జగ్గంపేట – హైలెట్స్

జగ్గంపేట
  • అరచేతుల్లో హారతులు వెలిగిస్తున్నారు.. జగన్ ప్రభుత్వం లాంటి నీచ ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి అదొక ధైర్య జ్యోతిలా కనిపిస్తుంది
  • ఎక్కడికి వెళ్ళినా అరటిపండు తొక్క అని మీ స్లొగన్స్ వినిపిస్తున్నాయి.. అంటే మీ భాషలోనే చెప్పాలి అంటే ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం
  • సాగు నీటి విషయంలో రైతులు కష్టపడుతున్నారు.. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా నడవట్లేదు.. ఏలేరు రిజర్వాయర్ నుండి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాలలో పదివేల ఎకరాలకు ఇవ్వాలని మల్లవరంజడ్ గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 132 కోట్లు అంచనావేసి రెండు సార్లు శంఖుస్థాపన చేసారు కానీ నిధులు ఇవ్వలేదు
  • పుష్కర ఎత్తిపోతలకు నిధులు ఇవ్వట్లేదు, దాని వల్ల ముప్పై వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి.. పోలవరం ఎడమకాలువ మట్టి ఇక్కడ వైసిపి నాయకులకి కాసులు కురిపిస్తోంది. కాలువ గట్లను సైతం కొట్టేసి మట్టిని తవ్వేస్తున్నారు..
  • 2014 – 2019 మధ్య 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగితే.. జగన్ ప్రభుత్వంలో 8 లక్షల విద్యార్ధుల కన్నా తక్కువ జరిగింది..
  • దళిత విద్యార్థులకి సంబంధించి 27 పథకాలు తీసేసాడు.
  • 2014-19 ప్రభుత్వంలో 4923 మంది విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్య పథకం ద్వారా విదేశాల్లో చదవడానికి వెళ్లగలిగితే, అదే పథకానికి జగన్ విదేశీ విద్య అని పేరు మార్చి 116 మందిని మాత్రమే విదేశాల్లో చదువుకునే అవకాశం కలిపించగలిగాడు జగన్
  • పేదలు ఇల్లు కట్టుకోవాలంటే, యువకులు వ్యాపారాలు పెట్టుకోవాలి అంటే పర్మిషన్లు ఉండవు కానీ వైసిపి నాయకులు మాత్రం ఎలాంటి పర్మిషన్లు లేకుండా లాడ్జ్ లు కట్టేసుకున్నారు
  • భవిష్యత్తులో కూడా యువత కోసం నా అంత కష్టపడే నాయకుడు లేడు అన్నట్టు అహర్నిశలు పని చేస్తాను.
  • భవన నిర్మాణ కార్మికుల కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేప్పుడు బైటకి రావొద్దు సార్ జనం లేరు అన్నారు.. పట్టుమని పది మంది గుండె బలంతో ఉన్న వాళ్ళు ఉంటే చాలు. పోరాటాన్ని నేను నడిపిస్తాను.. అలా వైజాగ్ సెంటర్ లో దిగగానే ముందు వెయ్యి మంది ఉన్నారు అన్నారు. అది పదివేలు, పాతిక వేలు, చూస్తుండగానే లక్ష లక్షన్నర అయిపోయారు.. అంటే జనసేన నిలబడితే ఎంతలా నమ్మకం పెట్టుకుంటారో ఓడిపోయిన ఆరునెలల్లో అర్థమయ్యేలా చేసారు
  • వకీల్ సాబ్ లో చెప్పింది కేవలం సినిమా డైలాగు కాదు.. వారు నా కోసం నిలబడ్డా నిలబడకపోయినా నేను వారి కోసం నిలబడతా.. ఆ మాట నా గుండె లోతుల్లో నుండి వచ్చింది.
  • ఇక్కడ కిర్లంపూడిలోని పెద్దలు అంటున్నారు సినిమా నటులకు ఏం తెలుసు అని..
    సినిమా నటులు మనుషులు కారా ?
    సినిమా నటులకు ప్రేమ ఉండదా ?
    సినిమా నటులకు సామాజిక బాధ్యత ఉండదా ?
  • ట్రాఫిక్ ఫైన్ లు వేసి 1000 కోట్లు పట్టుకురావాలని జగన్ టార్గెట్ ఇచ్చాడు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 ఇచ్చి వదిలేశాడు. ఒక్క రోడ్డు సరిగా ఉండదు. పైగా ట్రాఫిక్ ఫైన్ లు. అంటే మీ కష్టం నుండే మీకు 10,000 ఇస్తున్నాడు.
  • వైసిపి మద్దతు దారులకు చెప్తున్నాను.. ఈసారి కూడా మీరు గుడ్డిగా జగన్ కి ఓటేస్తే మీ ఆస్తులు కూడా అమ్మేస్తాడు..
  • పనిచేసే అవకాశాలను తీసేసాడు. అందరికీ గంజాయి అలవాటు చేసారు. ఇళ్ళల్లో దీపాలు ఆర్పేసాడు. కల్తీ మద్యపానంతో తాలిబొట్లు తెంపేసాడు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్