ఉదయం 11 గం.: నరసాపురం నియోజకవర్గం నాయకులతో సమావేశం
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- నరసాపురంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సభ కోసం హెలికాప్టర్లో వచ్చి 3,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని వచ్చాడు. ఈరోజు వరకు కనీసంఒక్క రూపాయి కూడా పనులు మొదలుపెట్టలేదు – నరసాపురం నాయకులతో జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
- గత ఎన్నికల్లో మనం ఓడిపోయినా కూడా మన నాయకులు బొమ్మిడి నాయకర్ గారు ఇంటింటికీ వెళ్తుంటే జనాలు ఆయనే MLA అని అనుకుంటున్నారు. జనసేన అలాంటి ప్రభావం చూపింది
- పవన్ కళ్యాణ్ గారి తరపున వారధులుగా నాయకులు నిలబడ్డారు, ప్రజల్లోకి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు
- నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రతీ వార్డు లో ఓటర్ల జాబితా వెరిఫై చేయండి. కొత్త ఓటర్లను చేర్చడం, దొంగ ఓట్లను గుర్తించడం చేయండి
- దాదాపు 50వేల ఓట్లు మనకు ఈ నియోజకవర్గంలో రావడం చాలా గొప్ప విషయం, ప్రజలకు అండగా కలిసికట్టుగా ఉండండి, జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి, ఈ 6-7 నెలలు కష్టపడి నాయకులందరూ పనిచేయాలి
- 14 నుండి మొదలు పెట్టిన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అద్భుతమైన స్పందన వచ్చింది, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం – నరసాపురం నాయకులతో జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
- మన మీద నమ్మకంతో మహిళలు సైతం బయటకు వచ్చి మనకు విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. వారికి అండగా నిలబడాలని. ఎంతో బలమైన భావజాలంతో పార్టీని మొదలుపెట్టి 10 సంవత్సరాలు నడపడం అంతా సులువు కాదు
- ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. చాలా గ్రామాల్లో నీరు పచ్చగా వస్తున్నాయి. దీని కారణంగా ఉద్దానం తరహాలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, దీనిపై దృష్టి పెడతాం
- ఆక్వా కల్చర్ వలన మనకు లాభం ఎలా ఉందో అలాగే పర్యావరణానికి నష్టం కూడా ఉంది, పర్యావరణానికి నష్టం జరగకుండా, ఆక్వా కల్చర్ దెబ్బతినకుండా ఉండేలా ఒక ప్లాన్ సిద్ధం చేస్తున్నాం
- మన పార్టీకి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ లేరు. @వైసీపీ పార్టీ కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. VV సుబ్బారెడ్డి లాంటి వారు ఉన్నారు. వేల కోట్లు ఇస్తారు. కానీ మన దగ్గర డబ్బు లేకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సమస్యలు ఉంటాయి కానీ ప్రజల కోసం తట్టుకుని ముందుకు సాగాలి.
- డబ్బులతో కొనే ప్రేమ కాదు, మన మీద ప్రజలకు స్వచ్చమైన ప్రేమ, అభిమానం ఉంది. నా మీద ఉన్న ప్రేమను నేను రాజకీయ పార్టీగా మార్చాను, ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయడానికి వేదిక సిద్దం చేశాను. ప్రతీసారి నేను రావడం కష్టం, కానీ నాయకులు , జనసైనికులు, వీర మహిళలు బలంగా పనిచేయాలి, కొత్తతరం నాయకులు రావాలి
