గిద్దలూరు – హైలెట్స్

గిద్దలూరు
  • అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతారు కానీ, మన ప్రకాశం జిల్లా వెనుకబాటు తనం గురించి ఎవ్వరూ మాట్లాడరు
  • కనిగిరి ప్రాంతంలో ఉద్దానం తరహా కిడ్నీ వ్యాధులు, ఫ్లోరోసిస్ కేసులు ఉన్నాయి, దీని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు, వెలిగొండ ప్రాజెక్టు నీరు వస్తే మార్కాపురం, గిద్దలూరు ప్రాంత నీటి కష్టాలు తీరుతాయి, కానీ వైయస్ జగన్ వెళ్లి ఖాళీ సొరంగాలు ఓపెన్ చేస్తూ ఉంటాడు
  • ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు కావలసింది, విద్యా, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి, లా అండ్ ఆర్డర్
  • గిద్దలూరు లో రోడ్లు బాగాలేవు అని ప్రశ్నించినందుకు జనసైనికుడు వెంగయ్య నాయుడు అనే వ్యక్తిని దారుణంగా చంపించారు వైసీపీపార్టీ MLA అన్నా రాంబాబు. గిద్దలూరు లోనే కాదు, ఎక్కడైనా వైసిపి అభ్యర్థిని గెలిపించారా ఇక మీ జీవితాలకు రక్షణ ఉండదు జాగ్రత్త
  • మన సభలకు ధైర్యంగా ప్రజలు రావడం చూస్తుంటే వైసీపీపార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది, వైసీపీ గూండాల నుండి ఈరోజు రాష్ట్రం ధైర్యంగా ఉంది అంటే అది జనసేన, జనసైనికుల ధైర్యమే కారణం
  • తెలుగు గంగా, గుండ్లకమ్మ అనుసందానం చేస్తాం. నదుల అనుసందానం ద్వారా ప్రతీ చేనుకు సాగునీరు అందేలా చూస్తాం
  • జగన్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ నిధులు 1,200 కోట్లు చెల్లించకుండా హాస్పిటల్స్ కు ఎగ్గొట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్క కుటుంబానికి 25లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తాం, ఇది దేశంలోనే మొదటి సారి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం
  • జగన్ ది కడుపు కాదు, కంభం చెరువు, ఎంత అవినీతి సొమ్ము తిన్నా సరిపోదు, వారి MLA లు, MP లు కూడ ఆ స్థాయిలో దోచుకుంటున్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు గారు 6 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన కంభం చెరువు ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయొచ్చు, కానీ చెయ్యడు
  • ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను, ఆయన గెలిచాక మన ఒంగోలు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించేలా, వలసలు ఆగిపోయేలా పనిచేయాలని కోరుతున్నాను
  • ప్రకాశం జిల్లాలో నల్లమల అడవులు ఉన్నాయి, ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని అభివృద్ది చేసే భాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది
  • నేను రైతు, యువత పక్షపాతి, మహిళా సంక్షేమం కోరుకునే వారిని, ప్రజల సమస్యలు అర్దం చేసుకున్న వాడిని, మీ కోసం అండగా నిలబడే వ్యక్తిని
  • నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను, గెలుస్తున్నాను. నేను ఒక్క పిఠాపురం కోసమే కాదు 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలు, 5 కోట్ల ప్రజల కోసం పనిచేసేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాను
  • ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
  • ప్రకాశం జిల్లాని సశ్యశ్యామలం చేస్తాం
  • వెలిగొండను వైసీపీ నిర్లక్ష్యం చేసింది
  • ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానన్న జగన్ ఖాళీ సొరంగాలు ప్రారంభించాడు
  • వైసీపీ ఎమ్మెల్యేలు అందలం ఎక్కితే మన భవిష్యత్తుని చంపేస్తారు
  • కూటమి ప్రభుత్వంలో తొలి సంతకం మెగా డీఎస్సీపైనే
  • ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
  • స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పునరుద్దరణ
  • కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి.. మీ కష్టంలో నేనుంటా

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్