జగన్ పాలనలో క్రిస్టియన్ మిషనరీ భూములను కూడా ఆక్రమించారు

జగన్

• భూ ఆక్రమణ కోసమే ఎయిడెడ్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలల మూసివేత కార్యాచరణ చేపట్టరా..?
• విశాఖ నడిబొడ్డున “హిల్ క్రైస్ట్” పరిధిలో 5.5 ఎకరాలలో ఉన్న చర్చిని, మిషనరీ భవనాన్ని, సమాధులను ఎందుకు ధ్వంసం చేశారు..?
• వైసీపీ తప్పుడు నిర్ణయాల కారణంగా అనేక మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు
క్రైస్తవ మతం పేరు చెప్పుకొని క్రిస్టియన్ మిషనరీ భూములనే ఆక్రమించుకున్న ఘనత జగన్ మోహన్ రెడ్డి పాలనలో సొంతం చేసుకున్నారు. సి.బి.ఎం., సి.బి.ఎన్.సి మిషనరీ చైర్మన్ శ్రీ పరిమి ఇమాన్యూయల్ దీపక్ కుమార్ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధులు వారి భూములు ఆక్రమణకు గురైన విధానాలను కూలంకుషంగా వివరించారు. న్యాయపరంగా పోరాడుతున్న బాధితులపై దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనలో హింసించబడుతున్న క్రైస్తవ మతస్థులకు అండగా నిలబడతాం అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నేపథ్యంలో సి.బి.ఎం., సి.బి.ఎన్.సి మిషనరీ ప్రతినిధులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మాకు అందజేశారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు తెలిపారు. ముఖ్యంగా విశాఖ నడిబొడ్డున ఉన్న “హిల్ క్రైస్ట్” పరిధిలో ఉన్న 5.5 ఎకరాలలో ఉన్న చర్చీని, మిషనరీ భవనాన్ని, క్రైస్తవ మిషరీల త్యాగాలకు స్మృతి చిహ్నం అయిన సమాధులను ధ్వంసం చేశారని వారు ఆరోపించారు. కాకినాడ జూబ్లీ కళాశాల పరిధిలో ఉన్న 6 వేల గజాల స్థలంతో పాటు రాజమండ్రి, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో కూడా భూ ఆక్రమణలకు తెర లేపారని వివరించారు. క్రిస్టియన్ మిషనరీ భూములను ఆక్రమించి బాధితులపైనే తమ దాష్టికత్వాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ నేతల దౌర్జన్యాలు తట్టుకోలేక బాధితులు వచ్చి చెప్తున్న గోడును వింటుంటే చాలా భాధగా అనిపించింది. “మా భూములతో పాటు మా ప్రాణాలూ కాపాడండి..” అంటూ బాధితులు ఘోషిస్తున్న తీరు వర్ణనాతీతం. 150 ఏళ్ల నుండి కులమతాలకు అతీతంగా విద్యా, వైద్య, సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేసే సి.బి.ఎం., సి.బి.ఎన్.సి మిషనరీ సంస్థకు చెందిన భవనాలు, స్థలాలు ఆక్రమించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. సామాజిక సేవ కోసం ఏర్పాటు చేయబడిన మిషనరీ సంస్థలకు చెందిన ఆస్తులను వైసీపీ నాయకులు ఆక్రమించడం దుర్మార్గపు చర్య. ఆక్రమణలకు గురైన తమ భూముల కోసం న్యాయస్థానాల్లో పోరాడుతున్న బాధితుల పైనే బైండోవర్ కేసులు బనాయించడం వైసీపీ రాక్షసత్వానికి నిదర్శనం. భూముల ఆక్రమణ కోసమే ఎయిడెడ్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలల మూసివేత కార్యాచరణ చేపట్టరా అనే సందేహం కలుగుతోంది. వైసీపీ తప్పుడు నిర్ణయాల కారణంగా అనేక మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంభందిత భూ ఆక్రమణలపై విచారణ చేపట్టి అన్యాక్రాంతం అయిన భూములను పరిరక్షించి బాధితులకు న్యాయం చేస్తాం అని శ్రీ కె. నాగబాబు వివరించారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్