సాయంత్రం 3 గం. నియోజకవర్గం పార్టీ నాయకులతో భేటీ
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- దాదాపు రాజకీయాల్లోకి వచ్చి 14 యేళ్లు అయింది. అరణ్యవాసం పూర్తయింది. ఇక యుద్ధం చేద్దాం
- కోనసీమలో మొదలైన మార్పు రాష్ట్రమంతా చూపించాలి
- కోనసీమలో ఉన్న కోపం ఆవేదన మనలో మనం కొట్టుకోవడానికి కాకుండా మనల్ని దోపిడీ చేస్తూ, అన్యాయానికి గురి చేస్తున్న వ్యక్తులపై చూపిద్దాం-
- అమలాపురంలో పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ ఉండాలి. అందుకే ఇక్కడ త్వరలో ఆఫీస్ పెడతాను, మీకోసం కూలీలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను
- కూలదోసేవాడు ఒకడుంటే నిలబెట్టేవాడు ఒకడు ఉంటాడు, విడదీసే వాడు ఒకడుంటే కలిపేవాడు ఒకడుంటాడు
- వివాదాల జోలికి వెళ్లకండి, ఎంత బలమైన ఉద్యమం అయినా సరే హింస ఉంటే ఆ ఉద్యమం వెనక్కు వెళ్ళిపోతుంది కాబట్టి హింస, వివాదాలు మన దరిదాపుల్లోకి రానివ్వకండి
- కోపాలు అందరికీ ఉంటాయి. నాకు కోపం ఉంది కానీ ఆ కోపాన్ని వివేకంగా ప్రదర్శించాలి లేకపోతే అర్ధం ఉండదు
- నీలోంచి మార్పు రావాలి. అందుకే నేను మారి చూపించాను. నేను అన్ని కులాలకు సమాన గౌరవం ఇస్తాను, అందరినీ కలుపుకుపోతాను
- YCP MLC అనంతబాబు ఒక దళిత డ్రైవర్ ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతను కాపు కులస్తుడు అని నేను సమర్థించలేదు, తప్పు చేసిన వాడు ఏ కులమైన సరే శిక్ష పడాలి
- బాపట్లలో ఒక గౌడ కులస్తుడైన బాలుడిని వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి తగలబెట్టి చంపేస్తే అది రెడ్డి కులం వారికి ఆపాదించకండి, తప్పు చేసిన వాడు రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, దళిత ఏ వర్గమైన సరే అందరూ ఖండించాలి, కులాలను వెనుక వేసుకురావద్దు
- కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఎందుకు, ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం ప్రజల కన్నీళ్లు తుడవటమే
- మీ ప్రేమను రాష్ట్ర నిర్మాణానికి, యువత భవిష్యత్తుకు, అన్ని కులాల అభివృద్ధికి ఉపయోగిస్తాను, నాకోసం ఉపయోగించను
- అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలో రోడ్ షో
- అక్కడి నుంచి దిండి (రాజోలు నియోజకవర్గం) చేరుకున్నారు.