పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- వారాహి 2వ దశ విజయ యాత్ర కు ఏలూరులో ఇంత ఘన స్వాగతం లభిస్తుంది అనుకోలేదు, దారిపొడవునా అక్కాచెల్లెళ్ళు, తల్లులు ప్రేమాభిమానాలు చూపించారు.
- హల్లో AP – బైబై వైసీపీ అనే నినాదం చాలా నలిగిపోయి, ప్రజలు బాధలు పడ్డాక బయటకు వచ్చింది, ఇది నా నుండి వచ్చిన నినాదం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి వచ్చిన నినాదం
- నేను ఎందుకు ఇన్ని దెబ్బలు, అవమానాలు పడాలి? మీరు అభిమానించే హీరోను , సరదాగా రాజకీయాల్లోకి రాలేదు.
- స్కూల్లో మహనీయుల గురించి చెప్పి, విలువలు నేర్పించి, బయట నేరగాళ్లు, విలువలు లేని వాళ్ళు పాలిస్తుంటే నచ్చలేదు, మీ భవిష్యత్తు కోసం పనిచేయాలి, అని గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా పర్లేదు అని పోరాటానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను.
- నేను రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటే, వైసీపీ పార్టీ నాయకులు నా తల్లి గురించి, నా ఇంట్లో ఆడవారి గురించి, పిల్లల గురించి మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు.
- అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ గారి స్ఫూర్తి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది.
- ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ , మంచోడా, చెడ్డొడా అని చూడకుండా ఆ స్థానానికి నేను గౌరవించని, జగన్ రెడ్డి గారు అని గౌరవించాను…
- ఈరోజు నుండి అంబేద్కర్ గారి సాక్షిగా జగన్ రెడ్డి ని ఏకవచనంతో పిలుస్తాను, ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు.
- ఈ వ్యక్తి వైయస్ జగన్ , వైసీపీ పార్టీ రాష్ట్రానికి సరైనది కాదు.
- 2024 లో వైయస్ జగన్ , వైసీపీ పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుండి, యువతీ, యువకుల ఉద్యోగ సమస్యలు, ఆడపడుచుల రక్షణ, రోడ్ల సమస్య, గంజాయి సమస్యలు ఉన్నాయి, ఈరోజు వీటి గురించి మాట్లాడుతాను.
- మనం వైయస్ జగన్ కు బానిసలు కాదు, ఆయన మనలో ఒకడు అంతే. మన అందరం టాక్సులు కడితే, ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తి, ఆయన కేవలం జవాబుదారీ మాత్రమే. ఆ డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు.
- ప్రభుత్వ ఖజానా సొమ్ము దేనికి ఖర్చు పెట్టారు అనేది CAG వారికి లెక్క చెప్పాలి,
- 2021-2022 నివేదిక ప్రకారం దాదాపు 25 లోపాలు ఎత్తి చూపించింది. ఇక్కడ నిధుల దుర్వినియోగం చేశారో నివేదిక ఇచ్చారు.
నివేదిక ప్రకారం :
- Of budget borrowing క్రింద 1.18 లక్షల కోట్లు , ఎవరికి చెప్పకుండా అప్పు చేశారు. దీని గురించి అడిగితే వైసీపీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు – జగన్ నువ్వు దీనికి సమాధానం చెప్పాలి.
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద 22,504 కోట్ల అప్పు తీసుకున్నాడు, స్టేట్ రోడ్ డెవలప్మెంట్ క్రింద 4,754 కోట్ల అప్పు తీసుకున్నాడు, ఇది ఎక్కడ బడ్జెట్ లో చూపించలేదు ఈ జగన్, ఈ డబ్బులు దేనికి ఖర్చుపెట్టావ్ వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఏ రోడ్లు బాగుచేయడం కోసం ఆ నిధులు ఉపయోగించావో రేపు ప్రెస్ మీట్ పెట్టు చెప్పాలి జగన్.
