వైసీపీ అవినీతి సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని చూస్తోంది

వైసీపీ

• వైసీపీ ప్రలోభాలకు లొంగిపోవద్దు
• గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి
• నేను జగన్ లా మాటలు చెప్పను.. పిఠాపురం ప్రజలకు అండగా ఉంటా
• మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం… రూ. 20 వేల వేట విరామ భృతి
• పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచార ర్యాలీలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘వైసీపీ అవినీతి సొమ్ముతో పిఠాపురం ప్రజల ఓట్లు కొనాలని చూస్తోంది. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో డబ్బు, మద్యం వెదజల్లి గెలవాలని చూస్తోంది. అది ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసిన కల్తీ మద్యం తాలూకు డబ్బు. వైసీపీ ప్రలోభాలకు తలొగ్గవద్దు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి కూటమికి మద్దతు తెలపండి. పిఠాపురం అభివృద్ధికి కట్టుబడి ఉంటామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నా. దేశ ప్రధానిని ఒప్పించి మద్దతుగా రాష్ట్రానికి తీసుకువచ్చాను అన్నారు. నేను జగన్ లాగా మాటలు చెప్పను. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానని అన్నారు. పిఠాపురం ప్రజానీకం గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. పిఠాపురం ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి మద్దతు తెలపగా, జన ప్రభంజనం మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో సాగింది. రోడ్ షోలో భాగంగా చిత్రాడ, జగ్గయ్యచెరువు, పాదగయ క్షేత్రం సర్కిల్, గొల్లప్రోలు, మల్లవరం, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తదితర గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామగ్రామాన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనతో పాటు కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ…
• తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని చాలా గ్రామాల్లో తాగునీరు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. డ్రెయిన్లలో పూడికలు తీసే దిక్కు లేక మురుగునీటి పారుదల ఇబ్బందికరంగా తయారయ్యింది. చెత్త పన్ను వసూలు చేస్తున్న ఈ చెత్త ప్రభుత్వం రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. ఎస్ఈజెడ్ పరిధిలో ఉపాధి అవకాశాలు లేవు. మత్స్యకారులకు భరోసా లేదు. కెమికల్ ఫ్యాక్టరీలు వదిలే రసాయన వ్యర్ధాలు మూలంగా మత్స్య సంపద దెబ్బ తింటోంది. రిలయన్స్, ఒ.ఎన్.జి.సిల డ్రిల్లింగ్ కి మత్స్య సంపద చెదిరిపోతోంది. ఆయా కంపెనీల నుంచి న్యాయంగా మత్స్యకారులకు అందాల్సిన పరిహారం అందడం లేదు. తీర ప్రాంతం కోతకు గురై గ్రామాలు కోతకు గురవుతుంటే పట్టించుకునే నాధుడు లేడు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. కూటమి నాయకత్వంతో కలసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం. మత్స్యకారులకు అండగా ఉంటాం. సబ్సిడీ డీజిల్ తీర ప్రాంతాలకు అందుబాటులో ఉంచుతాం. వేట విరామ భృతి రూ. 20 వేలు అందచేస్తాం. సబ్సిడీపై వేట సామాగ్రి అందచేస్తాం. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా జీయో ట్యూబ్ వ్యవస్థను తీసుకువస్తాం. కెమికల్ ఫ్యాక్టరీలు సముద్ర జలాలను విషతుల్యం చేయకుండా కాలుష్యకారకాలను శుద్ధి చేసిన తర్వాత సముద్రంలోకి వదిలేలా చర్యలు తీసుకుంటాం. ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామని ఎస్ఈజెడ్కి భూములు తీసుకుని మాట తప్పారు. అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సెజ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. నేను రాష్ట్రం మొత్తం కూటమి అభ్యర్ధుల విజయం కోసం ఎన్నికల ప్రచారం కోసం తిరుగుతుంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలిచారు. అందిరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తూ.. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాల”ని అన్నారు.
• రెపరెపలాడిన జనసేన జెండాలు
పీఠికాపురి పులకించింది. గొల్లప్రోలు గర్జించింది. ఉప్పాడను జనసముద్రం ముంచెత్తింది. గురువారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోతో యావత్ పిఠాపురం నియోజకవర్గం జనంతో కిటకిటలాడింది. జనసేన జెండాలు, గాజు గ్లాసు గుర్తులతో కూడిన ప్లకార్డులతో నిండిపోయింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా స్వచ్చందంగా రోడ్ల మీదకు వచ్చిన ప్రజలు ముందుగానే జనసేన ఘన విజయం ఖాయమని చెప్పకనే చెప్పారు. గురువారం మధ్యాహ్నం చిత్రాడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రజల జయ జయధ్వానాల మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ప్రారంభం అయ్యింది. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి హారతులు పట్టగా, యువత పూల వర్షం కురిపించారు. గాజు గ్లాసు గుర్తులు చేతబూని జనసేనానికి అఖండ విజయం కట్టబెడతామని నినదించారు. ప్రజల ప్రేమకు ముగ్దులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకు అండగా ఉంటానని, ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. సుమారు 40 కిలోమీటర్ల మేర ఏడు గంటలపాటు నిర్విరామంగా ఈ రోడ్ షో సాగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే పిఠాపురం అభివృద్ధి సాధ్యం. ఆయన్ని గెలిపిస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామ గ్రామాన ఉన్న సమస్యలు తెలుసుకుంటూ, అక్కడ సమస్యలపై స్పందిస్తూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.దారి పొడుగునా నియోజకవర్గ ప్రజలు మా చిన్నారుల భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నామంటూ తల్లులు పసిపిల్లలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేతిలో పెట్టేందుకు పోటీ పడ్డారు. తనకు సమీపంగా వచ్చిన ప్రతి చిన్నారినీ ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. భావి తరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తానని చెప్పకనే చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో తమ గ్రామానికి వస్తుందని తెలుసుకున్న ప్రజలు గ్రామ గ్రామాన డప్పు చప్పుళ్లు, బాణసంచా పేలుళ్లతో ఘన స్వాగతం పలికారు. రహదారులతోపాటు మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, అవకాశం ఉన్న చోట కరచాలనాలు చేస్తూ, ప్రజలతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహ పరిచారు. రోడ్ షో లో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శ్రీ వర్మ గారు, బీజేపీ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు గారు, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు శ్రీ సాగర్, శ్రీ జానీ మాస్టర్, పెద్ద సంఖ్యలో మూడు పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్