ఉదయం 11 గం.: రాజోలు నియోజకవర్గం నాయకులతో సమావేశం
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- ఒక పార్టీ గెలవలేకపోవచ్చు కానీ దానికి బలంగా సానుభూతిపరులు పొందుతున్నారు అంటే పార్టీ భావజాలానికి ఆకర్షితులవుతున్నారు, దాని కొసం నిలబడే వాళ్ళు ఉన్నారు అని అర్థం
- గత ఎన్నికల్లో రాజోలులో సాధించిన విజయం చాలా కీలకమైననది, వేల కోట్ల దోపిడీ చేసి ఉండి, తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయి, అరాచకం చేసే వ్యక్తులను తట్టుకుని రాజకీయం చేయడం చాలా కష్టం, అయినా సరే మనం నిలబడి పోరాటం చేశాం
- సమాంతర రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీ పెట్టడం సాహసోపేత నిర్ణయం. మనది ప్రజాస్వామ్యం, కులస్వామ్యం కాదు
- పార్టీ పెట్టేప్పుడు 150 మంది సభ్యులతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు సమర్పించాలి. ఆ 150 మందిలో కూడా నేను అన్ని కులాలు, వర్గాల నుండి సభ్యులను ఎంపిక చేసి పార్టీ అందరి కోసం సమానంగా పనిచేసేలా తీర్చిదిద్దాను
- 150 మంది సభ్యులతో మొదలైన జనసేన పార్టీ మొన్న ఒక్క నియోజకవర్గంలోనే 10,274 మంది క్రియాశీలక సభ్యులుగా మారింది. అది కూడా మన తరపున గెలిచిన MLA వెళ్లిపోయిన తర్వాత
- ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన ఎదగటానికి కారణం మన భావజాలాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, వారు అర్ధం చేసుకుని మనతో నడుస్తున్నారు కాబట్టి
- సగటు గృహిణిగా నాకు అర్ధం అవుతుంది మాకు ఉపాధి కావాలి, పథకాలు కాదు, ప్రభుత్వాలకు ఎందుకు అర్ధం కావట్లేదు అని చెప్పింది ఒక గృహిణి
- రాజోలు లో వెలిగిన చిన్న దీపం రేపు కడప జిల్లా రాజంపేట వరకు వెలిగిస్తాం. పులివెందుల నుండి వచ్చి వైయస్ జగన్ ఇక్కడ దౌర్జన్యం చేస్తే, రేపు మన గోదారి జిల్లాల సంస్కారం పులివెందులలో చూపిద్దాం
- గోదావరి జిల్లాలో రాజకీయం ఉంటుంది చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు ఉంటాయి తప్ప క్రిమినాలిటి ఉండదు, చెట్లు నరికేయడాలు, బెదిరింపులు, నరికేయడాలు లేవు. ఇవి పులివెందుల సంస్కృతి, ఇది గోదావరి జిల్లాలోకి తీసుకొచ్చారు
- భగత్ సింగ్, ఆజాద్, గాంధీ గారి పాఠాలు చెప్పి, నిజ జీవితంలో వైయస్ జగన్ లాంటి క్రిమినల్ నన్ను పాలిస్తాడు అంటే నాకు నచ్చదు, క్రిమినల్స్ మనల్ని పాలించకూడదు
- 200 రూపాయల లంచం తీసుకునే వ్యక్తికి ఈ దేశంలో శిక్ష పడుతుంది కానీ, వేల కోట్లు, లక్షల కోట్లు దోచేసిన వాళ్లకు శిక్ష పడదు, ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది
సాయంత్రం 4 గం.: భారీ ర్యాలీ
బహిరంగ సభ (మలికిపురం, కాలేజీ సెంటర్)
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- 2019 ఎన్నికల్లో 2 చోట్ల నేను ఓడిపోయినప్పుడు, ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసు, కత్తితో గుండెని కోసినట్లు ఉంటుంది, కానీ రాజోలు లో మీరు ఇచ్చిన గెలుపు సేద తీరినట్లు అనిపించింది.
- రాజోలు ప్రజలు ఇచ్చింది మామూలు గెలుపు కాదు, దెబ్బతిన్న పరిస్థితుల్లో మీరు నాకు ఒక ఆశని ఇచ్చారు, క్రిమినల్స్ ను తట్టుకుంటూ రాజోలు ప్రజలు వెలిగించిన చిరు దీపం కడప జిల్లా రాజంపేట వరకు జ్యోతిలా వెలుగుతుంది.
- MLA ఒక పార్టీపై గెలుస్తాడు, తరవాత పార్టీ మారతాడు. ఆయన ప్రజల ఓటు అనే బోటుపై గెలిచాడు, అందరి ఓట్లతో గెలిచి ఆయన వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ మారటం తప్పు, అది ఏ MLA అయినా సరే.
- నేను చేస్తున్నది చాలా కష్టసాధ్యం అయినది, చాలా మంది పార్టీ పెట్టారు, ఉద్యమాలు నడిపారు కానీ నిలబడలేకపోయారు. ఒక పార్టీ నడపడం అంటే భావజాలంతో ఉన్న వారు అందరినీ కలిపి నడిపించడం అది చాలా కష్టం
- 150 మందితో ప్రారంభమైన జనసేన, ఒక్క రాజోలు లోనే 10,274 మంది. క్రియాశీల కార్యకర్తలుగా ఎదిగింది.
- జనసేనను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మనం ఒక కులం కోసం రాజకీయం చేయట్లేదు, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం, వ్యక్తిగత స్వార్ధం కోసం చేయడం లేదు, ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేస్తున్నాం, అందుకే మనమంటే భయం
- ఎడారిలో ఒయాసిస్ లాంటి గెలుపు రాజోలు ప్రజలు ఇచ్చారు.
- ప్రతీ నియోజకవర్గంలో 2-3 నాయకులు పోటీ పడతారు, వారిలో ఎవరు ఎక్కువగా ప్రజలను ఆకట్టుకోగలిగితే వార్ MLA అభ్యర్థిగా ఉంటారు. అప్పుడే సరైన నాయకుడు వస్తాడు.
- మన నాయకులు అందరూ MLA అవ్వడానికి పోటీ పడండి, కానీ ఈరోజు సభకు వచ్చిన జనం అందరూ డబ్బు ఇస్తే రాలేదు, ప్రేమతో వచ్చారు, కాబట్టి మనలో మనం కొట్టుకుని ప్రజలను నట్టేట ముంచకండి
- YCP మోసాలు చదివీ చదివి నాకు నైట్ వచ్చింది, అంత విపరీతంగా వైసీపీ పార్టీ నాయకులు అవినీతి చేశారు.
- ఉభయ గోదావరి జిల్లాల నాయకులు భాద్యతగా వ్యవహరించండి, మీరు వైసీపీ పార్టీ నాయకులకు భయపడితే నేనే వచ్చి సమాధానం చెప్తాను, నేను గోదావరి ఈ జిల్లాలను అంటి బెట్టుకున్నట్లు, నేను గోదావరి జిల్లాలను అంటిబెట్టుకుని ఉంటాను
- నేను మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది కానీ వీటికి సమాధానం చెప్పండి. ఎందుకు కాలుష్యం ఉంది, ఎందుకు కలుషితమైన నీరు ఉంది, ఎందుకు మలికిపురం లో శ్మశానవాటిక లేదు
- 14 నుండి మొదలు పెట్టిన వారాహి విజయ యాత్ర ఈరోజుతో తూర్పు గోదావరి జిల్లాలో ముగిసే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోకి అడుగుపెడుతోంది
- మనం ఒక పూట ఉపవాసం ఉంటే అల్లదిపోతాం, అలాంటిది వైశ్య కులంలోనౌట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న రాష్ట్రం, దానిని కాపాడుకోవాల్సిన భాధ్యత మనది.
- ఈరోజు సభకు వస్తుంటే దారిలో ఒక మహేష్ బాబు గారి అభిమాని వచ్చి నేను మహేష్ గారి అభిమాని, కానీ రాజకీయంగా మీకు అండగా ఉండి, ఓటేస్తాను అంటే చాలా ఆనందంగా ఉంది.