- 2021-22 సం.లో రాష్ట్ర ట్రెజరీ అనుమతి లేకుండా adjustment transaction క్రింద 11,237 కోట్ల అప్పు చేశారు, దీనికి సంబందించిన సరైన పాత్రలు కానీ, బిల్లులు కానీ లేవు. ఒక ఫీజ్ రీయంబర్స్మెంట్ కోసం అనేక పత్రాలు అడుగుతారు, మరి మీరు పత్రాలు, బిల్లులు సమర్పించరా?
- బడ్జెట్ లో ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకు (పింఛన్లు, రేషన్ ఇతర పథకాలు) 7,762 కోట్లు, కానీ వీటిని సంక్షేమం కోసం వాడలేదు, మరి దేని కోసం వాడావు జగన్? ఈ డబ్బు YSR పెన్షన్ కానుక కు వాడలేదు, రైతుల ధాన్యం ధర స్థిరీకరణ కోసం (300కోట్లు) వాడలేదు , గర్భిణీ స్త్రీల ఔషధాల కోసం (390 కోట్లు) వాడలేదు, మరి దేనికీ వాడారు?
- Implementation of national tertiary hospital కోసం కేంద్రం 250 కోట్లు ఇస్తే, ఖర్చుపెట్టక పోగా వాటిని కేంద్రానికి తిరిగి ఇవ్వలేదు, వేటికి ఖర్చుపెట్టారు అనేది చెప్పలేదు ఈ వైయస్ జగన్ ఈరోజు ఏలూరు లో పెద్ద హాస్పిటల్ లేదు అంటే కారణం ఆ డబ్బు జగన్ దోచేశాడు.
- దివ్యాంగుల, స్త్రీ, శిశు సంక్షేమానికి 537.69 కోట్లు కేటాయించి, కేవలం 4% మాత్రమే ఖర్చుపెట్టారు. మిగతా డబ్బు ఏమైంది. దివ్యాంగులు ఏడుస్తున్నారు, వారికి ఎందుకు ఖర్చుపెట్టరు?
- నేను ఈరోజు మాట్లాడేది ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, కానీ ఎందుకు వైసీపీ పార్టీ నాయకులు ఏం సంబంధం లేని నా భార్యను, రాజకీయాలు తెలియని నా తల్లిని తిడుతున్నారు? నేను మీ కోసం మాట్లాడితే వారు కుటుంబాన్ని, ఆడవాళ్ళని తిడుతున్నారు.
- ఈ వైసీపీ పార్టీ వారు ఎలా అయ్యారంటే… నేను ఏం మాట్లాడినా వక్రీకరించి, వంకరగా, వెకిలిగా మాట్లాడతాడు ఈ వైయస్ జగన్
- ఇక్కడ ఏలూరులో 300 మంది స్పృహ తప్పి పడిపోయారు అనే విషయంపై ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం.
- ఏలూరు కార్పొరేషన్ లో అక్రమాల గురించి 1800 పేజీల రిపోర్ట్ IAS అరుణ్ కుమార్ గారు రాస్తే కనీసం ఈరోజు వరకు చర్యలు తీసుకోకుండా, నిజాయితీగా ఉన్న అతన్ని ట్రాన్స్ఫర్ చేసింది ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం.
- ఏలూరు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్రం అమృత్ పథకం క్రింద నిధులు ఇస్తే వీరు పనులు మొదలు పెట్టకుండా మురికి కాలువల పక్కన మిమ్మల్ని ఉంచారు. ఇక్కడ మురికి కాలువలు ఇలా ఉండడానికి కారణం డ్రైనేజీ డబ్బులు వైయస్ జగన్ దొచేసాడు కాబట్టి.
- క్లాస్ వార్ అంటాడు ఈ వైయస్ జగన్ . పేదలకు ఇల్లు కట్టిస్తా అని అనంతపురం నుండి ఒక వ్యక్తి లక్ష రూపాయల చొప్పున తీసుకుని పరారయ్యాడు, ఈరోజు వరకు వారిపై చర్యలేదు.
- క్లాస్ వార్ అనే వైయస్ జగన్ . ఇక్కడ కృష్ణా జ్యూట్ మిల్లు లో దాదాపు 3000 మంది పని చేస్తున్నారు, దాదాపు 10 వేల మంది ఆధారపడి ఉన్నారు, మిల్లు మూసేస్తే ఎందుకు యాజమాన్యంతో మాట్లాడలేదు, అండగా నిలబడలేదు వైసీపీ పార్టీ ? నేనా నువ్వా క్లాస్ వార్ చేసేది.
