- 14 బుధవారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం
- సాయంత్రం వారాహి మీద బయలుదేరి కత్తిపూడి సభ ప్రాంగణంకి భారీ ర్యాలి గా చేరుకున్నారు.
స్పీచ్ హైలెట్స్
- 10సంవత్సరాలైనా సరే చెక్కు చెదరని ప్రేమ, అభిమానంతో మీరు నావెంట ఉన్నారు. కర్ణుడికి కవచకుండలాలు లాగా నాకు అండగా ఉన్నారు జనసైనికులు.
- గత 2 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా అభివృద్ధి సంపూర్ణంగా జరగాలని యాగం చేసి దిగ్విజయంగా పూర్తి చేసి వారాహి విజయ యాత్ర మొదలు పెట్టాను.
- ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఎర్నేస్తో చే గువేరా గారి పుట్టిన రోజు. యాదృచ్ఛికంగా ఈరోజు యాత్ర ప్రారంభించాను. నాకు రాజకీయాలకు స్ఫూర్తినిచ్చిన వారిలో అతను ఒకరు.
- చే గువేరా లో నాకు నచ్చింది, కష్టాల్లో ఉన్నవారు తన జాతి, కులం, మతం, దేశం కాకపోయినా సరే వారి కోసం పోరాటం చేసి అమరులయ్యారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
- నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీపరుడు అయి ఉండాలి. ఒక సామాన్యుడి అవినీతి చేస్తే ACB పట్టుకుంటుంది, CM అవినీతి చేస్తే ఎవరు పట్టుకుంటారు ?
- నేను మీ భవిష్యత్తు కోసం వచ్చాను
- మన హక్కుల కోసం గళం ఎత్తాలి
- పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అని, భీమవరం లో ఓట్ల జాబితా కంటే 8 వేల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి, అవి ఎక్కడ నుండి వచ్చాయి, అందరూ నామీద కక్ష కట్టి ఓడించారు
- ఈసారి నన్ను గెలవకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను, ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుంది , అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతాను
- 151 సీట్లు ఉన్న పార్టీ ఒక్క సీట్ కూడా లేని జనసేన అంటే ఎందుకు భయపడుతుంది, ఎందుకు అణచి వేయడానికి ప్రయత్నిస్తుంది? అంటే మనం బలం వారికి తెలుసు, వైసీపీ పార్టీ కి పోటీ మనమే
- దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కూడా @వైసీపీ పార్టీ నాయకులకు బయటపడితే మనం చెప్పు తీసి చూపించాం, అది మన బలం
- ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు నన్ను ఎలా ఆపుతారో చూస్తాను
- మాట్లాడితే వైయస్ జగన్ క్లాస్ వార్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతాడు, క్లాస్ వార్ అంటే పేద, ధనిక మధ్య వ్యత్యాసం, జగన్ రెడ్డితో పోలిస్తే నేను చేయాలి ఆయన మీద క్లాస్ వార్
- వేల కోట్లు అవినీతి సంపాదన, మైనింగ్ కంట్రక్తులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న వ్యక్తి క్లాస్ వార్ అంటే ఎలా
- ఈ సంవత్సరం 18సంవత్సరాలు నిండి ఓటు హక్కు తెచ్చుకున్న యువతకు ఒక్కటే విన్నపం. ఒక మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మ బలిదానం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మనం గుర్తు ఉంచుకుని, ఆయన ఆశయాల కోసం పనిచేయాలి
- నేను కేవలం సంపాదన కోసం సినిమాలు చేయడం లేదు, పార్టీని నడపడానికి డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేస్తున్నాను
- సినిమా టిక్కెట్లు విషయంలో కూడా దిగజారిన వ్యక్తి వైయస్ జగన్ , ఆదాయ వనరులను దెబ్బ కొట్టాలి, పార్టీకి ఆర్థిక సహకారం లేకుండా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి జగన్ రెడ్డి
