- నూకాలమ్మ తల్లి దీవెనలతో, ఇంత ఘనంగా రోడ్లపైకి వచ్చి జనసేన – తెలుగుదేశం – బీజేపి కూటమికి మద్దతు పలికిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు
- ప్రజలకు ఒక సుస్థిరమైన పాలన ఇవ్వడం కోసమే కూటమిగా ముందుకు వచ్చాము. వారాహి విజయ భేరి తో ప్రజల్లోకి వచ్చాము. కూటమి తరపున అనకాపల్లి MLA అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభ సభ్యులు CM రమేష్ గారు పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించాలి
- తెలంగాణలో సమ్మక్క సారక్క పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేస్తున్నట్లుగా, మన నూకాలమ్మా తల్లి జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి, పట్టు వస్త్రాలు జరిపించేలా కృషి చేస్తానని మాటిస్తున్నాను
- అనకాపల్లి అనగానే బెల్లం గుర్తొస్తుంది. కానీ ఈ మధ్య అనకాపల్లి గుడ్డు పేరు బాగా వినిపిస్తుంది. కోడి గుడ్డు పెట్టింది, పొదుగుతుంది. వైసీపీ కోడి ఒక మంత్రిని ఇచ్చింది, ఒక విప్ ను ఇచ్చింది కానీ ఒక కిలోమీటరు రోడ్డు కూడా వెయ్యలేకపోయింది
- ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే అతని వ్యక్తిత్వం బయట పడుతుంది. వైసీపీ వ్యక్తులకు అధికారం ఇచ్చారు, వారి పాలన చూసారు. ఈరోజు బయటకు వచ్చిన మహిళలు, యువత, ప్రజలను చూస్తే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అర్దం అవుతుంది
- దశాబ్ద కాలం ఒక్క MLA లేకుండా పార్టీ నడిపాను అంటే కేవలం ప్రజల మీద ఉన్న ప్రేమ, పార్టీ నడపడం ఎంత కష్టమో ఇక్కడున్న సీనియర్ నాయకులను అడగండి చెప్తారు. నా ఒక్కడి కోసం అయితే ప్రధాని గారితో నాకున్న సాన్నిహిత్యం, ఒక మంత్రి పదవి, ఎంపీ పదవి తెచ్చుకోవడం ఎంత తేలికో CM రమేష్ గారిని అడగండి చెప్తారు
- అమ్మ ఒడి పథకం ఎంతమంది పిల్లలున్నా వేస్తాం అని చెప్పి, 83 లక్షల లబ్ధిదారులు అంటే కేవలం 44 లక్షల మందికే ఇచ్చారు. 19,600 కోట్లు అమ్మఒడి పథకం కోసం ఇస్తే, మద్యం అమ్మి నాన్న తడి పథకం క్రింద లక్ష కోట్లు దోచేసిన సారా వ్యాపారి వైసీపీ, ఇసుక వ్యాపారి, భూ దోపిడీ దారు ఈ ముఖ్యమంత్రి
- ఈ ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశాం. 21 సీట్లలో పోటీ చేస్తున్నాం, అనకాపల్లి ఎంపీ సీట్ మనం పోటీ చేయాల్సినప్పటికి కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు CM రమేష్ గారి కోసం త్యాగం చేశాం
- సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మండలి బుద్ధ ప్రసాద్ లాంటి వ్యక్తులు మన తరపున అసెంబ్లీలో గళం వినిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి
- తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని అధికారంలోకి వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయాడు. 2018 లో పోరాటయాత్ర సమయంలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి వారికి అండగా నిలబడ్డాను. కానీ వైసీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్మేస్తుంది. అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా తెరిపిస్తాము
- తుమ్మపాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీలు నడవాలి, లాభాల్లో ఉండాలి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించాలి. కొణతాల రామకృష్ణ గారి లాంటి సీనియర్ నాయకులతో ఇది సాధ్యం
- అనకాపల్లి బెల్లం పరిశోధన కేంద్రం ఉంది, కానీ మార్కెటింగ్ సౌకర్యాలు లేవు, సరైన మార్కెటింగ్ వ్యవస్థ NDA ప్రభుత్వం హయాంలో కృషి చేస్తాం
- మనకి ఇంకోసారి కోడిగుడ్డు ప్రభుత్వం వద్దు, ఇక్కడ కోడిగుడ్డు మంత్రి విస్సన్నపేట, కశింకోట వద్ద దాదాపు 600 ఎకరాల భూములు దోచేసాడు