- బ్రిటన్, సింగపూర్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. అలాంటి ఇన్సూరెన్స్ మనం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించి, నేను ప్రతినిధులు, ఆర్థికవేత్తలతో చర్చించి సాధ్యం అవుతుంది అన్నారు. అందుకే ప్రతీ కుటుంబానికి 25 లక్షల బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి ప్రభుత్వమే ప్రజల ఆరోగ్య భాధ్యత తీసుకుంటుంది. ఆరోగ్యశ్రీ లా కొన్ని వ్యాధులకు కాకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్య భాధ్యత తీసుకుంటాము
- ఉపాధి అవకాశాలు లేక యువత వలసలు వెళుతున్నాయి, తెలంగాణలో 1500 పైగా, కర్ణాటకలో 2 వేలకు పైగా IT కంపెనీలు ఉన్నాయి, మన దగ్గర పట్టుమని 100 కూడా లేవు, జనసేన ప్రభుత్వం యువతకు ఉపాధి ఇక్కడే కల్పించే మార్గాలు ఏర్పాటు చేస్తాం
- డంపింగ్ యార్డ్ ఎందుకు క్లీన్ గా ఉంచడం లేదు? బరోడా తరహాలో ఎందుకు డంపింగ్ యార్డ్ సిస్టం మనం పెట్టలేము ? డంపింగ్ యార్డ్ నుండి ప్రమాదకరమైన మీథేన్ వాయువు వస్తుంది, అది బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి
- రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీట్ కూడా వైసీపీ పార్టీ గెలవకూడడు, కష్టమైన సరే మనం దానికోసం పనిచేయాలి
- పెద్ద స్థాయి నాయకులు లేరు మన దగ్గర అంటున్నారు. పుట్టగానే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పుట్టలేదు, ఆయన అల్లర్లు, దారుణాలు అన్ని చేశాడు, SI ను కొట్టాడు, మనం అలా చేయడం లేదు కదా
- జగన్ రెడ్డి 18-19 ఏళ్ల వయసులో ఆయన స్నేహితులు వేటకు ఆయుధాలతో వెళ్తున్నారని పోలీసులు పట్టుకుంటే, SI ని లోపల వేసి కొట్టాడు, ఆయన స్పూర్తితో మంత్రుల కొడుకులు కూడా ఇప్పుడు SP , DSP లను కొడుతున్నారు, మనకి చట్టాలపై గౌరవం ఉంది
- మన హక్కులకు భంగం కలగనంత వరకు అవతలి వ్యక్తుల హాక్కులకు రక్షణ
- ప్రతీ ఒక్కరు నా సమస్య కాదు కదా అని కాదు, ఎవరికి సమస్య వచ్చినా మనం స్పందించాలి, లేదంటే రేపు మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరూ నిలబడరు
సాయంత్రం 5 గం.: భారీ ర్యాలీ
నరసాపురం బహిరంగ సభ
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు గారి స్ఫూర్తి మరువలేనిది
- నా పని, కర్తవ్యం చేసుకుంటూ వెళ్తాము, గుర్తింపు వస్తుందా, లేదా అని చూడను
- జనసేనకు మద్దతు తెలిపిన నరసాపురం ప్రభాస్ గారి అభిమానులు. ప్రభాస్ గారి అభిమానులకు నా అభినందనలు
- ప్రజల సొమ్మును పథకాల రూపంలో ఇస్తూ, తమ సొంత జేబులోంచి ఇస్తున్నట్లు నాయకులు చెప్పడం హాస్యాస్పదం
- కనీస విద్యా, త్రాగునీరు, కాలుష్య రహిత గాలి, ఆడ బిడ్డలకు మాన ప్రాణ రక్షణ ప్రాథమిక హక్కు, అవి కల్పించలేని పరిస్థితుల్లో ప్రజలు తిరగబడతారు
- 2 వేలు ఓటుకు ఇచ్చాం కదా అని మళ్ళీ ఎన్నికల వరకు ప్రజలను పట్టించుకోని వ్యవస్థ నాకు నచ్చదు
- పొట్టి శ్రీరాములు గారి బలిదానాలపై కూర్చున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి వై యస్ జగన్ ప్రజలందరి ఉమ్మడి సంపాదన, శ్రమ ప్రభుత్వానికి టాక్సుల రూపంలో ఇస్తే, ఆయన 30% ఓటు బ్యాంక్ వారికి మాత్రమే బటన్ నొక్కి పంచుతాను అంటే కుదరదు.