- నా బిడ్డల కోసం దాచిన సొమ్ముతో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాను, మీరు నా బిడ్డలు అనుకుని, మీ భవిష్యత్తు కోసం నా బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టాను, రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలన్నీ మంగళగిరి నుండి సాగుతాయి
- వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చే అంటారు… ఒక్కడిగా వస్తానా, కూటమిగా వస్తానా, ఇంకా నిర్ణయించుకోలేదు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తాము
- వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలైనా వేస్తాను, ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తాను, ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా పనిచేయాలి అనే దానిపై దృష్టి పెడదాం
- వైసీపీ నాయకులు చేసే తప్పుల గురించి చదివి చదివి అలుపోచ్చింది, అన్ని తప్పులు చేశారు
- జగన్ రెడ్డి గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే ఆయనకు ఫోన్లో చాలా మనస్పూర్తిగా అభినందనలు చెప్పి, నేను మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి మాట్లాడను, మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పాను, కానీ భవన నిర్మాణ కార్మికుల గురించి తప్పు జరుగుతుంది అని మాట్లాడితే నా ఇంట్లొ ఉన్న 4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించిన వ్యక్తి వైయస్ జగన్
- ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో సహా ఉచ్ఛం, నీచం లేకుండా నన్ను తిట్టారు. అంత తప్పు నేను ఏమి చేశాను? ప్రజల కోసం పనిచేయడం తప్పా?
- దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నేను ఒకడిని… నాకు వైసీపీ పార్టీ నాయకులతో తిట్టించుకోవాల్సిన కానీ ప్రజలు నాకు ముఖ్యం అనుకుని కదా నేను రాజకీయ పార్టీ పెట్టి మీ కోసం పోరాడుతోంది
- పవన్ కళ్యాణ్ ఓడిపోగానే తోక ముడుచుకుని పార్టీ మూసేస్తాడు, రాజకీయాలు వదిలేస్తాడు అనుకున్నారు, కానీ 2 చోట్ల ఓడిపోయినా సరే నేను నిలబడ్డాను, 10సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, ప్రజల కోసం నిలబడ్డాను
- రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్య, రోడ్ల దుస్థితి గురించి జాతీయ స్థాయిలో ఉద్యమం చేసింది జనసేన
- మేము వస్తున్నామంటే సెక్షన్ 30అంటారు, పోలీసులు ఆంక్షలు పెడతారు, ఎందుకు మాకు ఇన్ని నిబంధనలు? వైసీపీ పార్టీ నాయకులకు నిబంధనలు వర్తించవా
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని కత్తిపూడి సభ సాక్షిగా చెప్తున్నాను
- నేను గత ఎన్నికల ముందు చెప్పాను వైసీపీ పార్టీ నాయకులను ఎన్నుకుంటే విశాఖను దొచేస్తారు అని, ఎందుకంటే హైదరాబాద్ లో జగన్ రెడ్డి కుటుంబం ఏం చేసిందో నాకు తెలుసు. ఇప్పుడు కొండలతో సహా దోచేశారు, కనీసం గాజువాకలో నన్ను గెలిపించి ఉంటే నేను అడ్డుకునే వాడిని
- నవరత్నాలు అని చెప్పి మాయ చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మద్యం నుండి 25 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నారు, ఇదేనా నవరత్నాలు
- నేను కులాలకు వ్యతిరేకం కాదు, కానీ ఒక్క కులానికి మాత్రమే పదవులు ఇవ్వడం తప్పు, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక్క కులానికి పట్టం కట్టే వ్యవస్థను తీసేసి అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తాం