- నాకు ఎందుకు హీరోలందరూ ఇష్టం అంటే వారు ఒక్కో సినిమా చేసి 600 మందికి పైగా ఉపాధి కల్పిస్తారు, GST కడతారు, సాయం చేస్తారు, అందుకే నాకు ఇష్టం
- ఇక్కడ మన పార్టీ గుర్తుపై గెలిచిన MLA YCP లోకి వెళ్ళిపోయాడు కాబట్టి,15 రోజుల్లోగా వైసీపీ ప్రభుత్వం LIC రోడ్డు దారుణంగా ఉంది, ఇక్కడ రోడ్డు వేయకపోతే నేనే వచ్చి శ్రమదానం చేసి రోడ్డు వేస్తాను, మళ్ళీ వచ్చి నేను గొడవ చేశాను అంటే కుదరదు.
- సఖినేటిపల్లి నుండి నరసాపురం బ్రిడ్జి ముగ్గురు ముఖ్యమంత్రులు, 30 సంవత్సరాల కాలం 3 శంఖుస్థాపనలు చేసి కూడా వేయలేకపోయారు. బటన్ నొక్కడం ఒక్కటే సరిపోదు కదా, కనీసం కాలవ గట్టులు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు, అంతర్వేది వద్ద సముద్రం కోసేస్తుంది, మునిగిపోయే పరిస్థితి ఉంది.
- పని చేయకుండా వైసీపీ పార్టీ వచ్చి స్టిక్కర్ వేస్తాం అని వస్తున్నారు, ఎందుకు అతికించుకోవాలి.
- వరదల సమయంలో ఆహార ప్యాకెట్లు అందించిన చిన్న కాకా హోటల్స్ వాళ్ళకి కనీసం 7 లక్షల 60 వేలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. స్థానిక MLA ని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు
- ఇది గోదావరి ప్రాంతం. ఇక్కడ పులివెందుల హింస తీసుకురాకండి వై యస్ జగన్
- ఇక్కడ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే స్థాయికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడ కాకినాడ ద్వారంపూడి కుటుంబం వాళ్ళు బస్తాకు వంద రూపాయలు తీసుకుంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు.
- నన్ను భయపెట్టాలని చూడకండి, నా పేరు పవన్ కల్యాణ్, నాది జనసేన
- జగన్ రెడ్డికి ఒక్కటే చెప్తున్నా
మీరు ఇప్పటివరకు రాజకీయ నాయకులను చూసి ఉండొచ్చు, కానీ నాలా విప్లవ పంథా తో ఉన్న నాయకుడిని మీరు చూసి ఉండరు వై యస్ జగన్
- నిందితులను వెనకేసుకు రావడం, శిక్ష వేయకపోవడం వల్లనే బాపట్ల దగ్గర అమర్నాథ్ అనే ఒక బాలుడిని తగలబెట్టి చంపేశారు.
- అంతర్వేదిలో రథం కాలిపోతేపిచ్చోడు చేశాడు అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రథం. పోలీసులు విచారణ చేయాలి. నిందితులను పట్టుకోవాలి. కానీ ప్రభుత్వానికి చలనం లేదు, ఎవరో పిచ్చోడు తేనె కోసం చేస్తే రథం తగలపడిపోయింది, ఆ పిచ్చోడిని విశాఖ హాస్పిటల్ లో చేర్పిస్తే తప్పించుకుని యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పడం బాధాకరం.
- రాజోలు లో జనసేనకు అండగా నిలబడింది, మార్పును ఇక్కడ నుండే మొదలుపెడదాం
- ఇక్కడ నుండి అరబ్ దేశాల్లో పనికోసం వెళ్లి అక్కడ చిక్కుకు పోయిన వారి సమస్య నా దృష్టికి వచ్చింది. ఈ సారి జనసేన కు అవకాశం ఇవ్వండి, వారి తరపున జనసేన ప్రభుత్వం పనిచేస్తుంది.
- యాదవ సమాజానికి నేను మాట ఇస్తున్నాను, మీకు నేను అండగా నిలబడతాను
- నేను ఇక్కడే ఉంటాను, ప్రతీ మండల సమస్యలు తెలుసుకుంటాను, పరిష్కార మార్గాలు రూపొందిస్తాను
- కులాల వారిగా విడిపోకుండా ఈసారి కలిసి మెలిసి ఉందాం. కులాల ఘర్షణలు తొలగిస్తే తప్ప అభివృద్ధి జరగదు
- MLC అనంత బాబు తన కార్ డ్రైవర్ ను చంపి, శవాన్ని డోర్ డెలివరీ చేస్తే పోలీస్ వ్యవస్థ అతన్ని అరెస్ట్ చేసి నేర విచారణ చేయాలి. కానీ అతను కాకినాడ MLA ద్వారంపూడి దగ్గరకు వెళ్ళి నేను ఇలా చేశాను అండగా ఉండండి అని అంటే ఆ MLA కి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అండగా ఉన్నాడు. మరి ఆ చనిపోయిన దళిత డ్రైవర్ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు?