- విపరీతమైన రాజకీయ అవినీతి ఉన్నప్పుడు, సరైన జీతాలు లేనప్పుడు, ప్రభుత్వ ఒత్తిడి ఉన్నప్పుడు కొంతమంది అధికారులు లంచాలకు పాల్పడుతున్నారు. వారిపై ACB పనిచేస్తుంది కానీ నాయకులు చేసే అవినీతిపై ఎవరు పనిచేస్తారు. వారి అవినీతిపై చర్యలేవి
- ఈ వ్యవస్థలో విసిగిపోయి పవన్ కళ్యాణ్ అనే వాడు జనసేన పార్టీ స్థాపించాడు. ఇది కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గొంతు కాదు, లక్షలాది మహిళలు, prabh TVA ఉద్యోగులు, మత్స్యకారులు, SC, ST sab ప్లాన్ విషయంలో మోసపోయిన వారి గొంతు, వెనుకబడిన BC వర్గాల ప్రజల గొంతు
- రాజకీయాల్లో జవాబుదారీతనం కావాలి, BC సబ్ ప్లాన్ ఫండ్స్ గురించి, మత్స్యకారుల గురించి, కాపు రిజర్వేషన్ల గురించి, మహిళల రక్షణ, నొక్కిన బటన్లు, నొక్కని బటన్ల గురించి ఈరోజు మాట్లాడుతాను.
- 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని అధికారంలోకి వచ్చిన ఈ పెద్దమనిషి వై ఎస్ జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఎందుకు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్తున్నారు.
- CPS రద్దు చేస్తాం అన్నారు ఎందుకు చేయలేదు? ఎందుకు ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి పడట్లేదు ? ఎందుకు TA, DA ఇవ్వట్లేదు ?
- ఈ రాష్ట్రంలో 52% శాతం బీసీ వర్గాల ప్రజలు ఉన్నారు. BC సబ్ ప్లాన్ నిధులు ఎందుకు వారికి ఖర్చు పెట్టడం లేదు
- ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వమే సాయం అందించాలి. అగ్రకులాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలి. నేను కోరుకునేది భాధ్యత కలిగిన ప్రభుత్వం
- 2 చోట్ల ఓడిపోయినప్పుడు చాలా బాధేసింది. అవినీతి చేసిన వ్యక్తులను అందలం ఎక్కించారు, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల స్పూర్తితో వచ్చిన నన్ను ఎందుకు ఓడించారు అని బాధేసింది, కానీ ఈరోజు మీరు ఇంతమంది ఉన్నామని అండగా నిలబడ్డారు.
- గిట్టుబాటు ధర లేకపోతే రైతు భదపడుతాడు, చితికిపోతాడు, కానీ రైతు నష్టపోతున్న కూడా కాకినాడలో ఒక కుటుంబం రైతులను దోచుకుంటుంది
- ప్రభాస్ గారు బాహుబలి చేసినా, ఆదిపురుష్ చేసినా సరే రోజుకు 509 నుండి 1000 మందికి ఉపాధి కల్పిస్తారు. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. టాక్సులు కడతారు. ఈ వై యస్ జగన్ ప్రభాస్ నీతిగా సంపాదించడు, కానీ వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయి.
- YCP గెలిస్తే రాజ్యాంగం గెలిచినట్లు, లేకపోతే లేదు అన్నట్లుగా మాట్లాడుతాడు. ఇక్కడ పసలదీవి గ్రామ పంచాయితీ లో జనసేనకు 1400 ఓట్లు వచ్చాయి, వైసీపీ కి 380 ఓట్లు వస్తే పంచాయితీకి నిధులు ఇవ్వడం మానేశాడు. ఇదేనా రాజ్యాంగం
- కోనసీమలో DSP గారిని మంత్రి కొడుకు కొట్టాడు, ఇలాంటి పరిస్థితుల్లో, వ్యవస్థ మన మాట వినకపోతే విప్లవం వస్తుంది, జనసేన అనే ఆయుధం పట్టుకోవాలి.
- జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను….
