, వైసీపీ పార్టీ ప్రభుత్వం చాలా ఓట్లు లేకుండా చేసింది అని తెలిసింది, దయచేసి మీరు ఓటు ఉందా లేదా అనేది గురించి, అవగాహన కల్పించాలి.
  • వివిధ దేశాల నుంచి NRI లు ప్రతి నెల జీతం రాగానే వారి వంతుగా ఏ లాభాపేక్ష లేకుండా విరాళం ఇస్తున్నారు, వారు ఏ పదవి ఆశించడం లేదు, వారు పుట్టిన నేల కోసం వారు పార్టీకి అండగా ఉన్నారు.
  • సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శను తిప్పి కొట్టండి, ఏ విధమైన తప్పుడు ప్రచారం చేసినా సరే జనసైనికులు తిప్పికొట్టండి, బలమైన న్యాయ విభాగం ఏర్పాటు చేశాం, ఏ విధమైన తప్పుడు కేసులు పెట్టిన పార్టీ న్యాయ విభాగం మీకు ఉచితంగా అండగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • జనసేన ఒక కుటుంబం, ఈ కుటుంబంలో ఏ ఒక్క జనసైనికుడు, వీర మహిళలకు కష్టం వచ్చినా కుటుంబంలో అందరం అండగా ఉంటాం
  • మనది Committed Cadre Based Party, అందుకే మన పార్టీపై గెలిచిన MLA వెళ్ళిపోయినా సరే కార్యకర్తలు రాజోలు లో పార్టీని నిలబెట్టారు, అంత బలమైన క్యాడర్ ఉంది మనకు. గెలుపోటములకు అతీతంగా వెన్నంటే ఉన్నారు, అందుకే వైసీపీ పార్టీ కి మనం అంటే భయం.
  • జగన్ లాంటి వారితో పోలిస్తే బ్రిటిష్ వారు కూడా బాగానే పాలించారు, వారి అవసరాల కోసం కనీసం కాలేజీలు కట్టించారు, కానీ ఈ వైయస్ జగన్ మన ఏలూరులో కనీసం కాలేజ్ బాగుచేయలేకపోయాడు.
  • నేను మార్పు కోసం చాలా బాధ్యతగా పనిచేస్తున్నాను, నేను కోట్లు సంపాదించగలిగే వ్యక్తిని, అయినా సరే నేను మీకోసం వచ్చి మాటలు పడుతుంది కేవలం ఈ వ్యవస్థ మార్చాలి అనే ఉద్దేశంతో.
  • జగన్ అనేవాడు మంచివాడా కాదా, పవన్ కళ్యాణ్ అనేవాడు మంచివాడా కాదా అనేది ప్రజలు ఆలోచించడం మొదలుపెడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రజలు గొంతెత్తి  మాట్లాడాలి.
  • లక్షల మంది నాతో ఉన్నా లేకపోయినా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశం కోసం నిలబడి ఉంటాడు పోరాడతాడు.
  • నేను ఊరికే ఆరోపణ చేయను, ఈ ముఖ్యమంత్రి జగన్ అర్హత లేనివాడు, ఆయన కనీసం ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వలేని వ్యక్తి.
  • ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇంట్లో భార్య గురించి మాట్లాడితే వ్యవస్థ ఎలా ఉంటుంది? మధ్యయుగాల కాలంలో కూడా ఆడవారి జోలికి, పిల్లల జోలికి వచ్చేవారు కాదు, కానీ ఈ వైయస్ జగన్ నిస్సహాయంగా ఉండే ఆడవారిపై అవమానించేలా మాట్లాడుతాడు.
  • ఇంట్లో తల్లితండ్రులు తిట్టుకుంటూ లేస్తే, పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు.
  • ఒక ముఖ్యమంత్రి మహిళలను మాటలు అంటుంటే, బాపట్ల నియోజకవర్గంలో రెడ్డివారిపల్లిలో మహిళలను విధిస్తారు, అడ్డు వచ్చిన అమర్నాథ్ అనే బాలుడిని తగలబెట్టి చంపే స్థాయికి వచ్చింది.
  • వాలంటీర్ల పొట్ట కొట్టాలని నాకు లేదు.
  • వారికి కేవలం 5 వేలు ఇస్తున్నారు. ఈ దేశ సంపద యువత, వారిని ఎందుకు 5 వేల రూపాయలకు కట్టి పడేస్తున్నారు? వారిలో బలమైన వ్యాపారస్తులు, సైంటిస్ట్, ఇంజనీర్లు ఉంటారు, వారిలో దాగున్న సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. డిగ్రీ చదివిన వ్యక్తులకు కేవలం 5 వేలు ఇచ్చి ఊడిగం చేయిస్తారా? జాతీయ ఉపాధి హామీ పథకం కంటే తక్కువ సంపాదిస్తున్నారు.
  • రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అనడానికి వాలంటీర్ల వ్యవస్థ ఉదాహరణ. ఉద్యోగాలు లేక 5వేల రూపాయలకు డిగ్రీలు చదివిన వ్యక్తులు పనిచేయడానికి సిద్ధపడ్డారు అంటే అర్దం చేసుకోండి, వారికి భవిష్యత్తు ఎక్కడ.
  • నాకు నిజంగానే డిల్లీలో పెద్ద వ్యక్తులు ఇక్కడ మహిళల మిస్సింగ్ కేసుల గురించి చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది వ్యక్తులే ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పారు. @NCRBHQ నివేదికలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.
  • వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటిలో వ్యక్తిగత విషయాలు, ఎంత సంపాదన, ఏం చేస్తారు, భార్య, భర్తలు కలిసి ఉన్నారా, విడిపోయారా, బ్యాంక్ వివరాలు ఇంకా ఎన్నో వ్యక్తిగత వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది, ఆ డేటా ఎక్కడకు వెళుతుంది? ఆ డేటా ఏం చేస్తున్నారు.
  • రాష్ట్రంలో కలెక్టర్, MLA, MRO, పంచాయితీ ఇలా అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను భయానికి గురిచేసేందుకా?
  • వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అలాంటప్పుడు వారికి ప్రజల వ్యక్తిగత వివరాలు ఎందుకు ఇవ్వాలి?
  • రాష్ట్రంలో వాలంటీర్లు, వైసీపీ పార్టీ సైన్యం ఒక 5 లక్షలు ఉంటారా? వారికి నెల నెల ఇచ్చే 5 వేలు ప్రజల నుండి వెళ్తుంది, వారి వివరాలు బయట పెట్టు వైయస్ జగన్జి
  • ల్లా, ఎస్పీ అధికారులు వాలంటీర్లను మానిటర్ చేయడానికి, పిర్యాదులు కోసం ఒక వాట్సప్ లాంటి గ్రూప్ ఏర్పాటు చేయండి.
  • దాదాపు 10లక్షల పౌర సరఫరాల వ్యాన్ ప్రభుత్వం కొనింది, సరఫరా అనంతరం ఆ వ్యాన్ ఎక్కడకు వెళుతుంది? దేనికి ఉపయోగిస్తున్నారు? ఎవరి కంట్రోల్ లో ఉంటున్నాయని ఒకసారి గమనించండి.
  • మన ఊర్లో, మన వీధిలో ఆడవారు అందరూ క్షేమంగా ఉన్నారా, ఒంటరి మహిళలు, బాలికలు జాగ్రత్తగా ఉన్నారా లేదా ఒకసారి కంట కనిపెట్టండి, ఒక్క సమీక్ష కూడా చేయలేదు వైయస్ జగన్ ఆడవారి మిస్సింగ్ కేసుల గురించి.
  • కడప జిల్లా, ప్రొద్దుటూరు లో ఒక దళిత మైనర్ బాలికను అదేపనిగా అత్యాచారం చేశారు, గర్భం వచ్చింది, ఆ విషయం ఎవరికైనా తెలుసా? వాలంటీర్లు ఈ కేసులో ఉన్నారు, ప్రస్తుతం ఆ బాలిక సంరక్షణ కేంద్రాల్లో ఉన్నారు.
  • ఆడబిడ్డలు ఉన్న ప్రతీ ఒక్క కుటుంబం ఈ వాలంటీర్ వ్యవస్థపై ఒక కన్ను వేసి ఉంచండి, అనవసర డేటా ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి.
  • వాలంటీర్ అందరూ తప్పు చేస్తున్నారు అనడం లేదు, 100 లో 10 మంది తప్పు చేస్తున్నారు, వారి వలన సమాజం నష్టపోతుంది.
  • జగన్ నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాద కారంగా మారుతుంది.
  • సమాంతర పోలీస్ వ్యవస్థలా మారింది, ప్రజలను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్ళారు, జగన్ ఒక్క బటన్ నొక్కి గ్రామంలో ఎవరు వైసీపీ పార్టీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇళ్లలోకి వాలంటీర్ రూపంలో దూరుతున్నారు, వారు మిమ్మల్ని పథకాలు రావు అని భయపెడుతున్నారు.
  • 1892 కాలంలో పులివెందుల సరస్వతి నిలయంగా ఉండేది, ఈ జగన్ కుటుంబం ఫ్యాక్షన్ కేంద్రంగా మార్చేశారు

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్