- MLC అనంత బాబు చేసిన తప్పుకు కులానికి సంబందం లేదు, అతనికి శిక్ష పడాలి. వ్యక్తులు చేసిన తప్పును కులానికి అంటగట్టదు. ఈ విషయంలో నేను దళిత సమాజానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను, MLC కి శిక్ష పడాల్సిందే
- కాకినాడ లో ఉండే ద్వారంపూడి అనే MLA తూర్పు గోదావరి జిల్లాను శాసిస్తున్నాడు.
- సఖినేటిపల్లి బ్రిడ్జి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ గంజాయి మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది
- నేను ఏదైనా సమస్యలపై మాట్లాడాలంటే ప్రధాని నరేంద్ర మోడి గారు, హోంమంత్రి అమిత్ షా గారిని అడిగితే వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ ఇక్కడ సమస్యలు నేనే తేల్చుకోవాలని నేను మోదీ గారు విశాఖలో అడిగినా నేను చెప్పలేదు.
- రామతీర్ధం లో శ్రీరాముడి తలను నరికేసినప్పుడు నేను నిరసన వ్యక్తపరుద్దాం అంటే చిలకలూరిపేటలో ఒక ముస్లిం కుటుంబం కూడా జ్యోతి వెలిగించి మద్దతు తెలిపింది. అలాంటి ముస్లిం సమాజం రాజోలు లో 4 వేల కుటుంబాలు ఉన్నాయి, వారికి మేము అండగా ఉంటాం.
- శ్రీవాణి ట్రస్ట్ విషయంలో వై వి సుబ్బారెడ్డి గారు శ్వేత పత్రం విడుదల చేశాం. అంటున్నారు. నాకు మీపై నమ్మకం లేదు, లక్షలాది మంది అర్చకులకు కనీస వేతనం లేదు. హిందువుల నుండి విరాళాలు తీసుకుని కనీసం అర్చకుల కోసం ఖర్చు పెట్టకపోతే ఎలా
- ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సిట్ కూడా వైసీపీ గెలవకుండా నేను చూసుకుంటాను సిద్దంగా ఉండండి.
- వచ్చే కొత్త ప్రభుత్వం, మేము అధికారంలోకి రాగానే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో విచారణ జరిపిస్తాం, మీకు శిక్ష వేస్తాం వై వి సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు.
- సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికేస్తే వచ్చి గుండెపోటు అని చెప్పిన కుటుంబం వై ఎస్ జగన్ వాళ్ళది, YS జగన్ అనే అనకొండ సొంత బాబాయ్ ని మిగేసింది.
- అంబేద్కర్ గారి విగ్రహం పెడితే సరిపోదు, దళిత విద్యార్థులకు మేనమామ అని చెప్పుకుంటూ, 24 దళిత పథకాలు ఎందుకు రద్దు చేశారు, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి జగన్ విదేశీ విద్యా దీవెన అని ఎందుకు పేరు మార్చారు.
- నాకు 7 కేటగిరీ భద్రత లేదు, ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్ పేరు, కానీ నాకున్న రక్షణ వారాహి, నా జన సైనికులు, వీర మహిళలు
- మాతో గొడవ పెట్టుకోవాలని పాతిక సంవత్సరాల యుద్ధానికి సిద్ధపడి గొడవపెట్టుకొండి. కనీస వైద్య సేవలు లేవు, ఉపాధి లేదు, దోపిడీలు అందుకే వైసీపీ గూండాలు అంటే నాకు నచ్చదు
- నా పై కానీ, మా నాయకులు, వీర మహిళలు, జనసైనికులపై కానీ ఒక్క దెబ్బ పడినా, ఒక రాయి పడినా సరే మా ప్రభుత్వం రాగానే వైసీపీ. గూండాలను బయటకు లాక్కొచ్చి శిక్షిస్తాం జాగ్రత్త.
- ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అభివృద్ధి జరగాలి. కోనసీమ రైల్వే లైన్ జనసేన ప్రభుత్వం పూర్తి చేయిస్తుంది, సఖినేటిపల్లి బ్రిడ్జ్ నిర్మిస్తాం.
- కోనసీమలో ఆయిల్, గ్యాస్ కంపెనీల బ్లో అవుట్ వల్ల ఇప్పటి వరకు మంది పైగా చనిపోయారు.
- 4 సంవత్సరాల్లో ఎందుకు స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు. ఆయిల్ కంపెనీల్లో ఎందుకు ఉపాధి వచ్చేలా చేయలేదు? ఇక్కడి నిధులు తీసుకెళ్తున్నప్పుడు కనీసం ఉపాధినైనా ఇవ్వాలి కదా? వైసీపీ ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు భాధ్యత లేదు
- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో, కేంద్ర మంత్రులతో మాట్లాడి స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, ఉపాధి వచ్చేలా చేస్తాను
- జనసేన ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొస్తాను, కేంద్రీయ స్కూల్స్ తరహా విద్యా విధానం తీసుకొస్తాను.
- కోనసీమ ను, గోదావరి జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేస్తాం, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తాం.
- ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు కూడా చెల్లించడం లేదు, ప్రతీ ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తాను. బటన్ నొక్కి పథకాలు కాదు, వారి ఆరోగ్య భాధ్యత కూడా తీసుకోవాలి. ప్రతీ కుటుంబానికి 25 లక్షల బీమా పథకం అమలు చేస్తాను
- ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది, వైద్యం ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీలు భరించేలా ప్రణాళిక తీసుకొస్తున్నాము.
- ప్రభుత్వానికి తిరిగి చెల్లించే అవసరం లేకుండా యువతకు 10లక్షల పెట్టుబడి సాయం ఒక్కో నియోజకవర్గానికి 500 మందికి అన్ని కులాల వారికి దామాషా పద్ధతిలో అందిస్తాం. వారి నుండి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలను తయారు చేస్తాం.
- ప్రభుత్వం మీకు తండ్రి స్థానంలో ఉండి యువతకు 10లక్షల పెట్టుబడి సాయం అందిస్తాం
- మొన్న లాయర్ కాకినాడలో నా దగ్గరకు వచ్చి ప్రభుత్వం ఇస్తా అన్న 5 వేలు ఇస్తామని చెప్పి వైసీపీ పార్టీ చెప్పి ఇవ్వడం లేదు అని చెప్పగానే, 2 రోజుల్లో పాత బకాయిలు సహా ప్రభుత్వం వారి అకౌట్స్ లో వేశారు.
- ఈసారి రాజోలు లో అఖండ విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను
- ఒకసారి ఇక్కడ బైపాస్ రోడ్డులో నడిస్తే నీకు రోడ్ల దుస్థితి తెలుస్తుంది. ఆఖరికి గన్నవరం నుండి తాడేపల్లి కి కూడా హెలికాప్టర్లో తిరిగే వై యస్ జగన్ కు మన రోడ్లపై గర్భిణీ స్త్రీలు పడే ఇబ్బందులు ఎలా తెలుస్తాయి.
- మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం, మన జీవితాల్లోకి రౌడీ నాయకులు, గూండాలు వస్తా అంటే మాత్రం ఊరుకోను.
- చిన్న ట్రాఫిక్ పోలీస్ 200 తీసుకుంటే ACB పట్టుకుంటుంది, మరి వేలకోట్లు దోపిడీ చేస్తున్న నాయకులను ఎవరు పట్టుకుంటారు.
- గుడిలో ఎన్ని పూజలు చేసినా, చర్చిలో ఎన్ని ప్రార్థనలు చేసినా, మసీద్ లో మోకరిల్లి ప్రార్థించినా సరే మనిషి మాత్రమే రావాలి, పోరాటం చేయాలి, సాయం చేయాలి.
“దైవం మానుష్య రూపేణా”
జీసస్ అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, శ్రీరామ చంద్రమూర్తి అయినా సరే మానవ రూపంలోనే వచ్చారు. కాబట్టి మనకు మనమే పోరాడాలి, ఈ రాక్షస పాలన నుండి విముక్తిని కలిగించాలి.
- అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి
- అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి
- జనం బాగుండాలంటే – జగన్ పోవాలి
- #HelloAP_ByeByeYCP