భీమవరం నియోజకవర్గం కార్యకర్తల సమావేశం
- భీమవరంలో జనసేన జెండా ఎగిరితీరుతుంది, ప్రతీ ఒక్కరికీ సమాధానం ఇస్తాం – జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవింద్ గారు
నాదెండ్ల మనోహర్ గారి స్పీచ్
- ఈ నెల 30 న భీమవరంలో వారాహి విజయ యాత్ర లో భాగంగా, భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం – @JanaSenaParty PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
- ప్రతీ ఒక్కరికీ సమన్యాయం జరగాలి, చట్టం అన్ని వర్గాలకు సమానంగా పనిచేయాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కానీ భీమవరంలో ఒక కులాయి కనెక్షన్ కావాలన్నా MLA తో ఫోన్ చేయించాల్సిన దుస్థితి
- ఏ కుటుంబంలో కూడా వైయస్ జగన్ లాంటి మేనమామ ఉండకూడదు, అలాంటి మేనమామ ఏ ఇంట్లో ఉన్నా కూడా తన్ని పంపిస్తారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, పిల్లల దగ్గరకు వెళ్లి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు
- ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు ఉపయోగించడం దురదృష్టకరం. జగన్ రెడ్డి లాంటి వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి
- గతంలో మనం గెలవాల్సిన సీట్ భీమవరం, ప్రజా సమస్యలకు స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
- నేను ఓడిపోయినా సరే రాజకీయాల నుండి దూరంగా వెళ్ళను అని పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ఫలితాల తరువాత నాతో అన్నారు, అది ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమ
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- ఖచ్చితంగా భీమవరంలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది, జనసైనికులు బలంగా పనిచేయాలి
- సరిగ్గా అ,ఆ లు అక్షరాలు నేర్చుకోకపోతే వరాహి కి, వారాహి కి తేడా తెలియదు ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి, జనసేన వయోజన సంచార పాఠశాల పథకం క్రింద, ఈ ముఖ్యమంత్రికి నేనే అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తాను
- ఒక నియంత, కంఠకుడు, తెలుగు ఉచ్చారణ రాని వ్యక్తి వైయస్ జగన్ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరం బాధపడుతున్నాము
- గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భీమవరం ప్రజలు ఎంతో సహకరించారు. ఖచ్చితంగా భీమవరం లో జనసేన జెండా ఎగరేస్తాము
- మన చేత 24 గంటల్లో తిట్టించుకొకపోతే, తిట్టించుకునేలా వెధవ పనులు చెయ్యకపోతే మేము వైసీపీ పార్టీ నాయకులమే కాదు అన్నట్లుగా ఉన్నారు
- అమ్మఒడి పథకం కార్యక్రమానికి వెళ్లి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వైయస్ జగన్ మాట్లాడే మాటలేనా ఇవి? నేను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగింది, ఊరికే చూపించలేదు
- ఒత్తిడి తీసుకోకుండా మర్పబ్రాడు, కేసులు ఉంటాయి భయపడకండి, దైర్యం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రండి, దైర్యం లేనివాళ్ళు రాజకీయాల్లోకి రాకండి, ఒక్క ధైర్యం ఉన్న వ్యక్తి అయినా చాలు
- పెన్షన్ రాకపోయినా MLA సంతకం తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇందుకేనా MLA పదవులు
- మహాత్మా గాంధీ గారి సతీమణి కస్తూర్బా గాంధీ గారి పేరు కళాశాలకు తీసేయడం ఏంటి ?
- ప్రతీ ఒక్కరూ భవిష్యత్తులో కూడా జనసేనతో నడవాలి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పార్టీ జెండా ఎగరకూడదు, దానికి మనం పనిచేయాలి, 30వ తారీఖున కారణాలు చెబుతాను.