* పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు
* జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
ఈ నెల 14న ప్రారంభమైన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేటి మలికిపురం సభతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దశను ముగించి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ యాత్రను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు చెందిన పిఏసీ సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులకు ఒక ప్రకటనలో అభినందనలు తెలియచేశారు. యాత్ర సాఫీగా సాగడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లిన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్, కమిటీ సభ్యులకి, యాత్ర కోసం ఏర్పాటైన వివిధ కమిటీల సభ్యులకి ప్రత్యేక అభినందనలు. వారాహి విజయ యాత్రకి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేశారు.