ఆల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ మద్దతు కూటమికే

కూటమి

• మతం పేరుతో నమ్మించి నట్టేట ముంచిన పార్టీకి ఇకపై తాము సపోర్ట్ చేయమని తేల్చి చెప్పిన ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్
కాకినాడ జిల్లా చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గారి గృహంలో ఆల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ సభ్యులు నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే సందర్భంలో మతం పేరుతో మమ్మల్ని ప్రస్తుత ప్రభుత్వ పార్టీ నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్స్ అంటే కేవలం ఒక పార్టీకే ఓటు వేస్తారని అపోహలు కల్పించడం తగదన్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడిన తర్వాత ఆయన తమకు మద్దతుగా ఉంటారని తెలపడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. దానికి తగ్గట్టుగానే రాజానగరం సభలో క్రిస్టియన్స్ కి తాను అండగా ఉంటానని లక్షలాదిమంది ప్రజల మధ్యలో ప్రకటించడంతో తాము కృతజ్ఞతలు చెప్పడంతో పాటు మద్దతు కూడా తెలపడానికి వచ్చామన్నారు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, వ్యక్తిత్వం నచ్చి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు తమ మద్దతు కూటమికి ఉంటుందన్నారు. ఇప్పటికే తమ చర్చిల్లో అందరికీ కూటమికి సహకరించాలని తెలిపామని కూడా చెప్పుకొచ్చారు. ముందుగా నాగబాబుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు కడప నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిశుద్ధ బాబు, వైస్ ప్రెసిడెంట్ అడపా ప్రసాద్, సెక్రటరీ ముంగి యెహోషువ తదితర కార్యవర్గం పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్