- ఇక్కడ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి, నాకు ఉత్తరాంధ్ర సత్యానంద్ అనే గురువు గారు నాకు నటన అనే స్కిల్ నేర్పిస్తే మీరు అందరూ ఆదరించే నటుడిగా మారదు, మీ కోసం పనిచేసే నాయకుడిగా మారారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలా ముఖ్యం. స్థానిక యువతకు భవిష్యత్తు కోసం పనిచేస్తాను
- జనసైనికులు సిఎం సిఎం అని దారిపొడవునా నినాదాలు చేస్తున్నారు, నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఖచ్చితంగా భవిష్యత్తులో మీ కోరిక నెరవేరుతుంది అని అనుకుంటున్నాను, ప్రస్తుతం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మన ధ్యేయం
- ఇక్కడ SEZ లో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా NDA కూటమి తరపున కృషి చేస్తాము
- అనకాపల్లి రైతులకు శారద నది నుండి 2 మండలాల పొలాలకు నీరు రావట్లేదు అని తెలిసింది. అన్ని మిని ప్రాజెక్టులు, కాలువల మరమత్తులు చేసి ప్రతీ పొలానికి నీరు వచ్చేలా చేస్తాము
- అనకాపల్లి బెల్లం ఎంతో పేరు ఉన్నది, ఒకప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం ఉపయోగించేవారు, కానీ శ్రీవాణి ట్రస్ట్ వారి, వైసీపీ ప్రభుత్వమో ప్రసాదం కోసం ఉపయోగించడం మానేసింది. మనం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రసాదానికి అనకాపల్లి బెల్లం ఉపయోగించేలా చేసి, గ్లోబల్ ట్యాగ్ వచ్చేలా చేస్తాం
- కో ఆపరేటివ్ విద్యుత్ సంస్థలు రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో విలీనం చేస్తే, అందులో ఉద్యోగాలు ఇస్తామని కోడిగుడ్డు మంత్రి ఒక్కొకరి దగ్గర 5 లక్షల లంచం తీసుకున్నాడు, అధికారం లోకి వచ్చాక సహకార విద్యుత్ సంస్థల విలీనం రద్దు చేస్తాం
- నూకాలమ్మ, దేవీపురం ఆలయాలను టూరిజం సర్క్యూట్ లా అభివృద్ది చేస్తాం. బొజ్జనకొండ బౌద్ధ ప్రాంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు వచ్చేలా అభివృద్ది చేస్తాం. దీని ద్వారా ఉపాధి వస్తుంది. శారద నది తీరం మంచి టూరిజం ప్రదేశంగా మారుస్తాం
- దారిపొడవునా ఉద్యోగులు CPS స్కీం గురించి అడిగారు, నా సమాధానం ఒక్కటే, నేను సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కొడుకును, మైనింగ్ వ్యాపారి కొడుకును కాదు, ఒక సిఎం కొడుకుని కాదు, పెన్షన్ అనేది ఉద్యోగికి ఒక పెద్దకొడుకు లాంటిది. మీరు కూటమి కి అధికారం ఇచ్చిన సంవత్సరం లోపే దీన్ని రద్దు చేస్తాము. దీనిపై ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కల్పించేలా పెద్దలు మనోహర్ గారు, చంద్రబాబు గారు, కొణతాల గారు అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం
- ప్రభుత్వ అధికార భవనాలు అన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కోడిగుడ్డు మంత్రి 600 ఎకరాల ప్రభుత్వ భూములు దోచేస్తారు. ప్రజాధనం అద్దె కట్టడానికి వాడుతున్నారు. అద్దె పేరుతో వారి భవనాలను అద్దెకు ఇచ్చి దోచేస్తున్నారు
- ఇక్కడ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే వాసన భరించలేక పోతున్నారు. ఇక్కడి నుండి చెత్త విశాఖ, మధురవాడ తీసుకెళ్లే క్రమంలో దారిపొడవునా చెత్త వేస్తూ దుర్వాసన వచ్చే పరిస్థితి ఉంది. NDA కూటమి అధికారంలోకి రాగానే బరోడా, లాస్ వెగాస్ తరహాలో ప్రతీ నియోజకవర్గంలో వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాము
- NDA కూటమి అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నిధులు కేటాయించి, రైతులను ఆదుకుంటాం
- రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చింది వైసీపీ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే గంజాయి, డ్రగ్స్ అరికడతాం. మొన్న విశాఖలో 25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ బయటపడ్డాయి. వీటిలో నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల పాత్ర లేకుండా ఉంటుంది ఎంటే ఎలా నమ్ముతాం
