రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి

వైసీపీ

• జగన్ ను ఓటు ఆయుధంతో అధ:పాతాళానికి తొక్కేయండి
• నిర్భయంగా ఓటేయండి.. మీ వెనుక నేనుంటాను
• పెద్దిరెడ్డి ఈ ప్రాంతాన్ని సామంతరాజులా రౌడీయిజంతో పాలిస్తున్నాడు
• సంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది
• పెద్దిరెడ్డి ప్రాంతంలోకి ఎవరు వెళ్లినా, ప్రశ్నించినా ప్రాణాలు తీస్తున్నారు
• కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు తగిన ప్రాధాన్యం
• కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ ప్రసాద్ ‘ స్కీం ద్వారా ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి
• రాజంపేట ప్రజాగళం సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘రాయలసీమలోని ఓ ప్రాంతంలో ప్రజలంతా ఉపాధి కోసం బయట ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తుంటే, ఇక్కడి డబ్బంతా ముగ్గురు దగ్గరే ఉండిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు వద్దనే అది ఉండిపోయింది. వాళ్లు ఈ ప్రాంతాన్ని సామంతుల్లా పాలిస్తూ దోపిడీలకు, దౌర్జాన్యాలకు, రౌడీయిజానికి కేరాఫ్ చేశారు. వీళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. కనీసం ఈ ప్రాంతంలోకి వచ్చినా దాడులు చేయిస్తార’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. స్థానికంగా ఉండే డ్యాంలు కొట్టుకుపోతుంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు లిక్కర్ మాఫియా నడిపిస్తున్నారు. రౌడీయిజం పెంచి పోషిస్తున్నారు.. సామాన్యులు వీళ్లను ప్రశ్నిస్తే కొట్టడాలు, చంపడాలు వరకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎస్.బాల సుబ్రహ్మణ్యం గార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “2022 నవంబరులో స్థానికంగా పడిన భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం నిండిపోతోందని ముందుగానే తెలిసినా, పై నుంచి హెచ్చరికలు ఉన్నా డ్యాంలోని నీరు కిందకు వదల్లేదు. దీనికి ప్రధాన కారణం వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ. ