జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమి పూజ

జనసేన

           జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరిలో సోమవారం ఉదయం భూమి పూజ జరిగింది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని పూజాదికాలు నిర్వహించారు. భూమాత ప్రీత్యర్థం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో చేపట్టారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి. ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేపట్టారు. కార్యాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఓ వైపు భూమి పూజ, మరో వైపు యాగ నిర్వహణతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంది.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్