వైసీసీ నాశనం శివాజ్ఞ

వైసీసీ

• శ్రీశైలం మల్లికార్జునుడికి కావాలనే మహా కుంభాభిషేకం ఆపేశారు
• జగన్ కు అరిష్టం అని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించడంతోనే ఈ ఘాతుకం
• రాష్ట్రానికి పట్టిన దెయ్యాన్ని ప్రజలే వదిలించాలి
• ప్రతి ఎన్నికకు హత్య, దెబ్బ తగిలితేగాని జగన్ కు శాంతి ఉండదు
• సామాన్యుడి బతుకు దెబ్బ కంటే, జగన్ గులకరాయి దెబ్బ పెద్దదా..?
• వైసీపీ పాలనలో ప్రజాధనం అడ్డగోలుగా పందేరం
• కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు, పోలీసుల పెండింగ్ బకాయిలు తీరుస్తాం
• తాడేపల్లిగూడెం ప్రాంతాన్ని రవాణా, ఎడ్యుకేషన్ హబ్ చేస్తాం
• తాడేపల్లిగూడెం వారాహి విజయభేరి సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘శ్రీశైలం మల్లికార్జునుడికి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం క్రతువును వైసీపీ కావాలనే వాయిదా వేస్తూ వస్తోంది. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ పవిత్ర కార్యాన్ని జరిపించలేదు. దక్షిణాయనంలో ఉన్న శివుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీ గండం అని కొందరు జ్యోతిషులు చెప్పడంతోనే కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు పర్యాయాలు ఏ కారణం చెప్పకుండా రద్దు చేశార’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇటీవల కొందరు పెద్దలు గట్టిగా నిలదీస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని కొత్త కథలు చెబుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని వైసీపీ కావాలని ఆపేసింది.. ఇది ఆదిదేవుడైన శివుడికి ఆగ్రహం కలిగించే నిర్ణయం అవుతుందన్నారు. కచ్చితంగా శివుడు మూడో కన్ను తెరిస్తే, ఆ మంటల్లో వైసీపీ కాలిపోతుంది. కారణం అయిన వారు సర్వనాశనం అవుతారని ఆయన హెచ్చరించారు. సోమవారం తాడేపల్లిగూడెం నియోకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మలను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారు శ్రీశైలం శివుడికి మహా కుంభాభిషేకం విషయంలో రకరకాల మాటలు చెబుతున్నారు. ప్రజలను మభ్య పెడుతున్నారు. ఒంటిమిట్ట రామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ముఖం చాటేస్తే, దేవాదాయశాఖ మంత్రి ఆ బాధ్యతను తీసుకోవాలి. కాని అనూహ్యంగా ఇసుక దొంగ, మైనింగ్ దొంగ అయిన పెద్దిరెడ్డిని పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు పంపారు. నువ్వు పరిపాలన చేయమంటే, వారి మోచేతి అంబలి తాగుతాను అనుకునే వారితో ఏం మాట్లాడతాం. వైసీపీ నాయకులు శివాలయంలో అర్చకుల మీద దాడులు చేస్తారు. భీమవరం సోమశ్వర ఆలయంలో అర్చకుడి యజ్ఞోపవీతం తెంచి వారిని అవమానిస్తారు. వీళ్లను ఎవరూ ఏమీ చేయలేరని వీరి అహంకారం. వీళ్లను బలంగా ఎదిరించడానికి ప్రజలే పోరాట సమూహాలుగా మారాలి.

