అవనిగడ్డ – హైలెట్స్

అవనిగడ్డ
  • సమరానికి సిద్ధమైన వీరులు, యుద్ధానికి సిద్ధమైన యోధులు నా జనసైనికులు, వీరమహిళలు వారు ఉండటం వల్లనే నేను బలంగా ఉన్నాను, టీడీపి, బీజేపి పార్టీలు వచ్చి అండగా నిలబడ్డాయి, అన్ని పార్టీలు మన మాట వింటున్నాయి
  • జనసేన పార్టీ ఈరోజు 5 కోట్ల ప్రజలకు అండగా, ధైర్యాన్ని ఇవ్వగలిగింది
  • రాష్ట్రానికి రాజకీయ సిరాత్వం చాలా అవసరం, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి స్ఫూర్తితో ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని 2022 లో మాటిచ్చాను, మాట నిలబెట్టుకున్నాను
  • నేను బ్రతికి అండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకు, జాతీయ సమగ్రతకు అన్యాయం జరగనివ్వను
  • పక్కనోళ్ళ ఆస్తులు దోచేసే స్వభావం వైయస్ జగన్  కుటుంబానిది, మట్టిని త్రవ్వేయడం తప్ప ఒక్క మొక్క నాటడం తెలియదు
  • పోలీసు వ్యవస్థను పనిచెయ్యనివ్వట్లేదు వైసీపీపార్టీ ప్రభుత్వం. క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ వారి పనిని చెయ్యనివ్వడం లేదు. రేపల్లె లో రేప్ సంఘటనపై అప్పటి హోంమంత్రి సరిగ్గా స్పందించి ఉంటే మరో ఘటన జరిగేది కాదు
  • కూటమి ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ బలోపేతం చేస్తాం, పోలీసు వ్యవస్థకు అధికారం ఇస్తాం
  • సూర్యలంక బీచ్ సమీపంలో దాదాపు 95 చదరపు కిలోమీటర్ల మడ అడవులు దోచేశారు, మట్టి, ఇసుక దీనిని వదలకుండా దోచేశారు
  • ఒక్క ఛాన్స్ అని ఇస్తే రాష్ట్ర భవిష్యత్తును అస్తవ్యస్తం చేశాడు జగన్, ఈసారి ఆలోచించి ఓటు వేయండి
  • పచ్చని చెట్లను నరికేసి వ్యక్తికి మీరు అధికారం ఇస్తే, అతను రాష్ట్రం మొత్తం దోచేస్తున్నాడు
  • మార్పు కోసం వస్తున్నాం, మార్పు కూటమితోనే సాధ్యం
  • యువత ఓడిపోకూడదు, ప్రజలు గెలవాలి, మహిళలకు సాధికారత రావాలిఅనే ఆలోచనతో కలిసి వస్తున్నాం, ఆదరించి కూటమి అభ్యర్థులను గెలిపించండి, ఎన్నికల హామీలకు 3 పార్టీ నాయకులు హామీ తీసుకుంటున్నాయి
  • 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టిన గొప్ప క్రికెటర్ అంబటి రాయుడు గారు వాళ్ళ గురించి తెలియక ప్రజలకు మంచి చేయాలని వైసీపీపార్టీ లోకి వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళాక వైసిపి వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళు కాదు, బానిసలుగా ఉండేవారు కావలి అని అర్థమై బయటకు వచ్చేశారు, అలాంటి గొప్ప ఆటగాడికి కూడా విలువ ఇవ్వని వ్యక్తి వైయస్ జగన్
  • మనం అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుండి రేపల్లె దివిసీమ రైల్వే లైన్ ఏర్పాటయ్యేలా చేస్తాను, పోర్ట్ నుండి వాణిజ్యం అభివృద్ది చెందేలా చేస్తాను
  • బందర్ లో ఒక సన్నాసి పేర్ని నాని ఉన్నాడు, గతంలో పవన్ కళ్యాణ్ గారిని దూషించి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదు అంటున్నాడు, ఎన్నికల తరవాత పేరుకు ముందు వెనక పవన్ కళ్యాణ్ సార్ అని పిలుస్తాడు చూడండి
  • రాష్ట్రంలో కూటమికి పడే ప్రతీ ఓటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తున్నట్లు భావించండి, ప్రతీ ఒక్కరూ కనీసం 10మంది ఓట్లు వేసేలా చూడాలని, క్లీన్ పాలిటిక్స్ రావాలంటే మీరు పవనన్న కు అండగా నిలబడాలని అని కోరుతున్నాను
  • నేను యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ పెట్టాను, ఇండియా 2047 కు సూపర్ పవర్ అవ్వాలంటే యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలి
  • DSC ట్రైనింగ్ కు పేరు పొందిన ప్రాంతం అవనిగడ్డ, దాదాపు 23 వేల పైగా DSC పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ ప్రభుత్వంలో చలనం లేదు
  • మచిలీపట్నం MP గా పోటీ చేస్తున్న బాలశౌరి గారు మొన్న మన జనసైనికుడిపై వైసిపి నాయకులు చెయ్యి వేస్తే సింహంలా వెళ్లి కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు, అలాంటి వ్యక్తి మనకు ఎంపీ గా గెలవాలి
  • దివిసీమ ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలకు ఇంకా స్వచ్ఛమైన త్రాగునీరు అందడం లేదు, మన ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా చూస్తాం
  • కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, ఖచ్చితంగా అధికారం సాధిస్తున్నాం, ఎన్ని సీట్లు మెజారిటీ వస్తుంది అనేది మీ చేతిలో ఉంది, పూర్తి మెజారిటీ
  • ఇక్కడ MLA సింహాద్రి రమేష్ గారు బ్రిడ్జి కట్టిన తరవాత బ్రిడ్జి మీద నడిచివచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు, మరో ఓట్లు అడుగుతున్నాడు కానీ బ్రిడ్జి మాత్రం కట్టలేదు, ఆలోచించండి, మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం వైసీపీపార్టీ  ప్రభుత్వం
  • కోడూరు, నాగాయలంక ప్రాంతాల్లో వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది, వాటికి కోల్డ్ స్టోరేజ్ నిర్మించి లాభసాటి ధరకు అమ్ముకునే ఏర్పాటు చేస్తాం
  • అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని తగలబెట్టి వైసిపి నాయకులు చంపేస్తే స్పందించింది జనసేన, MLC అనంత బాబు ఒక దళిత డ్రైవర్ ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ప్రశ్నించింది జనసేన, డాక్టర్ సుధాకర్ గారూ మాస్క్ అడిగినందుకు పిచ్చోడు అని ముద్ర వేసి చంపించి అణగారిన వర్గాలపై దాడులు చేసింది వైసీపీపార్టీ నాయకులు
  • అణగారిన వర్గాలపై దాడులు చేస్తుంది వైసీపీపార్టీ ప్రభుత్వం, అణగారిన వర్గాలకు అండగా నిలబడుతుంది కూటమి ప్రభుత్వం
  • మనమేం తప్పు చేయలేదు, జాతీయ నాయకులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు పుట్టిన నేల దివిసీమ, మలాల్ని భయపెట్టాలని చూస్తున్న జగన్ ఎంత, జగన్ బ్రతుకెంత, వారి MLA ల బ్రతుకెంత
  • అవనిగడ్డలో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, టూరిజం అభివృద్ది చేస్తాం, అవనిగడ్డ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం
  • నాగాయలంక వద్ద DRDO వారు మిస్సైల్ లాంచింగ్ సెంటర్ 33వేల కోట్లతో పెట్టడానికి సిద్దంగా ఉండి, భూ సేకరణ కూడా చేసారు, కానీ వైసీపీపార్టీ ప్రభుత్వం వచ్చాక దాని ఊసు లేదు, అది వచ్చి ఉంటే ఇక్కడ ఎంతో ఉపాధి, వ్యాపారం , భూమి రేట్లు పెరుగుతాయి
  • తెలుగును అధికారిక భాష చేసిన మహనీయుడు దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, గబ్బిలం, ఫిరదౌసి లాంటి గొప్ప రచనలు చేసిన వ్యక్తి దళిత వర్గానికి చెందిన విశ్వనరుడు జాషువా. అలాంటి వారు లండన్ లో చదువుకోలేదు, ఇక్కడ మాతృ భాషలో చదువుకున్నారు. ఇంగ్లీష్ అవసరమే, కానీ మాతృ భాష కూడా ఉండాలి అనేది మా ఆలోచన
  • వైసీపీ నాయకులకు తెలుగు అంటే బూతులు తిట్టడం, మాకు తెలుగు అంటే ఆత్మ ఉత్తేజం పెంచడానికి
  • మాతృభాష మాధుర్యం అర్దం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
  • మేము ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు కూడా కొనసాగాలి అని మేము అంటుంటే, మేము ఇంగ్లీష్ రద్దు చేయమన్నాం అన్నట్లుగా వైసీపీపార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులకు జ్ఞానం ఉంటే తేడా అర్దం అవుతుంది
  • ఆటో డ్రైవర్లను వేదించని ప్రభుత్వం, ఆటో డ్రైవర్లకు అండగా నిలబడే ప్రభుత్వం రానుంది. డ్రైవర్లు నుండి వెయ్యి కోట్ల పెనాల్టీలు టార్గెట్ పెట్టుకుని 300 కోట్లు వాహన నేస్తం పథకం అని ఇస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టని ప్రభుత్వం రాబోతుంది
  • కూటమిని గెలిపించండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి
  • కూటమి అభ్యర్థులను గెలిపించండి, నేను పని చేస్తాను, MLA లతో పని చేయిస్తాను అని మాటిస్తున్నాను
    యువత భవిష్యత్తు కోసం అంబటి రాయుడు లాంటి యువకుడు ముందుకు వచ్చాడు, ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటాం, వైసీపీ నాయకుల్లగా బానిసగా చూడం
  • మచిలీపట్నం MP అభ్యర్థిగా బాలశౌరి గారికి బ్యాలెట్ నెంబర్ 6, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి, అలాగే అవనిగడ్డ MLA గా మండలి బుద్ధ ప్రసాద్ గారిని బ్యాలెట్ నెంబర్ 6, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అని కోరుతున్నాను

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్