- అధికారం లోకి రాక ముందు అమరావతి రాజధాని అని వైయస్ జగన్ చెప్పి, ఇప్పుడు ఎందుకు మాట మార్చారు? ఆరోజు ఎందుకు ఇది ఒక కులానికి చెందిన వ్యక్తులు ఉన్నారు అని చెప్పకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు
- ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాటలు మార్చే వ్యక్తి. అమరావతిలో అన్ని కులాల రైతులు ఉన్నారు, కానీ ఒక వర్గానికి అంటగట్టి డ్రామాలు వేస్తున్నారు
- పెళ్లి కానుకలు ఇస్తాం అని చెప్పి ఇవ్వట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. జనసేన అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్ళైన ప్రతీ జంటకు మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు రేషన్ కార్డ్ ఇచ్చే భాధ్యత మాది
- సంక్షేమ పథకాలు ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కౌలు రైతుకు నేను లక్ష రూపాయల ఆర్థిక సాయం నా కష్టార్జితం ఇచ్చాను. ఇది నాకు తెలిసిన సంక్షేమం. ఒక బీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలు చేసి సంపాదించి నేను ఇవ్వగలిగాను. కానీ ముఖ్యమంత్రి సంపద క్రియేట్ చేయకుండా, ప్రజల సొమ్మును బటన్ నొక్కి ఇస్తే అది సంక్షేమం కాదు
- చిన్నపాటి నిర్మాణం చేసుకోవాలన్నా వైసీపీ పార్టీ నాయకులు లంచాలు అడుగుతున్నారు
- ఆదాయ వనరులు క్రియేట్ చేయకుండా, అప్పులు చేసి సంక్షేమం అంటాడు ఈ వైయస్ జగన్ పాలన చేతకాక పాపం పసివాడిని, నేను అమాయకుడిని, అందరూ కలిసి నాకు వ్యతిరేకంగా వస్తున్నారు అంటారు
- సొంత చిన్నాన్న ను చంపిన వ్యక్తులను వెనకేసుకు వచ్చే వ్యక్తి వైయస్ జగన్ ఆయన పసివాడు ఎలా అవుతాడు? చెల్లి సునీత తండ్రి చావుకు న్యాయం చేయాలని పోరాడుతోంది, చనిపోయిన రోజు ఈ పెద్దమనిషి గుండె పోటు అని డ్రామాలు ఆడారు
- ఒక్క ముఖ్యమంత్రి కుటుంబంతో అవినీతి ఆగలేదు, ఆయన అడుగుజాడల్లో క్షేత్రస్థాయిలో అవినీతి చేస్తున్నారు, ఎలా తట్టుకోవాలి
- ప్రత్తిపాడు లో ఎందుకు అభివృద్ధి లేదు? ఇక్కడ తీర ప్రాంతం ఉంది, పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ఆలోచించండి
- 2014 నుండి 2019 వరకు నేను మీకోసం పోరాడితే నన్ను నమ్మకుండా వైయస్ జగన్ ను నమ్మి గెలిపించారు, మరి ఆయన ఏం చేశాడు, కనీసం విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోయారు
- 2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ అమలాపురం వచ్చి నేను కాపులకు BC రిజర్వేషన్ ఇవ్వను, నాకు కాపుల ఓట్లు అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడితే, 60 శాతం పైగా కాపులు ఆయనకే ఓట్లు వేశారు, కాపు నాయకులు ఆయనకు అండగా ఉన్నారు
- నేను అన్ని కులాలకు అండగా ఉంటాను, నా కులం నుండి పారిపోను, కులాల వారిగా దామాషా పద్దతి ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేస్తాను
- నన్ను చాలా సార్లు SC , BC నాయకులతో తిట్టిస్తారు, కావాలని కులాల మధ్య గొడవలు పెట్టడానికి చూస్తారు. నేను ఒక వ్యక్తి తిడితే పార్టీ వ్యక్తి తిట్టాడు అని చూస్తాను, ఒక కులం వ్యక్తి తిట్టాడు అని భావించను. కాబట్టి అందరూ అర్దం చేసుకోవాలి. కానీ వైసీపీ పార్టీ కులాల మధ్య చిచ్చు పెడతారు