2019 లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని నిలువునా మోసం చేసిన దొంగ మళ్లీ వస్తున్నాడు. ఆయన గెలవాలి అంటే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఎవరో ఒకరు చచ్చిపోవాలి లేదా ఏదో ఒక దెబ్బ తగలాలి. ఏదో ఒకటి కూల్చివేస్తే తప్ప ఆయనకు నిద్రపట్టదు. విధ్వంసం, వినాశనం మాత్రమే ఒంట బట్టించుకున్న ఆ దొంగకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. లేకుంటే రాష్ట్రాన్ని కాపాడటం ఆసాధ్యం. 2019 నుంచి 2024 వరకు ఓ దెయ్యాన్ని నమ్మి భూజాలపై ఎక్కించుకొని తిరగాం. ఇకనైనా కనువిప్పు కలిగి ఆ దెయ్యాన్ని రాష్ట్రం బయటకు పంపుదాం. ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునే బాధ్యతను నెరవేరుద్దాం. యువతరం దీనిపై లోతుగా ఆలోచించాలి. ముఖ్యంగా మహిళలు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళమెత్తాలి. వారు ముందుకు వస్తేనే మనం మళ్లీ రాష్ట్రాన్ని బతికించుకోవచ్చు. జగన్ కు చిన్న గులకరాయి దెబ్బ తగిలితేనే దెబ్బ తగిలినట్టా..? దానికే నొప్పి. మంట ఉంటుందా..? భవన నిర్మాణ కార్మికులు జగన్ తీసుకొచ్చిన ఇసుక విధానంతో కూలి పనులు కోల్పోయి 39 మంది ఆకలితో చనిపోతే దెబ్బ తగలదా..? 15 ఏళ్ల బాలుడ్ని చెరకు తోటలో పెట్రోలు పోసి హత్య చేస్తే నొప్పి ఉండదా..? ఓ దళితుడ్ని హత్య చేసి, వాళ్లింటికే డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఆ పేద కడుపులు మండవా..? సామాన్యుడి బతుకులు పోయినా, వారి జీవితాలు రోడ్డున పడిపోయినా చీమకుట్టినట్లు ఉండదా..? జగన్ కు చిన్న గులకరాయి దెబ్బ తగిలితే మాత్రం మామూలు హడావుడి ఉండదు. ఇదే నాకు ఆవేదన కలిగిస్తోంది. జగన్ కు వస్తేనే కష్టం. సామాన్యుడికి వస్తే మాకు పట్టదు అన్నట్లుగా పాలన తయారైంది. ఇది మారాలి. సామాన్యుడి కష్టం పట్టించుకునే పాలన రావాలి.
• సలహాదారుల జీతాలకే రూ.640 కోట్ల ప్రజా ధనం వృథా
దేశాన్ని పాలించే ప్రధాని శ్రీ మోదీ గారి నెల జీతం రూ.1.60 లక్షలు. జగన్ ప్రభుత్వంలో ఆయన నియమించుకున్న 89 సలహాదారులకు ప్రజాధనం నుంచి వెచ్చించిన సొమ్ము రూ.640 కోట్లు. వీరిచ్చిన సలహాలు ఏమిటనేది ఎవరికీ తెలీదు. ఎవరికీ అర్ధం కాదు. వాలంటీర్ల సన్మానం కోసం రూ.710 కోట్లు ఖర్చు చేశారు. వాలంటీర్లకు సాక్షి పేపర్ వేసినందుకు రూ.600 కోట్లు ఇచ్చారు. ఇలా ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా పందేరం చేశారు. అదే డబ్బును విద్యార్థుల ఫీజు రియంబర్సుమెంటుకో, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికో, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఇచ్చేందుకో వెచ్చించి ఉంటే చాలా సమస్యలు తీరేవి. జగన్ కు జనం సమస్యలు పట్టవు కాబట్టి ఆ పని చేయడు.
• జగన్ పై చీటింగ్ కేసు పెట్టాలా..?
ఉద్యోగులు ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్ సొమ్మును జగన్ వాళ్లకే తెలియకుండా మళ్లించాడు. పీఎఫ్ డబ్బులు ఏవని అడిగితే స్పందించడు. మనం ఒకరి వద్ద డబ్బు దాచుకుంటే, అతడు మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి జగన్ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బును వారికే తెలియకుండా మళ్లిస్తే ఎవరిపై కేసు పెట్టాలి. ఎవరిని నిందితులుగా చూడాలి. జగన్ చేసిన మోసాన్ని ఎన్నికల సమరంలో ప్రజాకోర్టులోనే తేలుద్దాం. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలున్నాయి. అలాగే పోలీసులకు సంబంధించి భారీగా రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్కో కానిస్టేబుల్ కు సుమారు రూ.1.50 లక్షలు మేర రావల్సి ఉంది. ఉద్యోగులకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ సక్రమంగా పనిచేయడం లేదు. హెల్త్ కార్డులు ఆస్పత్రులు తీసుకోని పరిస్థితి ఉంది. సకాలంలో పింఛన్లు అందవు… వేతనాలు రాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అన్ని సమస్యల మీద నాకు అవగాహన ఉంది. కూటమి ప్రభుత్వంలో వీటిపై దృష్టి పెడతాం.
• భవన నిర్మాణ కార్మికులకు నా వంతు సహాయం
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు. భవన నిర్మాణ కార్మికులు పేదవారే కదా..? మరి వారి డబ్బును మళ్లించి, పేదవాళ్లకు మంచి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. వచ్చే ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి డబ్బులను కేవలం వారికే చెందేలా చూస్తాను. దీనికోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. నేను 2019లో రెండు చోట్ల ఓడిపోయినపుడు మొదట భవన నిర్మాణ కార్మికుల సమస్య మీదనే గళం ఎత్తాను. ఆ రోజు వారిచ్చిన ధైర్యం నన్ను ముందకు నడిపింది. వారికి అండగా నిలిచి, వారి సంక్షేమ నిధికి నా వంతుగా రూ.కోటి సహాయం చేస్తాను. వారి ఇంట్లోని వాడిగా వారికి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను.