మీరు పులివెందుల రౌడీ రాజకీయం గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చారు, నరసాపురం నుండి చెప్తున్నా, గూండాలకు, రౌడీలకి భయపడే నేల కాదు, ఎన్ని సార్లు భయపెట్టగలరు
- పనికిమాలిన మీ సలహాదారులు ఎంతమంది ఉన్నా, కనీసం నరసాపురంలో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయారు ఈ వై ఎస్ జగన్
- ఆఖరికి నీళ్ళ పంపిణీ కోసం పెట్టిన మోటార్లను కూడా దోచుకెళ్తున్నారు ఈ వైసీపీ నాయకులు
- పారిశుధ్య కార్మికులు 5 మంది పనిచేస్తుంటే 25 మంది పనిచేస్తున్నారు అని నిధులు దోచేస్తున్నారు వైసీపీ నాయకులు
- ఇంతకు ముందు దాదాపు 50వేల మంది ఇసుక మీద ఆధారపడి బ్రతికేవారు, పంచాయితీలకు నిధులు వచ్చేవి, కానీ ఇప్పుడు కేవలం 3 కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి 10వేల కోట్లు సంపాదించారు, అడ్డగోలుగా ఇసుక దోచేస్తున్నారు
- YS జగన్మోహన్ రెడ్డి నొక్కని బటన్ లిస్ట్.
పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ బటన్
రాని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్
నష్టపోయిన రైతు పరిహారం బటన్
ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్
మద్దతు ధర రాని కొబ్బరి సాగు బటన్
దగ్ధమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్
పూర్తి కాని బ్రిడ్జి బటన్
దళితులను చంపి బయట తిరుగుతున్న MLC బటన్
ఆక్వా రైతుకు 1.5 కు యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్
కోనసీమ రాని రైలు బటన్
అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్
మూతపడిన 8 వేల బడుల బటన్
కొత్త కాలువలు కాదు, కనీసం ఉన్న కాలువల పూడిక తీయలేకపోయిన బట
ఆరోగ్యశ్రీ అందక కోల్పోయిన ప్రాణాల బటన్
త్రాగునీరు దొరకని గ్రామాల బటన్
స్వయం ఉపాధి కల్పించలేనీ బటన్
కాన్పు కోసం డోలిలో వెళ్ళిన మహిళ బటన్ * అప్పుట్లోకి తోసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బటన్
ఆగిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన బటన్
నిరుద్యోగ యువత ఉపాధి బటన్
ఆడబిడ్డల మాన, ప్రాణాల బటన్
- జనసేన వస్తే బటన్ నొక్కను, ప్రజల కోసం ఒక ముఠా మెస్త్రిలా పనిచేస్తాను, రెల్లి కార్మికుడు చెత్తను తొలగిస్తే, నేను రాజకీయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పని చేస్తాను
- సింగిల్ విండో పద్ధతి అమలు చేసి ఈజ్ ఆఫ్ బిజినెస్ లో నిజంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము
- గౌడ, శెట్టిబలిజల రాజ్యాధికారం, వెనుకబడిన వర్గాలకు, SC, ST వర్గాలకు రాజ్యాధికారం జనసేన ద్వారా మాత్రమే సాధ్యం
- పుట్టుకతో రాజకీయ నాయకుడు అవ్వలేము, 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, అనుభవం తెచ్చుకుని మాట్లాడుతున్నాను.
- నాకు సింగపూర్ ను ప్రపంచంలోనే ఒక అధ్భుతమైన దేశంగా మార్చిన లీ క్వాన్ యు నాకు ఆదర్శం. రాష్ట్రాన్ని ఆయనలా అభివృద్ధి చేయడమే లక్ష్యం
- శ్రీ కేరళ తరహాలో మన నరసాపురం ప్రాంతంలో ఎందుకు బొట్ రేసు లాంటి క్రీడలు పెట్టకూడదు? ఎందుకు మన కాలువలు శుభ్రం చేయరు? జనసేన ప్రభుత్వంలో మేము చేసి చూపిస్తాం.
- ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త జిల్లాలుగా ప్రకటిస్తున్నాను, ఇక్కడ 34 సీట్లలో ఒక్కటి కూడా వైసిపి నీ గెలువనివ్వం, ఇక్కడ నుండి YCP ని తరిమేస్తాం
- అకారణంగా కాపులకు – BC లకు గొడవలు పెట్టాలని చూసింది వైసీపీ ప్రభుత్వం, తుని రైల్వే ఘటన వెనుక ఎవరు ఉన్నారో కూడా ఈరోజు ప్రజలకు అర్ధమైంది
- జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి .
అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి
అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి
జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి
” హలో ఏపీ – బై బై వైసీపీ ”