- ఎన్నికలు వస్తున్నాయని వైసీపీ పార్టీ వారు BC సభలు పెడతారు. స్థానిక ఎన్నికల్లో 34% ఉన్న ప్రాతినిధ్యం 24% కి తగ్గించారు, దాదాపు 16,800 మంది బీసీ నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇది బీసీలకు న్యాయం చేస్తూన్నట్లా
- ఓట్లు వేసేటప్పుడు కులాల పరంగా విడిపోకుండా ఓట్లు వేయాలి. 56 BC కార్పొరేషన్లు పెట్టారు కానీ నిధులు ఇవ్వలేదు, నామమాత్రపు నిధులు ఇచ్చినా వేరే పథకాలకు మరలిస్తున్నారు
- జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా టాలెంట్ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద 10లక్షలు ఇస్తాము
- నేను నిలబడే చోట 200 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు, అదంతా దోచేసిన డబ్బు, అలాంటి దోపిడీలు ఆపేసి యువత కోసం ఖర్చు పెడతాం
- పంచాయితీలకు నిధులు లేవు. ఆఖరికి జీతాలకు డబ్బుల్లేక సర్పంచ్ వెళ్లి చెత్త వెత్తే పరిస్థితులు ఉన్నాయి, పంచాయతీ వ్యవస్థను దిగజార్చారు
- కేరళలో పంచాయితీ వ్యవస్థ ఎంతో అభివృద్ధి చేశారు, నిధులు ఉన్నాయి. ఇక్కడ చెత్త మీద కూడా పన్ను వేస్తారు కానీ నిధులు ఇవ్వరు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ వ్యవస్థ నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తాం
- ఈ పెద్దమనిషి వైయస్ జగన్ , భవన నిర్మాణ కార్మికుల నిధులు వాడుకుని, వారి కడుపు కొట్టారు. ఈయన దొచేస్తో క్లాస్ వార్ అంటాడు, మేమేదో ఆయనకు వ్యతిరేకం అన్నట్లు మాట్లాడతాడు, ఇసుక కాంట్రాక్ట్ అన్ని కేవలం 3 కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారు
- BC వర్గాలకు ఎందుకు కాంట్రాక్టులు ఇవ్వటం లేదు? కేవలం వైసీపీ పార్టీ నాయకులకు చెందిన 3 కంపెనీలకు మాత్రమే ఎందుకు ఇచ్చారు
- BC వర్గాలకు అభివృద్ధి లేకుండా చేసి ఏదో వాహన మిత్ర అంటూ 10 వేలకు పరిమితం చేశాడు. జనసేన వస్తె BC వర్గాలకు అండగా ఉంటుంది
- గతంలో మేము ఇక్కడ వంతాడ మైనింగ్ గురించి మాట్లాడాం, లాట్రైట్ పేరు చెప్పి బాక్సైట్ దొచేస్తున్నరు. నేను మాట్లాడాక వైయస్ జగన్ మాట్లాడి, అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ కమిషన్ అన్నారు, ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ రాలేదు
- పోలవరం గురించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సెకావత్ గారితో మాట్లాడితే ఆయన చెప్పిన మాట, పోలవరం వైసీపీ పార్టీ వారికి మెషిన్ లా మారింది, డబ్బులు అవసరం ఉన్నప్పుడు వచ్చి పోలవరం పేరు చెప్తున్నారు తప్ప పూర్తి చేయడం లేదు అని
- సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ కోసం కేవలం 5 కోట్లు ఇస్తే పూర్తవుతుంది కానీ ఇవ్వడం లేదు, ఏలేరు రిజర్వాయర్ విషయంలో, పోలవరం విషయంలో ఇలా అన్ని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ పార్టీ నిర్లక్ష్యం చూపింది
- నిజంగా బీజేపీ మీకు అండగా లేకపోతే భారత ప్రభుత్వం మీ ప్రభుత్వానికి నిధులు ఎందుకు ఇస్తుంది? కట్టుకథలు చెప్పకండి
- ముస్లిం మేధావులు బీజేపీ తో కలిసి ఉన్నాం కాబట్టి మాకు అండగా నిలబడం, వైసీపీ పార్టీ కి అండగా ఉంటాం అంటారు. కానీ బీజేపీ కి అన్ని విషయాల్లో మద్దతుగా నిలబడింది వైసీపీ. మరెలా వారికి అండగా ఉంటారు? నేను ముస్లింలపై దాడి జరిగితే మీ తరపున నిలబడే వ్యక్తిని, కానీ వైసీపీ నాయకులు ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ఒక డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వారికి ఎలా అండగా ఉంటారు
