- సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు, 30 వేలకు పైగా ఆడపిల్లలు తప్పిపోతే పట్టించుకోని వాడు వైఎస్ జగన్..
- నన్ను వైజాగ్ లో నిర్భందించినప్పుడు విశాఖపట్టణం మొత్తం వచ్చి నొవోటెల్ దగ్గర ఆగింది.
ఒక మహిళ, నాలుగేళ్ల బిడ్డని చంకనెత్తుకుని దోమలు కుడుతున్నా నిలబడి నా అన్నకోసం వచ్చాను అంటే కేవలం నాకోసం వచ్చినట్టు కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి వచ్చినట్టు. నా గుండె కదిలిపోయింది, వీళ్ళ కోసం ప్రాణం పెట్టి పని చేసినా తప్పు లేదు అనిపించింది. - బోట్లు తగలబడ్డాయి అని బాధితులకి తలా 50,000 మనం ఇస్తే తీసుకున్న వారిని బెదిరించే దారుణమైన సంస్కృతి వైసీపీది.
- ఇంకొక్క సారి వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక రాష్ట్రానికి లేదు. అందుకే బంగళాఖాతం లో కలిపేయాలి.
- వైఎస్ జగన్ కి భూమిని తొలిచి డబ్బు చేసుకోడం తెలుసు. కానీ అదే భూమిలో విత్తు నాటి, పంట పండించి, మన ఆకలి తీర్చడం రాదు.
- వేలు చూపించి సిద్ధం అంటాడు జగన్.. ఎవడిని బెదిరించడానికయ్యా నువ్వు సిద్ధం ?
- మేము ఉండలేము రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాం అంటున్నారు.. మన నేల ఇది. ఇక్కడే కొట్లాడి నిలబడాలి తప్పా ఒక గుండా పరిపాలిస్తున్నాడు అని భయపడి పారిపోకూడదు..
- ఋషికొండని తిరిగి సృష్టించగలమా ? ఆలోచించాలి విశాఖవాసులు.. మీ నేలను పరిరక్షించుకునే బాధ్యత మీరు తీసుకోవాలి.
- జగన్ కు ఓటేస్తే ప్రజల ఆస్తులన్నీ గాలిలో దీపాలై ఆరిపోతాయి
- 2019లో నేను హెచ్చరించినట్లే జగన్ పాలనలో భూ దోపిడీ జరిగింది
- జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు వెనుక భారీ కుట్ర. ఈ చట్టం అమలు అయితే ప్రజలకు సొంత ఆస్తి అనేది ఉండదు
- ఉత్తరాంధ్రను క్రీడా హబ్ గా పంజాబ్ మాదిరి తీర్చిదిద్దుతాం
- మైనార్టీలు, మత్స్యకారుల అభ్యున్నతికి నాదీ భరోసా