• ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు
డాక్టర్ బీ.అర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధ్యక్షులు, పిఠాపురం అభ్యర్థి శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ఉప్పాడ గ్రామంలో ఆదివారం కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంబేడర్క్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ గారు, బీజేపీ నియోజక వర్గం ఇంఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణంరాజు గారు, కాకినాడ లోక్ సభ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. అనంతరం ఉప్పాడ వీధుల్లో స్వచ్ఛత కార్యక్రమం చేప్పట్టారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న వైసీపీ చెత్త ప్రభుత్వాన్ని తుడిచేసే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన అందించే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాకా ప్రతి వర్గానికీ న్యాయం చేస్తామన్నారు.
• అంబేద్కర్ ని అవమానించిన వైసీపీ సర్కార్
సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న అణగారిన వర్గాల విద్యార్థుల విదేశీ స్కాలర్ షిప్ పథకానికి ఉన్న అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ మోహన్ రెడ్డి గారు తన పేరు పెట్టుకొని ఆ మహోన్నతుడ్నిఅవమానించారని తెలిపారు. జనసేన, టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అంబేద్కర్ గారి పేరుపెడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ తుమ్మలపల్లి సాయి చంద్రశేఖర్, ప్రొ.కె.శరత్ కుమార్, శ్రీ కూసంపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.