నెల్లూరు – హైలెట్స్

నెల్లూరు
  • నేను తిరిగిన నెల్లూరు సింహపురి గడ్డ, ట్రంక్ రోడ్డు, నర్తకి సెంటర్ అంతా జ్ఞాపకం ఉన్నాయి, ఇంత ఘన స్వాగతం ఇస్తారని ఊహించలేదు
  • నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఇచ్చింది నెల్లూరు, ఇక్కడ చదువుకునే నేను సమాజాన్ని అర్దం చేసుకున్నాను, మహనీయుల స్ఫూర్తి తీసుకున్నాను. నేను ఇక్కడే ఫతేఖాన్ పేటలో తిరిగిన వాడిని
  • వచ్చేది కూటమి ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వం రాబోతుంది, ఖచ్చితంగా వైసిపి ఓడిపోతుంది, నిలబడదాం, బలంగా పోరాడుదాం, అవినీతి కోటలు బద్దలు కోడదాం
  • నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నెల్లూరి సిటీ MLA గా నారాయణ గారిని గెలిపించల్సిందిగా కోరుతున్నాను
  • సింహాపురిలో సింహ గర్జన జరుగుతుంది. ఇక్కడే పెరిగిన పవన్ కళ్యాణ్ గారి రాకతో పండుగలా ఉంది, ఆయనకు ఇక్కడే ప్రతీ గల్లి తెలుసు
  • నేను ఎంతో అభిమానించే కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు పుట్టిన నేల నెల్లూరు
  • నాకు జ్ఞానం నేర్పిన నేల నెల్లూరు, ఇక్కడే నా స్నేహితుడు, ఆర్యవైశ్యుడు రమేష్ అనే మిత్రుడి బుక్ శాప్ లో ఉన్న పుస్తకాలు నాకు జ్ఞానాన్ని అందించిది
  • ఈ దేశపు సంపద కలల ఖనిజాలతో నిండిన యువత, వారిని కాపాడుకోవాలి అని ప్రధాని నరేందమోదీ గారికి చెప్పాను. ఆయన విజన్ 2047 అని చెప్తుంటే నాకు యువ శక్తితో సూపర్ పవర్ గా ఎదుగుతుంది అని నమ్మకం ఉంది
  • మనకి 2 వారాల సమయం కూడా లేదు, మీరు తీసుకునే నిర్ణయం ఒక తరం కోసం ఆలోచించి తీసుకోవాలి, జగన్ వచ్చి 5 యేళ్లు అయింది, కాలం గిర్రున తిరిగిపోయింది, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
  • జగన్ రంగులు వెయ్యడానికి, తియ్యడానికి ఖర్చుపెట్టిన 2,300 కోట్లు విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం ఇవ్వొచ్చు కదా
  • జగన్ ఓట్లు అడగటానికి బెదిరిస్తూ అడుగుతున్నాడు, 2019 లో వొంగి వొంగి ఓట్లు అడిగిన జగన్, ఇప్పుడు బెదిరిస్తూ అడుగుతున్నాడు, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్
  • జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి అందరూ రాష్ట్రం వదిలి పారిపోతాం అంటున్నారు, మీరు పారిపోవక్కర్లేదు, పెన్నా నది నెల్లూరు ను వదిలి వెళ్ళదు, మీరు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు
  • మేము మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడతాం
  • జగన్ కు ఎన్నికల ఆరాటం తప్ప.. రాష్ట్ర భవిష్యత్తు పట్టదు
  • భయపెట్టి ఓట్లు అడుగుతున్న జగన్
  • విజన్ 2047లో రాష్ట్ర యువత నుంచే అధిక భాగస్వామ్యం ఉండాలి
  • నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్