• మా జనసేన బాహుబలి మీకు చాలు
తాడేపల్లిగూడెంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా, ఏ కొత్త దుకాణం తెరవాలన్నా కే టాక్స్ ను వసూలు చేస్తున్నట్లు తెలిసింది. సైకిల్ షాపు దగ్గర నుంచి పెద్ద కాంప్లెక్స్ వరకు అందరూ ఈ ఎమ్మెల్యేకు భయపడి బతకాలా..? ఈ ఎమ్మెల్యే గతంలో టిక్కెట్ ఇప్పించాలని నన్ను కోరాడు. నేను ఇప్పించలేకపోయినందుకు కోపం పెంచుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. మెదడుకు కొవ్వు పట్టి ఏదేదో చెబుతున్నాడు. ఇలాంటి కొట్టు సత్యనారాయణకు మా జనసేన బాహుబలి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి లాంటి వ్యక్తి చాలు. కొట్టు గారి సంగతి మా బాహుబలి చూసుకుంటాడు. చిన్న ఇంటికి రూ.5 లక్షలు, పెద్ద ఇల్లు అయితే రూ.25 లక్షల వరకు కే టాక్స్ వసూలు చేస్తున్నారు. బంధువుల వద్ద కూడా లంచాలు తీసుకున్న చరిత్ర ఈ ఎమ్మెల్యేది. ఇలాంటి అవినీతి నాయకులను శ్రీ మోదీ గారి గ్యారెంటీతో సరైన సమాధానం చెబుతాం. ఎమ్మెల్యే అనుచరులు టీటీడీ టిక్కెట్లను బ్లాకులో అమ్ముకుంటున్నారు. శారదా లైబ్రరీ భూముల మీద కన్నేశాడు. ఆర్టీసీ బస్టాండు దగ్గర రూ.1.50 కోట్ల షాపింగ్ కాంప్లెక్సు కు టెండరు పెట్టాడు. నియోజకవర్గంలో ఏ లే అవుట్ వేసినా దానిలో కమీషన్ ఈ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిందే. లేకుంటే వేధింపులు, కేసులు, బెదిరింపులు తప్పడం లేదు. ఇలాంటి ఎమ్మెల్యేను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చేసింది. తాడేపల్లిగూడెంలో రవాణా రంగం మీద ఆధారపడిన వారు ఎక్కువ. వారు ఇటీవల గ్రీన్ టాక్సు సమస్యను నా వద్దకు తీసుకొచ్చారు. దానిపై కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను. అలాగే రవాణాకు కనెక్టవిటీ పెంచుతాం. మార్కెట్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఎయిర్ పోర్టు భూములకు రెగ్యులరైజ్ సమస్య ఉంది. దీన్న తీరుస్తాం. మిలట్రీ మాధవరం గ్రామస్థులు అడిగిన మిలటరీ క్యాంటీన్ ఏర్పాటుకు రక్షణ శాఖ అధికారులతో మాట్లాడుతాను. తాడేపల్లిగూడెంకు వచ్చిన ఎన్ఐటీకు అనుసంధానంగా ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ను తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. యువతకు స్కిల్ డవలప్మెంటు నేర్పించి, వారిని స్వయం ఉపాధిలో అత్యున్నతంగా తీర్చిదిద్దుతాం. బూతులు తిట్టుకునే అసెంబ్లీ ఉండదు. ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, తగిన పరిష్కారం చూపించే శాసనసభను కూటమి ప్రభుత్వంలో చూస్తారు. తప్పు జరిగితే ప్రజలే తిరగబడాలి. ఆ కోపం వారికే రావాలి. వైసీపీ వాళ్లు పెట్టి పుట్టలేదు అని గుర్తుంచుకోండి. వాళ్లదీ మనలాంటి రక్తమే. మానవ హక్కులకు భంగం వాటిల్లితే ప్రజల్లోనే మార్పు రావాలి. వారి నుంచే అసలైన పోరాటం మొదలు కావాలి. జనసేన పార్టీ నుంచి గెలిచే ప్రతి ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా ఉంటారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పాలన చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఎవరింట్లో కష్టం వచ్చినా అండగా నిలబడే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నా కష్టకాలంలో ఆయన నాకు వెన్నంటే నిలిచారు. అలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అండగా నిలబడాలి. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేయండి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్