తిరుపతి – హైలెట్స్

తిరుపతి
  • తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుపై, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలి
  • తిరుపతి మన మెగాస్టార్ చిరంజీవి గారిని గెలిపించిన నియోజకవర్గం. ఇక్కడ మనం పోటీ చేస్తున్నాం, తిరుపతి ఆధ్యాత్మికతకు రక్షణ కల్పిస్తాం, తిరుమలను కాపాడుకుందాం
  • కొవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక రుయా ఆస్పత్రిలో 11మంది చనిపోయారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక TTD నిధులు సక్రమంగా వినియోగించి, ఆసుపత్రి అభివృద్ది చేస్తాం
  • రేణిగుంట పారిశ్రామిక వాడ నుండి అనేక పరిశ్రమలు తరలిపోయాయి. రిలయన్స్, టాటా వోల్టాస్, అమర్ రాజా లాంటి కంపెనీలు తరలిపొయాయి. మళ్ళీ వాటిని తీసుకొచ్చే భాధ్యత తీసుకుంటాం
  • భూమన కరుణాకర్ రెడ్డి గారు, వారి అబ్బాయి పేదల ఇళ్ల మీద కూడా 10-30 శాతం దోచుకుంటున్నారు. అలాంటి వారు మనకి వద్దు
  • పచ్చని చెట్టు కనపడితే చాలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు నరికేసి అమ్ముకుంటున్నారు. వారి నుండి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి
  • స్థానిక ప్రజలకు తిరుపతి లో ప్రతి 2వ మంగళవారం దర్శనం ఉండేది, వైసిపి ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అధికారంలోకి వచ్చాక దానిని పునరుద్ధరించి శ్రీవారి దర్శన అవకాశం కల్పిస్తాం
  • శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప, పనులు చేయడం లేదు. ఆఖరికి శ్రీవారి లడ్డూ నాణ్యత, సైజ్ కూడా తగ్గించేసింది వైసీపీ ప్రభుత్వం
    తిరుమల శ్రీవారి నిలయం, రిసార్ట్ కాదు. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాన్ని రిసార్ట్ లా మార్చేసారు
  • వైసీపీ తీసుకొచ్చిన లాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఆఖరికి శ్రీవారి ఉద్యోగులకు TTD ఇచ్చిన పట్టాల్లో కూడా వైయస్ జగన్ నవ్వుతూ ఉండే బొమ్మ వేసుకున్నాడు. ఆఖరికి శ్రీవారికి కూడా గౌరవం లేదు. శ్రీవారి బొమ్మ ఉండాలా లేక జగన్ బోమన్ ఉండాలా.
  • 2009 లో చిరంజీవి గారు MLA గా ఉన్నప్పుడు, 1,600 ఇల్లు పైగా శాంక్షన్ చేస్తే, తరవాత వచ్చిన వారు వాటికి కనీసం స్లాబులు వేయకుండా వదిలేశారు. చిరంజీవి గారి ఆశయాన్ని జనసేన పూర్తి చేస్తుంది
  • తిరుమల నిధులను అడ్డగోలుగా దోచేశారు. గతంలో తిరుమల శ్రీవారికి 7 కొండలు ఎందుకు 6 సరిపోవా అని అన్నవారు ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. సాక్ష్యాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వేంకటేశ్వర స్వామి వారి జోలికి వెళ్తే ఎంతటి వారైనా మట్టిలో కలిసిపోతారు
  • తిరుమల స్వామి వారి సొమ్ము కాజేసి మీకు ఓట్లు కొనడానికి భూమన కుటుంబం డబ్బులు ఇస్తుంది. దయచేసి మీరు ఆ డబ్బులు హుండీలో వేసేయండి. స్వామి వారి డబ్బు తీసుకోవడం మంచిది కాదు
  • సర్వేలన్ని మనకు అనుకూలంగా ఉన్నాయి, మనమే గెలుస్తున్నాం, కూటమిదే విజయం

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్