వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు

వైసీపీ

• రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా కూటమి ప్రభుత్వం రాబోతోందన్న సంకేతం వస్తోంది
• ఎర్రచందనాన్ని వైసీపీ నాయకులు ఇంధనంలా వాడుకుంటున్నారు
• ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారు
• ఎర్రచందనం మాఫియా డాన్ గంగిరెడ్డితో మిథున్ రెడ్డి కలిసి తిరుగుతున్నారు
• ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు
• జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డికి యువత భయపడాల్సిన అవసరం లేదు
• వాళ్ళు 8 అడుగులు లేరు… వాళ్లలో బ్లూ రక్తం ప్రవహించడం లేదు
• రైల్వేకోడూరు వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘కష్టాలు, త్యాగాలు, బలిదానాలు మనవి.. సంపద జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిదా..? వీళ్లకు దోపిడీ మీద ఉన్న ధ్యాస పాలన మీద లేదు. ఈ ఐదేళ్ల కాలంలో 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రం నుంచి అదృశ్యమైతే వీళ్లకు పట్టదు. రాయలసీమ ఏమైనా జగన్ గుత్తాధిపత్యమా..?’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఎర్రచందనాన్ని ఇంధనంలా వాడుకుంటున్నారని, అడ్డొచ్చినోళ్లను నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే… ప్రజలను బాధిస్తున్న ప్రతి ఒక్క వైసీపీ గూండాన్ని వీధుల్లోకి లాక్కొస్తామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం రైల్వే కోడూరులో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అరవ శ్రీధర్ గార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం పాపాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డొస్తున్నారని 40 మంది వరకు చంపేశారు. మరికొందరి కాళ్లు, చేతులు నరికేశారు. ఆస్పత్రిలో ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ గంగిరెడ్డిని 2015లో మారిషస్ లో అరెస్ట్ చేశారు. అతను అలిపిరి ఘటనలో నిందితుడు. వైసిపి వచ్చాక బయటకు వచ్చి ఇప్పుడు మిథున్ రెడ్డితో కలిసి తిరుగుతున్నాడు. రాజకీయపరంగా మా ప్రాంతానికి ఎవరిని రానివ్వమని మిథున్ రెడ్డి గొప్పగా చెబుతారు. అలాంటప్పుడు పిఠాపురంలో నీకు పనేంటి..? వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా మార్పు కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. నిజంగా యువత ధైర్యం చేసి రోడ్ల మీదకు వస్తే జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..? నేను వచ్చినప్పుడు బయటకు రావడం కాదు. తప్పు జరిగినప్పుడు బయటకు రావాలి. ధైర్యం లేని సమాజం కుళ్లిపోతుంది. రాయల వారు ఏలిన నేల ఇది. ఆ సీమ నుంచి వచ్చిన మీరు భయపడతానంటే ఎట్లా..? కూటమి మీకు అండగా ఉంటుంది. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. ఒకవైపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు, మరోవైపు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారు. తండ్రి చనిపోయిన రెండో రోజుకే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించిన వ్యక్తికా మీరు భయపడేది. వాళ్లు ఏమైనా 8 అడుగులు ఉన్నారా..? కొడితే దెబ్బ తగలదా..? ఆయనలో బ్లూ రక్తం ఏమైనా ప్రవహిస్తుందా..? రాయలసీమ తిండి మీరు తింటున్నారు. అదే షౌరుషం మీలోనూ ఉంది. జగన్ రెడ్డి, మిథున్ రెడ్డి, గంగిరెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారికి భయపడతారా..? మనం గొడవలకు దిగనక్కర్లేదు. కత్తులు, కర్రలు తీయనక్కర్లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి చాలు. వీరి అరాచకాలకు చరమగీతం పాడుదాం.
* ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తాం. సీపీఎస్ కు బలమైన పరిష్కారం చూపిస్తాం. జిల్లాలను అడ్డగోలుగా విభజించారు దానిని సరిచేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు తీసుకొస్తాం. వైసీపీ ప్రభుత్వం పోలీసు శ్రమను దోపిడీ చేసింది. కూటమి అధికారంలోకి రాగానే పోలీసులకు టీఏ, డీఏలు సకాలంలో ఇవ్వడంతో పాటు వారంతపు సెలవులు ఇస్తాం. ఒకటో తేదీనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. సమాజంలో ధైర్యం చచ్చిపోయింది. ఆడపడుచులే మగవారిలో ధైర్యం నింపాలి. అక్రమాలు, అన్యాయాలపై పోరాడేలా చేయాలి. ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది. ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది. బూతులు తిట్టే అసెంబ్లీ కాదు ఆరోగ్యకరంగా చర్చలు జరిగేలా చేస్తాం. కేంద్రంలో మోడీ గారు.. రాష్ట్రంలో మేమంతా మీకు సేవకుల్లా పనిచేస్తాం. శ్రీకాకుళం, విజయనగరం ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఒకటే సంకేతం వస్తోంది. కూటమి ప్రభుత్వం వస్తుంది… వైసీపీ అవినీతి కోటలను బద్ధలు కొడుతున్నాం. రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ కూటమి అభ్యర్థి శ్రీ అరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాలి. వారి మెజార్టీ ఎలా ఉండాలి అంటే ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడేలా ఉండాల”న్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్