- ఏలూరులో అనేక కులాలు, మతాల వారు ఉన్నారు, వారి అందరి కోసం మాట్లాడుతాను. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అందరికీ కావాలి, ఒక కులానికి కాదు, నేను వీటికోసం ప్రాణం పోయేవరకు పనిచేస్తాను.
- ఏలూరు అనగానే కొల్లేరు సరస్సు గుర్తొస్తుంది. ఇక్కడ ఒకప్పుడు 20లక్షల పక్షులు వచ్చేవి, 65 రకాల మత్స్య జాతులు, 16 రక్షల వృక్ష జాతులు ఉండేవి, ఉప్పు సాంద్రత పెరిగిపోయింది. కొల్లేరు రక్షించుకోవాల్సిన భాధ్యత మీది, మనందరిది .
- ఒక దేశం అభివృద్ది అవుతుంటే అందులో భాగమైన మన రాష్ట్రం కూడా అభివృద్ది చెందాలి. కానీ జగన్ , ఆయన కుటుంబం, మంత్రులు అభివృద్ది అవ్వడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలు , ఆదాయం పెరగనప్పుడు అభివృద్ది ఎలా? మంత్రులు, ఎమ్మెల్యేలు వందల కోట్లు దొచేస్తున్నారు.
- చిన్న టీ షాప్ లో కూడా డిజిటల్ పే చేస్తుంటే, మద్యం షాపుల్లో మాత్రం కేవలం క్యాష్ అంటాడు ఈ వైయస్ జగన్ , మద్యం పైన లక్ష పాతిక వేల ఆదాయం సంపాదించారు, ఆ డబ్బు రేపు ఓట్లు కొనడానికి ఉపయోగిస్తారు.
- జగన్ నువ్వు మధ్య నిషేదం చేస్తాను అని చెప్పి అధికారం లోకి వచ్చి, మద్యం మీద లక్షల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నావు జగన్, నీ కల్తీ మద్యం వల్ల 32 మంది ఆడపడుచుల తాళిబొట్టు తెంపేసావు జగన్ వైయస్ జగన్
- ఇక్కడ స్మశానంలో అనాధ శవాల క్రియలు 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంస్థను లేకుండా చేశాడు ఈ జగన్.
- మాట్లాడితే ఈ జగన్ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను అంటాడు, జగన్ నేను మీ నాన్న గారిలా ప్రాజెక్టుల మీద 6% కమీషన్ దొచేయలేదు, వేల కోట్లు ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని దొచుకొలేదు జగన్, సామాన్య కుటుంబం నుండి వచ్చాను జగన్, సినిమాల్లో సంపాదించిన డబ్బు కౌలు రైతులకు ఖర్చుపెడుతున్నాను జగన్.
- ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టు ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఎందుకు పెట్టడం లేదు, ప్రశ్నిస్తారు అనేగా? పరదాల చాటున రాణిలా దాక్కుని వెళతాడు, మొహం చూపించకుండా ఉండటానికి నువ్వేమైనా రాణి వా? అలాంటప్పుడు పొయ్యి ఇడుపులపాయ ఎస్టేట్ లో కూర్చో.
- ఏ పల్లెకు తిరగవు, ఏ ఊరికి వెళ్ళనప్పుడు నువ్వు తాడేపల్లి లో ఉంటే ఏంటి, దాచేపల్లి లో ఉంటే ఏంటి జగన్.
- ప్రభుత్వంలో పారదర్శకత ఉండాలి.. భారత్ టిక్ టాక్, చైనా ఫేస్ బుక్ బ్యాన్ చేస్తే , ఈ జగన్ జీవో లను బ్యాన్ చేశాడు, ఎంత ఖర్చుపెట్టారు అనేది ఎవరికి తెలియకుండా, జగన్ నువ్వు జీవోలు ఎందుకు బ్యాన్ చేశావ్, ఎందుకు దాచిపెడుతున్నావ్.
