గుడివాడ – హైలెట్స్

గుడివాడ
  • గుడివాడకు వచ్చే రోడ్డు గోతులమయం, దాని మీద ప్రశ్నిస్తే ఇక్కడి నాయకులు బూతు పురాణాలు మొదలుపెడతారు
  • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. మన భూముల మీద లోన్ తెచ్చుకుందామంటే కనీసం ఒరిజినల్ పేపర్లు కూడా మన దగ్గర లేకుండా ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాం అంటున్నారు, మీ భూములపై మీకు హక్కు లేకుండా చేస్తున్నారు
  • జగన్ భూ దోపిడీ విధానం
    ముందు పట్టా పుస్తకాలపై బొమ్మ వేసుకున్నాడు, తరవాత సరిహద్దు రాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు, ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని, జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారట, వీటితో లోన్స్ ఎవరైనా ఇస్తారా? ఇలాంటి పిచ్చి చట్టం తీసుకొచ్చింది @YSRCParty ప్రభుత్వం
  • కూటమి ప్రభుత్వం వస్తుంది, మెజారిటీ ఎంత అనేది మాత్రమే లెక్క తేలాల్సి ఉంది, జనసేన – తెలుగుదేశం – బీజేపి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి
  • పేకాట క్లబ్బులు నిర్వహించడానికి, దండాలు చేయడానికి, భూములు దోచేయడానికి సిద్దంగా అంటారు @YSRCParty నాయకులు, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి మాత్రం సిద్దంగా లేరు
  • రాష్ట్రంలో దాదాపు 7 వేల ఎయిడెడ్ స్కూల్స్ మూసేసింది @YSRCParty ప్రభుత్వం, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసి, వారిపై భారం మోపింది జగన్ ప్రభుత్వం
  • గుడివాడ MLA కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న TDP అభ్యర్థి వెనిగండ్ల రాము గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి, ఇక్కడ నోరు పారేసుకునే MLA నోరు మూయించండి
  • వైసిపి నాయకులు తిట్టిన ప్రతీ తిట్టుకు ట్యాక్స్ వేస్తే రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యా, వైద్యం అందించవచ్చు అన్ని బూతులు తిట్టారు
  • NTR గారి పేరు NTR హెల్త్ యూనివర్సిటీ కి ఎందుకు తీసేసారు? NTR పేరు తీసేసి YSR పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది?
  • జగన్ గుర్తుంచుకో మీ నాన్న గారి కంటే ముందు చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, మీ నాన్న పేరు పెట్టుకోవద్దు అనడం లేదు, ఇతర మహనీయులు ఎంతోమంది ఉన్నారు, వారికి గౌరవం కల్పించాలి
  • 30 కేసుల్లో 5 ఏళ్ల నుండి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని గెలిపిస్తే, విశాఖలో 25 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు, ఇంకోసారి అవకాశం ఇస్తే మీ ఆస్తులు తాకట్టు పెడతాడు
  • మచిలీపట్నం MP గా వల్లభనేని బాలశౌరి గారిని గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఇక్కడ MLA పనిచేయకపోయినా, ఆయన కేంద్రం నుండి 300 కోట్లు పైన నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ది చేసారు, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారు
  • YCP మద్దతుదారులు కూడా వైసీపీ కి ఓటు వెయ్యకండి, మీరు ఓటు జగన్ కు ఓటేస్తే మీ ఆస్తులపై మీరే హక్కు వదిలేసుకున్నట్లు, గాలిలో దీపంలా మీ ఆస్తులు పెట్టినట్లే
  • రాష్ట్రంలో రోడ్ల మీద గోతులు, వైసిపి నేతలు నోటి నిండా బూతులు, మొత్తం కేసులు అన్నట్లుగా ఉంది పరిస్థితి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్