17వ రోజు ( హైలెట్స్ ) – భీమవరం బహిరంగ సభ

భీమవరం

జనసేనలోకి ప్రముఖుల చేరికలు

  • జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనపార్టీ లో చేరిన కాకినాడకు చెందిన ప్రముఖులు శ్రీ తోట సుధీర్ గారు.
  • ప్రజల సంక్షేమం కోసం జనసేన లాంటి పార్టీకి బలంగా నిలబడాలి అని కాకినాడ నుండి తోట సుధీర్ లాంటి వ్యక్తులు రావడం సంతోషంగా ఉంది – జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
  • సమస్య ను ప్రశ్నించడమే కాదు పరిష్కారం కూడా చూపాలనేదే జనసేన లక్ష్యం

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • కాకినాడ నుండి ఈరోజు 150 మందికి పైగా నాయకులు తోట సుధీర్ గారి నేతృత్వంలో పార్టీలో చేరేందుకు రావడం ఆనందంగా ఉంది, వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను 
  • విలువైన విలువలు, చట్టంపై పట్టు ఉన్న సుధీర్ లాంటి నాయకులు పార్టీలోకి రావడం కాకినాడ లో రౌడీలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది
  • ఈరోజు తోట సుధీర్ గారితో పాటు వచ్చిన 150 మంది నాయకులు ఒక సైన్యంలా పనిచేస్తారు, వారి వెనుక ఎంతో మంది ఉన్నారు, ఖచ్చితంగా కాకినాడలో జనసేన జెండా ఎగరేస్తాం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీట్ కూడా వైసీపీపార్టీ గెలవకుండా చేస్తాం
  • రైతులకు నష్టం కలిగించేలా కాకినాడలో ఒక కుటుంబం వద్ద వ్యవస్థలు ఉన్నాయి, అలాంటి వారి నుండి రైతులను కాపాడటానికి న్యాయవ్యవస్థపై పట్టు ఉన్న తోట సుధీర్ లాంటి వారు ఉపయోగపడతారు
  • నా దేశం, నా రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని, అందుకే తోట సుధీర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అని అనుకునేవాడిని, నా ఒక్కడి స్వార్దం అయితే ఏదో ఒక పదవి తీసుకుని ఉండేవాడిని
  • సుధీర్ లాంటి వ్యక్తులు ఈరోజు రావడం వలన 2 చోట్ల ఓడిపోయినా సరే మార్పు కోసం కాంక్షించే వ్యక్తులు ఉన్నారు అనే నమ్మకం నన్ను నడిపిస్తుంది.

 