- ప్రధాని శ్రీ నరేంద్రమోది గారు కాలుష్యాన్ని తగ్గించడానికి, పెట్రోల్ వినియోగం తగ్గించడానికి ఇథనాల్ వినియోగం ప్రోత్సహిస్తున్నారు. మనకు ఇక్కడ విస్తారమైన చెరకు పంట ఉంది. ఇథనాల్ తయారీ కేంద్రాలు ఇక్కడ పెట్టి, ఎగుమతి చేసేలా కృషి చేస్తాము
- ఇక్కడ గత ప్రభుత్వంలో కేటాయించిన టిడ్కో ఇళ్లలో 1200 ఇల్లు విశాఖ వారికి కేటాయించారు. ఇక్కడ ఇల్లు అక్కడి స్థానిక ప్రజలకు కేటాయించాలి. NDA ప్రభుత్వం వచ్చాక ఆ దిశగా చర్యలు తీసుకుంటాం
అగనంపూడి నుండి పైపుల ద్వారా అనకాపల్లి ప్రజలకు నీరు అందించేందుకు పనులు చేపట్టినా పూర్తి చేయట్లేదు. ఆ పని NDA ప్రభుత్వం తీసుకుంటుంది. రోడ్లను విస్తరిస్తా, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం - అధికారంలోకి రాగానే ముందు చెత్త పన్ను తీసేస్తాం
- కోడిగుడ్డు మంత్రి శారద నదిపై వంతెన నిర్మించలేకపోయాడు. ఇక్కడ NDA కూటమి నుండి MP ఉంటే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకువస్తారు
- గతంలో కొణతాల గారు సంతోషిమాత దేవాలయం దాగర రైతు బజార్ ఏర్పాటు చేసినా పూర్తిగా వినియోగం చేయట్లేదు, అధికారంలోకి రాగానే దాని వినియోగంతో పాటు మరో రైతు బజార్ ఏర్పాటు చేస్తాం
- ఇక్కడ పార్కుకు, ఉద్యానవనాలు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తాం. TTD ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. తీసేసిన రేషన్ కార్డులు పునరుద్ధరిస్తాము. రహదారులు మరమ్మతులు, నూతన ఏర్పాటు చేస్తాం
- అక్రమ మైనింగ్ రద్దు చేస్తాం. అక్రమ మైనింగ్ కాలుష్యం వల్ల ఉద్దానం తరహా కిడ్నీ సమస్యలు ఇకక్డ వస్తున్నాయి. వాటిని అరికట్టే భాధ్యత తీసుకుంటాం
- నాయకుడే అవినీతి పరుడు అంటే, ఈ కోడిగుడ్డు మంత్రి అవినీతి అతన్ని మించిపోయింది. కొండల్ని దోచేస్తాడు, భూములు దోచేస్తాడు, ప్రైవేట్ సెటిల్మెంట్, క్యరీ యజమానులను బెదిరించడం, రెవెన్యూ దస్తాలు తారుమారు చేసి దోచేశాడు. జగనన్న కాలనీల భూముల కోసం 400 కోట్లు దోచేశారు, పిసినికోటలో దళితుల భూములను దోచేశారు. మంత్రి అనుచరుడు కశింకోట లో భూములు దోచేశారు. మంత్రి అనుచరులు క్రికెట్
- బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి
- పోలవరం గురించి వైసీపీ వాళ్ళను అడిగితే వాళ్లకు డ్యాన్సులు వేయడం తప్ప పోలవరం గురించి తెలియదు
- కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించి సొంత గనులు కేటాయించేలా జాతీయ నాయకులకు గళం వినిపించాలని CM రమేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం
- ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి అని కోరుకునే వ్యక్తిని. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను పదే పదే మాట్లాడుతున్నాను. నేను అందరం కలిసి డిల్లి వెళ్లి మాట్లాడదాం అంటే సంఘాల వాళ్ళు సిద్దంగా లేరు. వారు రాకుండా ఎలా? అందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ రక్షించుకునే భాధ్యత నాది
- నేను మీ బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడుతున్నాను, నా భవిష్యత్తు కోసం కాదు, నేను సినిమాలు చేసుకుంటే కోట్లు సంపాదించగలను, కానీ ఉద్దనం లాంటి సమస్యపై ఎవరు మాట్లాడతారు? అందుకే వచ్చాను
- ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునే భాధ్యత నేను ముందుండి నడిపిస్తాను అని నూకాలమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను
ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం కొణతాల గారు, CM రమేష్ గార్లను గెలిపించాలని అని కోరుతున్నాను - పిఠాపురంలో గెలిచిన తరవాత, ప్రమాణ స్వీకారానికి ముందు నూకాలమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను
- రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాను. కూటమి ప్రజలకు జవాబుదారీ గా ఉంటుంది