- 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి 18 దళితులకు అండగా ఉండే పథకాలు రద్దు చేశారు. అలాంటి వైయస్ జగన్ కు ఎలా అండగా ఉంటారు ఆలోచించండి, నేను దళితుల సంక్షేమం, అభివృద్ధి కోరుకునే వాడిని
- కాపు నాయకులు ఆలోచించండి, వైసీపీ పార్టీ కాపులను మోసం చేస్తుంది, కాపుల మధ్య గొడవలు పెడుతుంది, ఆలోచించి మాకు అండగా నిలబడండి
- నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను అని మాటిస్తున్నాను, దయచేసి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించండి, గోదావరి తల్లి సాక్షిగా మీకు అండగా ఉంటాను అని మాటిస్తున్నాను
- పార్టీలో కొంతమంది తప్పు చేస్తే నిర్మొహమాటంగా వారిని తీసేసాను, నేను కష్టార్జితం, నన్ను అభిమానించే వారు ఇచ్చే విరాళాలతో పార్టీ నడుపుతున్నాను, ప్రతీ రూపాయికి విలువ ఇస్తాను, పార్టీ విషయంలో ఇంత నికచ్చిగా ఉండే వాడిని అధికారంలోకి వస్తె ఎంత భాద్యతగా ఉంటానో ఆలోచించండి
- సొంత చిన్నాన్న రక్తం వైయస్ జగన్ చేతికి అంటుకుని ఉంది, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ఉండాలా? 10 వేలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి 20వేలు రిపేర్ల కోసం ఖర్చు పెట్టించే నాయకుడు కావాలా? 18 దళిత పథకాలు తీసేసిన వ్యక్తి కావాలా నేను కావాలా ఆలోచించండి
- ఒక అధికారి అవినీతి చేస్తే ACB ఉంది, మరి ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు లేరా? మనమే ప్రశ్నించాలి. అందుకే ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం
- నేను కేసులు ఉన్న వ్యక్తిని కాదు, కేంద్ర నాయకులను గౌరవిస్తాను కానీ వారికి భయపడను. నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను, ఆలోచించండి, గెలిపించండి అని అర్డిస్తున్నాను
- ఈసారి కులాలను చూడకండి, మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడండి, మా జనసేన నాయకులను గెలిపించండి
- నేను 25 సంవత్సరాలు ఈ గడ్డపైనే ఉంటాను, ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. “గాజు గ్లాస్” గుర్తుకు ఓట్లు గుద్దంది
- వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తే గాంధీ గారిలాగ మరో చెంప చూపించే రోజులు పోయాయి. ఎదురు తిరుగుతాం
- రైతాంగానికి అండగా ఉంటాను.
- యువతకు ప్రోత్సాహం ఇస్తాను.
- వలసలు జరగకుండా చూస్తాను.
- యువతలో ఉన్న మేధాశక్తిని బయటకు తీస్తాను.
- నేను కొత్త నాయకులను తయారు చేస్తున్నాను
- తిట్టిన ఏ నాయకుడిని మర్చిపోలేదు, నిలబడ్డాను, పోరాడుతాను, జనసేన ప్రభుత్వాన్ని స్తాపిస్తాను
- పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడడు, గుర్తుంచుకో వైయస్ జగన్ , అన్నింటికీ తెగించి వచ్చాను, చేతనైతే మంచిగా పాలించు, లేదంటే మాదైన రోజు కింద కూర్చోబెడతాను జాగ్రత్త
- కాకినాడ MLA ఒకసారి తిట్టాడు, గుర్తుంది, ఎలా మర్చిపోతాను, మా ఆడపడుచులు, నాయకులపై కులం పేరుతో దోషించావు, దాడి చేయించావు, మర్చిపోలేదు, కాకినాడలో తేల్చుకుందాం
- ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉంది, దయచేసి అర్దం చేసుకోండి, అండగా నిలబడండి
- నవంబర్లోనో డిసెంబర్‌లోనో ఎన్నికలు వస్తాయి. ముందస్తు ఎన్నికలు రావని సీఎం కథలు చెప్తున్నాడు. సీఎం ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడుతున్నాడు ప్రిపేర్ అవుతున్నాడు.