భీమవరం అంబేద్కర్ సెంటర్ లో భారీ బహిరంగ సభ

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు, 56 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారికి, మొదట భారతీయుడిని అని చెప్పిన అంబేద్కర్ గారికి శతకోటి వందనాలు
  • గత దశాబ్ద కాలంగా జనసేన మార్పు కోసం పోరాటం చేస్తున్నాం, ఎక్కడికి పారిపోకుండా ఇక్కడే సమాజంలో ఉంది పోరాటం చేశాం, ఈ పోరాటం మన భీమవరం ఓటమి ఇచ్చింది, అయినా సరే భీమవరం లో నాకు ఓటమి తెలియలేదు, ఈరోజు వరకు ఓటమి తెలియకుండా మీరు ఉన్నారు, మనకి ఓటమి, గెలుపు ఉండదు, పోరాటం ఉంటుంది
  • ప్రజల జీవితాల్లో మార్పు కోసం, ఉపాధి కోసం , భవిష్యత్తు కోసం ఉద్యమాలు చేసాము
  • ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పచ్చని చెట్లు కూడా రోదిస్తున్నాయి, మైన పోరాటం చేస్తున్నాయి
  • ఇష్టానికి చట్టాలు చేస్తూ, పిచ్చి పిచ్చి చట్టాలు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తే చూస్తూ ఉండము
  • ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టు, అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పథకం పేరు మార్చేసి జగన్ పేరు పెట్టుకున్నారు, ఇదేనా ఆయనకు ఇచ్చే గౌరవం
  • ఇక్కడ ఉన్న యువతలో ఎంతోమంది సత్య నాదెళ్ల, ఎలా మస్క్ లాంటి వారు ఉంటారు, వారికి ప్రోత్సాహం ఏది? వాలంటీర్లు గా మిగిలిపోవాలా
  • యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది అన్ని వర్గాల యువతకు 10 లక్షల ఆర్ధిక పెట్టుబడి సాయం అందిస్తాం
  • యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ , యువత కోసం ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు, 50 వేల టీచర్ ఉద్యోగాలు, 75% ఉద్యోగాలు స్థానిక యువతకు, ఇక్కడే IT ఉద్యోగాలు ఇస్తాం హైదరాబాద్ అవారం లేదు అని చెప్పి, కేవలం 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. గౌరవ వేతనం అని 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వదిలేశారు, ఇదేనా యువతకు మీరు చేసింది
  • ఇక్కడ ఉన్న మత్స్యకారుల్లో ఆక్వా స్పోర్ట్స్ టాలెంట్ ఉంది, వారిలో ప్రతిభ బయటకు తీసి క్రీడాకారులు గా మార్చుతాం
  • ప్రతిభ ఉన్న యువతకు పెట్టుబడి స్థోమత లేదు, దళిత యువతను, BC యువతను , EBC యువతను వాలంటీర్లు ఉద్యోగాలు ఇస్తే వారు పారిశ్రామిక వేత్తలుగా మారుతారా
  • క్లాస్ వార్ అనేవారు పేరు చివర కులం పేరు పెట్టుకోరు వైయస్ జగన్
  • రాష్ట్రంలో తెలివి, సత్తా ఉన్న యువత ఆశలకు సమాధి కట్టింది వైసీపీ పార్టీ  ప్రభుత్వం
  • నేను 151 MLA లు, 30 మంది MP లు ఉండి ఇష్టారాజ్యంగా పాలిస్తున్న వైసీపీ పార్టీ  పై పోరాడుతున్నాను
  • ఇక్కడున్న ఎంతో మంది యువతలో ప్రతిభ, సామర్థ్యం ఉండి, వారికి అవకాశాలు ఎక్కడ? ఉద్యోగాలు అని చెప్పి PG లు చేసిన వారిని చిన్న చిన్న పనులకు వాలంటీర్లు గా మార్చేశారు
  • గతంలో ఒకసారి ప్రభాస్ గారి అభిమానులకు నా అభిమానులకు చిన్న పోస్టర్ విషయంలో గొడవ జరిగింది, ఒక పోస్టర్ చినిగితే అంత గొడవ చేయకూడదు, క్షమించి వదిలివేయాలి, చిన్న గొడవను పెద్దది చేయవద్దు అని చేతులెత్తి వేడుకుంటున్నాను
  • ఒక వైసీపీ పార్టీ  MLC దళిత యువకుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కొంతమంది మాత్రమే స్పందించరు, ఒక బాలుడిని చెరుకు తోటలో కాల్చి చంపితే స్పందన లేదు, మద్యపాన నిషేధం అని చెప్పి లక్ష కోట్ల ఆదాయం మద్యం మీద సంపాదిస్తే స్పందన లేదు, 33వేల మహిళలు మిస్సింగ్ అవుతున్నా స్పందించలేదు
  • ఎంతసేపు కులాల మధ్య గొడవలు పెట్టి వారిని వెనుకకు నెట్టారు
  • ఈ పెద్దమనిషి వైయస్ జగన్ ఏమైనా పుచ్చలపల్లి సుందరయ్య గారా క్లాస్ వార్ అంటున్నాడు
  • మాట్లాడితే నేను ఊగిపోతాను అని అంటారు, మీ పార్టీ MP రఘురామ రాజు గారిని అడగండి, 17 ఏళ్ల అమర్నాథ్ కుటుంబ సభ్యులను అడగండి ఊగిపోతారో లేదో చెప్తారు
  • ఇసుక కాంట్రాక్టులు కేవలం 3 కంపెనీలకు మాత్రమే ఇచ్చి 50 వేల కుటుంబాల పొట్ట కొట్టాడు ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్
  • మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి, లక్ష కోట్ల ఆదాయం మద్యం మీద సంపాదించిన వ్యక్తి ఈ @వైయస్ జగన్, నేను క్లాస్ వార్ చేస్తున్న అని చెప్పడానికి సిగ్గు ఉండాలి. ఆడవారి జీవితాలు మీద దెబ్బ కొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి
  • అధికారం లో లేని నేను క్లాస్ వార్ ఎలా చేస్తాను? క్లాస్ వార్ చేస్తుంది నువ్వు వైయస్ జగన్, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 21 లక్షల భావన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిన వ్యక్తి వారి చావులకు కారణం అయిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి
  • సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు కష్టం. మహిళలు వద్దు అన్న చోట మధ్య నిషేదం అమలు. జనసేన అధికారం లోకి వేస్తే పాత రేట్లకే మద్యం అందుబాటులో ఉంటుంది. మద్యం ఆదాయంలో 10శాతం గీత కార్మికుల నిధికి ఉపయోగిస్తాం
  • రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ  ఏం చేసింది? కనీసం రైతులకు గిట్టుబాటు ధర ఉండదు, సమయానికి పంట కోనరు, పంట సొమ్ము ఈ పవన్ కళ్యాన్ వేస్తే తప్ప అకౌంట్లో పడదు పేరులో రైతు పెట్టుకుని ఏం లాభం
  • బ్రిటిష్ వారు వేలమంది వచ్చి కోట్ల మందిని పాలించినట్లు, 190 మంది వైసీపీ పార్టీ  నాయకులు వచ్చి రాష్ట్రాన్ని నియంత్రిస్తాం అంటే కుదరదు. అన్ని పదవులు ఒకే వర్గానికి ఎలా ఇస్తారు? ఇతర వర్గాల్లో అర్హులు లేరా
  • ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పార్టీ  నా లేక జనసేన అనేది తేల్చుకుందాం. సై అంటే సై, నిండా మునిగినవారికి చలేముంది, మిమ్మల్ని ఒక్క సీట్ కూడా గెలవనివ్వం
  • జిల్లా అధ్యక్షులు చినబాబు గారిపై కేసులు పెట్టారు, వీరవాసరం లో ఒక జనసైనికుడి పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసులు పెట్టారు
  • నేను మీకోసం 25 సంవత్సరాలు మీకు కూలీగా పనిచేయడానికి వచ్చాను, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని కోరుకుంటున్నాను, జనసేన జెండా ఎగరాలి, మన సత్తా చూపాలి
  • తుందుర్రు ఆక్వా పార్క్ విషయంలో స్తానికులపై కేసులు పెట్టారు. జనసేన రాగానే కేసులు ఎత్తేస్తాం
  • ఇక్కడ 38వ వార్డులో నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలోంచి గెంటేసి ఇల్లు కూల్చేశారు, పునరావాసం కల్పించలేదు వారికి ఎవరు అండగా ఉంటారు, ఆడపిల్లలకు రక్షణ ఎవరు ఇస్తారు
  • కనీసం చిన్న చిన్న కాలువ గట్ల మరమ్మత్తులు కూడా చేయలేని ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ  ప్రభుత్వం
  • దళిత మేనమామ అని చెప్పి ఇక్కడ స్థానిక దళితులను బెదిరించారు, వారికి అండగా నిలబడిన మా నాయకులపై కేసులు పెట్టాడు వైయస్ జగన్
  • దళితులకు కేవలం పథకాలు కాదు, పారిశ్రామిక వేత్తలు రావాలి, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కావాలి
  • అగ్రకులాల పేదలు ఉన్నారు, వారికి పథకాలు అందవు, వారికి కూడా మన ప్రభుత్వంలో పెట్టుబడి సాయం అందిస్తాం
  • నేను ఏరోజు ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, కేవలం జనసేన అని పెట్టాను, ప్రజలందరూ కావాలి. నన్ను అభిమానించే, అభిమానించని యువత అందరూ నాకు కావాలి, మీరు ఆంధ్రప్రదేశ్ యువత అందరి అభిమానుల కోసం నేను ఉన్నాను ఒక్క నా అభిమానుల కోసం కాదు
  • దివ్యాంగుల్లో ఎంతో ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేదు, ఒక స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులను బయటకు తీయవచ్చు, వారికి కూడా పెట్టుబడి సాయం అందిస్తాం
  • యువతను రోడ్డున పడేసారు, రైతుల పొట్ట కొట్టారు, కార్మికుల ఉపాధి పోగొట్టారు ఈ వైసీపీ పార్టీ  ప్రభుత్వం
  • క్లాస్ వార్ అని ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారు. ఎవరు పెత్తందారులు? ఇసుక మాఫియా చేసేవారు పెత్తందారులు
  • మద్దతు ధర కోసం అడిగితే 16 మంది రైతులపై ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించాలని కేసులు పెట్టారు
  • ఇక్కడ ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువ, మహేష్ బాబు, ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్, చిరు, అల్లుఅర్జున్  అభిమానులు ఎక్కువ, వారందరి అభివృద్ది కోసం జనసేన ఉంది
  • గాంధీగారు సత్యశోధన అని రాస్తే, వైయస్ జగన్ అసత్యశోధన అని రాస్తాడు. చిన్నప్పుడు SI ని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టిన వ్యక్తి ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారిని కొట్టించడంలో ఆశ్చర్యం ఏముంది. అలాంటి వ్యక్తి పోలీస్ శాఖను నిర్దేశించడం సిగ్గుగా ఉంది
  • గోదావరి నుండి పైప్ లైన్ వేసి త్రాగునీటి సమస్య తీరుస్తా అని చెప్పి చేయలేదు, కనీసం రోడ్డు వేయలేదు ఈ MLA
  • లా & ఆర్డర్ సమస్య దారుణంగా ఉంది. స్థానిక అధికార పార్టీ MP, ఎన్నికల్లో మా ప్రత్యర్థి రఘురామ రాజు  ని ఎలా హింసించారు అనేది తెలుసు, వైసీపీ వాళ్ళు ఎవరినైనా విమర్శించవచ్చు, వారిని మాత్రం ఎవరు విమర్శించకూడదు అంటే ఎలా
  • ఇంత మెజారిటీ ఇచ్చి వైసీపీ పార్టీ  ని గెలిపిస్తే వారు చేసింది రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చారు
  • ఈ స్థానిక MLA భీమవరం  గురించి నీకేం తెలుసు అంటున్నాడు, అక్కడ డంపింగ్ యార్డ్ కు ఎప్పుడైనా వెళ్లి చూసావా? నేను వెళ్లి అక్కడ పరిస్థితులు  చూసాను 
  • ఇక్కడ కనీసం 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయలేక పోయాడు స్థానిక MLA, కనీసం 50 బెడ్ల ఆసుపత్రి కూడా సరిగా లేదు. డంపింగ్ యార్డ్ సమస్య తీర్చ లేకపోయాడు, ఇక్క స్థలాల సమస్య పరిష్కారం అవ్వలేదు
  • గతంతో పోలిస్తే మా వాళ్ళు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గింది, వైసీపీ పార్టీ  నాయకుల నోట్లో సైలేన్సర్లు తగ్గిస్తే మా వాళ్ళు పూర్తిగా తగ్గిస్తారు
  • Mr వైయస్ జగన్ చెవులు విప్పుకుని విను, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావ్, నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు, మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు నేను చెబుతాను, నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త
  • జగన్ నీకే చెబుతున్నా, నువ్వు ఇలాగే వ్యక్తిగత జీవితాల గురించి, పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఉండను, ఇది వార్నింగ్ అనుకో, బలమైన పోరాటం ఇవ్వబోతున్నాము, సిద్దంగా ఉండు
  • రాష్ట్రానికి అప్పు ఉంటే మాకేమైంది అని అనుకోవద్దు, ఇక్కడ బ్రిడ్జి రాకపోవడానికి, ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడానికి, ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అప్పులే
  • ఈసారి రాష్ట్రమంతా ఏకం అవ్వండి, కులాలుగా విడిపోకుండా ఒక్కటిగా రాష్ట్రం కోసం కలిసి జనసేనకు అండగా ఉండండి
  • అభివృద్ది చెందిన దేశాలలో లా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఆరోగ్యశ్రీ అంటారు కానీ వారికి కూడ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ పార్టీ  ప్రభుత్వం ఉంది
  • యువత గురించి ఆలోచించే ప్రభుత్వం ఉండాలి, నేను ఆలోచిస్తాను, మాకు అండగా ఉండండి
  • ప్రధాని గారు నాకు బాగా తెలుసు, మన ఇబ్బందులు తెలిసి నరేంద్ర మోది గారు విశాఖ పిలిచి అడిగారు, కానీ నేను పోరాటం చేయగలిగి ఉండి ఎందుకు పిర్యాదు చేయడం అని ఆగిపోయాను. గుర్తు పెట్టుకో వైయస్ జగన్ నాకు నిమిషం పట్టదు కేంద్రానికి చెప్పడానికి
  • జనసేన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా తప్పు చేసిన వైసీపీ పార్టీ  ప్రతీ నాయకుడిపై చర్యలు ఉంటాయి
  • దేవుడి సొమ్ము తిన్న వారు ఎవరైనా నాశనం అయిపోతారు, తరాలు లేచిపోతాయి జాగ్రత్త వైవీ సుబ్బారెడ్డి గారు. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో అక్రమాలు జరిగాయి. ఆలయ నిర్మాణాలు కోసం కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడా లేదా

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్