జగన్ కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం

జగన్

• వైసీపీ సర్కారు రైతులకు మేలు చేయలేదు
• నిరుద్యోగుల్ని పట్టించుకోరు… వ్యాపారాలు చేసుకోనివ్వరు..
• వైసీపీ దాష్టికాలు ఆగాలంటే శ్రీ మోదీ ప్రధాని కావాలి… రాష్ట్రంలో కూటమి రావాలి
• పీలేరు ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు
‘వైసీపీ పాలకులు రైతులకు మేలు చేయరు. నిరుద్యోగులను పట్టించుకోరు. వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోనివ్వరు. ఈ అరాచక పాలనకు ముగింపు పలకాల’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. వైసీపీ దాష్టికాలు ఆగాలన్నా, రైతులు, యువత, మహిళలకు భరోసా లభించాలన్నా దేశంలో శ్రీ మోదీ గారు మరోసారి ప్రధాని కావాలని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. పరిపాలనా దక్షతలేని కక్షపూరిత రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రం ఐదేళ్లుగా తిరోగమనం బాట పట్టిందన్నారు. 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. బుధవారం పీలేరులో జరిగిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో కలసి పాల్గొన్నారు. సభకు హాజరైన ఆశేష జనవాహినిని ఉద్దేశించి శ్రీ నాగబాబు గారు ప్రసంగిస్తూ “ఇది రాయలవారు ఏలిన రాయలసీమ. భారత దేశ పురోభివృద్ధికి అనుక్షణం పరితపిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ గడ్డ నుంచి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ మోదీజీ గ్యారెంటీ, శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పిన ప్రధాని మాటలు ఐదు కోట్ల మంది ప్రజలకు భరోసా కల్పించాయి. శ్రీ మోదీ గారి నాయకత్వంలో దేశం వెలిగిపోతోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మన రాష్ట్రం మాత్రం ఐదేళ్లుగా తిరుగోమనంలో ఉంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. వైసీపీ ప్రభుత్వం పరమ పవిత్రమైన తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బ తీసింది. శ్రీవాణి దర్శనాల పేరిట స్వామి దర్శనాన్ని వ్యాపారం చేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతోంది. శ్రీ మోదీ గారు అయోధ్యలో బాల రాముడి విగ్రహం ప్రతిష్టాపన చేస్తే, మన రాష్ట్రంలో రాముడి తల నరికేశారు. గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరాన్ని నిర్మించి మన ధర్మాన్ని శ్రీ మోదీ గారు విస్తరింప చేస్తుంటే, వైసీపీ ప్రభుత్వంలో దేవతా మూర్తుల విగ్రహాల చేతులు నరికేసి, రథాలు తగులబెడుతున్నారు. హిందూ మతాన్ని అవమాన పరుస్తున్నారు.
• ఎర్రచందనం స్మగ్లర్లకు వైసీపీ టిక్కెట్లు
శేషాచలం అడవుల్లో దొరికే అరుదైన ఎర్రచందనాన్ని వైసీపీ నాయకులు విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో రూ. 3 వేల కోట్ల విలువైన ఎర్రచందనం దేశం దాటి పోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన వ్యక్తికి వైసీపీ టిక్కెట్ కూడా లభించింది. ఏ పని కావాలన్నా రాష్ట్రంలో జె ట్యాక్స్ మాదిరి ఈ ప్రాంతంలో పి టాక్స్ కట్టాలి. ఆఖరుకి మూతపడిన మైనింగ్ యూనిట్స్ నుంచి కూడా నెలకు రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారు.
• రాయలసీమ రైతులకు కూటమి అండ
రాయలసీమ ప్రాంతం ఉద్యాన పంటలకు, మదనపల్లి టమాటా మార్కెట్ ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో పంటల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. శ్రీ మోదీ గారు, కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి అండగా నిలుస్తారని వారి తరఫున హామీ ఇస్తున్నాను. శ్రీ మోదీ గారి దూరదృష్టి, శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ది రాష్ట్రానికి మేలు చేస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్యమతస్తుల ప్రమేయం లేకుండా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్