14వ రోజు ( హైలెట్స్ ) – భీమవరం తూర్పు కాపులతో సమావేశం

భీమవరం

జనసేన పార్టీ లోకి తూర్పు కాపుల చేరిక 

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్

  • పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే మన లక్ష్యం – తూర్పు కాపులు
  • తూర్పు కాపు సంఘం అధ్యక్షులు చంద్రమోహన్ గారు మా దృష్టికి వారి సమస్యలు తీసుకుని వచ్చారు, వారి తరపున జనసేన పనిచేస్తుంది – భీమవరంలో నాయకులతో జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
  • రాష్ట్రంలో స్పందన కార్యక్రమంలో స్పందన కరువైంది, జగనన్నకు చెబుదాం అంటారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి – భీమవరంలో నాయకులతో జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
  • మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి, ఏ స్వార్దం లేకుండా అందరినీ ఒక త్రాటిమీదకు తీసుకొచ్చారు. మీరు అందరూ కూడా కలిసి మెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను – భీమవరంలో తూర్పు కాపులతో జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు.
  • తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర ముగించుకుని, నిన్న నరసాపురం యాత్ర ద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టాను – భీమవరంలో తూర్పు కాపులతో జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • తూర్పు కాపుల సంక్షేమం కోసం అడుగులు వేయడం మొదలుపెట్టింది భీమవరం నుండే, గతంలో ఇక్కడ నిర్మలా దేవి ఫంక్షన్ హాల్ లో సమావేశాలు పెడుతున్నప్పుడు వారి నాయకుడు నవీన్ గారు వచ్చి నాకు సమస్యలు చెప్పారు, అప్పటి నుండి నేను మీ కోసం, మీ అభివృద్ధి, రాజ్యాధికారం కోసం ఆలోచిస్తున్నాను
  • ఉత్తరాంధ్రలో వంశధార ప్రాజెక్ట్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది తూర్పుకాపులు, ఎక్కువగా ఈ ప్రాంతం నుండి వలసలు ఉన్నాయి
  • దేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర నుండి వలస వెళ్లిన తూర్పు కాపుల చేయి ఉంటుంది
  • రాష్ట్రంలో దాదాపు 46 లక్షల తూర్పుకాపులు ఉంటే, గత టీడీపీ ప్రభుత్వం 26 లక్షలు అని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 16 లక్షలు మాత్రమే జనాభా అని అంటున్నారు. ఆ లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు, ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వాలు ఈ లెక్కలు చెప్తున్నారు
  • ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడానికే ఇలా చేస్తున్నాయి, జనసేన ప్రభుత్వం రాగానే గణాంక సేకరణ చేపడతాం
  • BC ల్లోని ప్రతీ కులం కూడా దేహీ అని అడిగే స్థాయి నుండి ఒకరికి ఇచ్చే స్థాయికి ఎదగాలి
  • ఈ దేశంలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, గణాంకాలు తీయాలి అని అగ్రకులంలో, ఆర్య వైశ్య కులంలో పుట్టిన రామ్ మనోహర్ లోహియా గారు చెప్పారు
  • నిజంగా అన్ని కులాలకు అభివృద్ధి చేసి ఉంటే అంబేద్కర్ గారు కోరుకున్న కుల నిర్మూలన జరిగి ఉండేది
  • చట్టం అందరికీ సమానంగా పనిచేయనప్పుడు ఒక్కటిగా పనిచేయడానికి కుల సంఘాలు ఏర్పడ్డాయి, అన్ని వర్గాలకు న్యాయం చేసి ఉంటే కుల సంఘాలు ఉండేవి కాదు
  • తూర్పు కాపులలో బలమైన నాయకులు ఉన్నారు, కానీ ఎందుకు కులం వెనుకబడి ఉంది? నాయకులు కులం పేరు చెప్పుకుని ఎదిగారు, కానీ వారు కులం అభివృద్ధికి పనిచేయలేదు
  • బొత్సా లాంటి పెద్ద నాయకులు తూర్పు కాపుల నుండి ఎదిగారు, అయినా సరే కులంలో వెనుకబడిన వారికి ఏమీ చేయకపోవడం వల్లనే ఇంకా వెనుకబడి ఉన్నారు
  • ఒక కులానికి రాష్ట్రం అంతా BC సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, తూర్పు కాపులకు మాత్రమే ఎందుకు ఒక ప్రాంతంలో మాత్రమే BC లుగా గుర్తించారు
  • తెలంగాణలో BC జాబితా నుండి తూర్పు కాపులను తొలగించారు, ఒక MP, MLA కూడా దీనిపై స్పందించలేదు
  • 2 వేల రూపాయలు ఇస్తే సరిపోతుందా ఏం వస్తుంది, 2 వేలు ఇచ్చారు కాదా అని ప్రశ్నించే హక్కు లేదంటే ఎలా
  • సభల్లో నేను ఎందుకు ఊగిపోతాను, ఆవేశపడుతాను అంటే, ప్రజల బాధలు, కన్నీళ్లు ఎవరు పట్టించుకోకపోతే, వారి ఆవేదన నా ఆవేశం రూపంలో వస్తుంది
  • ఎన్ని ఎకరాలు సంపాదించినా సరే భూమిలోకి మనల్ని లాగేసుకుంటుంది, కాబట్టి వేల ఎకరాలు ఏం చేసుకుంటారు, దోపిడీ ఎందుకు అనేది నాయకులు ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి
  • ఎప్పుడైతే చైతన్యంతో ఉన్న సమాజం ఉంటుందో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. నేను పనిచేయకపోయినా సరే నన్ను నిలదీయాలి, అప్పుడే నేను పనిచేయగలను
  • ఒక్క MLA పనిచేయడు, పోలీసులను కొడతారు, సర్పంచులను కొడతారు, పోలీసులు పిర్యాదులు తీసుకోరు, ఇలా అయితే ఎలా పనులు జరుగుతాయి
  • ఎన్నికలప్పుడు ఆకాశం తీసుకొస్తాను అని చెప్పి ఎన్నికలయ్యాక మొహం చాటేసిన వారిని నిలదీయాలి, రేపటి రోజున జనసేన ప్రభుత్వంలో నేను చేయకపోయినా సరే మీరు నన్ను నిలదీయాలి
  • నేను ఓడిపోయినా సరే నిలబడి మీ కోసం ఉండటానికి కారణం, నా వెనుక ఓటమి తరవాత కూడా లక్షల మంది ఉన్నారు, వారి కోసం నేను పోరాటం చేస్తాను
  • మీరు ఏ పార్టీలో ఉన్నా సరే రాష్ట్రం కోసం, మీ వర్గం కోసం బలంగా పనిచేయాలి
  • తూర్పు కాపులు మా ముందు పెట్టిన సమస్యలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, చర్చిస్తాం, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతాం
  • అన్ని పార్టీలను నమ్మి మోసపోయారు, కానీ ఈసారి జనసేనను నమ్మండి, ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయను

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్