- ప్రభుత్వం మారగానే జగన్ నిన్ను ఊరుకోరు తిప్పి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలా చేస్తాం, ప్రతి తప్పు బయటకు తీస్తాం వైయస్ జగన్
- 2021-22 లో 37,982 ప్రమాదాలు జరిగాయి, 14,230 మంది చనిపోయారు, ప్రతీ 3 ప్రమాదాలలో ఒకరు చనిపోయారు, నువ్వు రోడ్లు వేసి సస్తే ఈ ప్రమాదాలు జరిగేవి కాదు, రోడ్ల కోసం తీసుకున్న అప్పు ఏం చేశావ్ జగన్ వైయస్ జగన్
- చెత్తను క్లీన్ చేసే రెళ్ళి వర్గాల మీద కూడా చెత్త పన్ను వసూలు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్.
- నేను పదవుల కోసం వెంపర్లాడను, మీ కోసం యుద్ధం చేస్తాను, మీరు ఆశీర్వదిస్తే నాకు పదవి వేస్తే ఇంకా బలంగా పని చేస్తాను.
- ఆడబిడ్డల మాన, ప్రాణాల సంరక్షణ మన అందరిది, మొన్న తన అక్కను రక్షించబోయి 17ఏళ్ల అమర్నాథ్ అనే అబ్బాయిని చెరుకు తోటలో తగలబెట్టి చంపేశారు, వారికి ఎవరు ఇచ్చారు ధైర్యం.
- దాదాపు 33 వేల మంది మహిళలు మిస్సింగ్ అయితే ఎందుకు ఒక్క రివ్యూ కూడా పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ DGP గారు మీరు కూడా సమాధానం చెప్పాలి.
- నిఘా వర్గాల ప్రకారం, వైసీపీ పార్టీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల ను అడ్డుపెట్టుకుని ఎవరు ఏ పార్టీ, ఏ అలవాట్లు ఉన్నారు, ఎవరు ఉన్నారు ఇంట్లో, వితంతువులు ఎవరు అనేది సర్వే చేయించి, ట్రాప్ చేసి వితంతువులను, ఆడపిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు, వీటి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని నిఘా వర్గాలు చెప్పాయి, ఆడబిడ్డల ఉసురు తీసుకుంటున్నావు వైయస్ జగన్
- ప్రజల్ని అడ్డగోలుగా పన్నులు వేసేవాడికి, దారిదోపిడి చేసేవారికి తేడా లేదు, చెత్త పన్ను కూడా వసూలు చేసే చెత్త ప్రభుత్వం వైసీపీ పార్టీ ప్రభుత్వం.
- మీరు జగన్ కు గత ఎన్నికల్లో అండగా ఉన్నారు, కానీ ఆయన మీకు ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి, రోజుకు ఒక గంట సమాజం కోసం ఆలోచించి జనసేనకు అండగా ఉండండి.
- 18 ఏళ్ల వయసులోనే నేను 25 యేళ్లు బ్రతికితే ఎక్కువ అని అనుకున్న వ్యక్తిని, నేను చనిపోవడానికి సిద్ధపడి రాజకీయం చేస్తున్నాను జగన్, ఇది నా నేల, దేశం, నా వాళ్ళు అని వచ్చాను, భగత్ సింగ్ స్పూర్తితో వచ్చాను గుర్తు పెట్టుకో జగన్ వైయస్ జగన్
- ప్రజలు నన్ను గెలిపించినా, ఓడించిన సరే పవన్ కళ్యాణ్, జనసేన పోరాటం ఆపదు, నాకు మీ మీద ఉన్న ప్రేమతో వచ్చాను, పోరాడుతాను.
- లక్షమంది వస్తారు అని నేను రాలేదు, నేను ఒక్కడిని అయినా సరే నిలబడతాను గుర్తుంచుకో జగన్ వైయస్ జగన్
- నువ్వు క్రిమినల్ వి జగన్, మా దురదృష్టం కొద్దీ నువ్వు ముఖ్యమంత్రివి అయ్యావు, SI ని కొట్టే నువ్వు DGP ని, పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే చీ అనిపిస్తుంది జగన్ వైయస్ జగన్
- జగన్ కావాలా, వైసీపీ కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.
- అభివృద్ది జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, జగన్ అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి, జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి