పిఠాపురం సభ – హైలెట్స్

పిఠాపురం
  • ఆంధ్రప్రదేశ్ దశా, దిశా మార్చేందుకు పిఠాపురం వచ్చాను, పిఠాపురం దానికి వేదికైంది. దేశం గర్వంగా చెప్పుకునేలా పిఠాపురం నుండి మార్పు తీసుకొచ్చి చూపిస్తాను
  • దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక్క ఎంఎల్ఏ లేకుండా, డబ్బు లేకుండా బలంగా మనలా పోరాడిన పార్టీ లేదు, మనం దెబ్బ తిన్నా సరే దశాబ్దకాలం పార్టీ నడిపాం. ఇది నా గొప్పతనం కాదు, నన్ను గుండెల్లో పెట్టుకున్న ఆడపడుచులు, జనసైనికులు పోరాట స్ఫూర్తి కారణం
  • బీజేపి జాతీయాధ్యక్షుడు శ్రీ జెపి నడ్డా గారు గర్వంగా ఒక్క ఎంఎల్ఏ కూడా లేని మన జనసేన పార్టీ కండువా మెడలో వేసుకున్నారు, 151 ఎంఎల్ఏ లు ఉన్న వైసిపి ను పక్కన పెట్టారు, అది జనసేన గొప్పతనం
  • ప్రజల హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. గ్రామం, సంగ్రమంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు, ఆ స్థితికి వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని తీసుకొచ్చింది
  • కాకినాడ సెజ్ లో పిఠాపురం యువతకు ఉపాధి వచ్చేలా నేను చూస్తాను, నేను భాధ్యత తీసుకుంటాను
  • జగన్ ఈరోజు భయపడుతున్నాడు, రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నాడు, మాట్లాడటానికి భయపడుతున్నాడు, ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు అని భయపడుతున్నాడు, ఆ భయం పరిచయం చేసింది జనసేన
  • మన హక్కులను అదిమేయాలని చూసాడు వైయస్ జగన్  భయపెట్టాలని చూసాడు, అలాంటి వ్యక్తిని భయపెట్టింది ఒక వీరమహిళ, ఒక జనసైనికుడు, సుగాలి ప్రీతి తల్లి, భావన నిర్మాణ కార్మికులు నా దగ్గరకి సమస్యలు తీసుకొస్తే వారి తరపున నేను ప్రశ్నించి భయపెట్టాను
  • నేను మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను, ఒక తరం కోసం పోరాటం చేస్తున్నాను, 2 తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాను
  • ధర్మో రక్షతి రక్షితః, నేను 10 ఏళ్ల నుండి ధర్మం కోసం పోరాడుతున్నాను, నన్ను తిట్టారు, అవమానించారు, నా భార్యను, బిడ్డలను తిట్టినా భరించాము, కేవలం సామాన్యులు భయపడే పరిస్థితి ఉండకూడదు అని
  • ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయాలి అనేది విదుర నీతి. ఈ రాష్ట్రం కోసం మా కుటుంబం నష్టపోయినా, త్యాగం చేయడానికి సిద్దపడదాం అని నా భార్యకు చెప్పి ముందుకు వచ్చాను
  • మొన్న సాయి ధరం తేజ్ ఇక్కడ ప్రచారానికి వస్తే వైసిపి గూండాలు గాజు సీసా తో దాడి చేయడానికి ప్రయత్నించారు. త్రుటిలో తప్పింది, తెలుగుదేశం కార్యకర్తలు తగిలి గాయం అయింది. ఇలా దాడులు చేసే పార్టీ వైసీపీ పార్టీ
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మన పార్టీ పోటీ చేసే స్థానాలు తగ్గించుకుని త్యాగాలకు సిద్ధమయ్యాం
  • ఈ దేశం కోసం మేము ప్రాణాలు ఇస్తాం, మీ గాజు సీసా దాడులు మమ్మల్ని భయపెట్టలేదు, వైసీపీ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. తల తెగిపడినా సరే పోరాటం ఆపదు జనసేన
  • ఉప్పాడ బీచ్ ను దేశం మొత్తం మీద అందమైన బీచ్ గా తీర్చిదిద్దే భాధ్యత నేను తీసుకుంటాను
  • మద్యపాన నిషేదం పేరు చెప్పి 40 వేల కోట్లు దోచేసిన వ్యక్తులు మీరు అభివృద్ది ఎలా చేస్తారు, జాబ్స్ ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు… నేను సినిమాలు చేసి వేలాది కౌలు రైతులను ఆదుకున్నాను, ఎంతో మందికి అండగా ఉన్నాను, అలాంటిది ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం చేయలేమా? అభివృద్ది ద్వారా హామీలు అమలు చేస్తాం
  • డబ్బు ఎవరిచ్చినా సరే, ఓటు మాత్రం జనసేనకు మాత్రమే పడాలి. గుర్తుంచుకోండి “గాజు గ్లాస్” గుర్తుకు ఓటు వేయాలి
  • కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉదయ్ తంగెళ్ళ గారిని గెలిపించండి, కేంద్రంతో మాట్లాడి పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసే భాధ్యత తీసుకుంటాను
  • పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, అసెంబ్లీ అంటే పిఠాపురం అనేలా అభివృద్ది చేస్తాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాను, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దే భాధ్యత నాది
  • పవన్ కళ్యాణ్, పిఠాపురం MLA అభ్యర్థి, బ్యాలెట్ వరుస సంఖ్య 4, “గాజు గ్లాస్” గుర్తుపై ఓటు వేయండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్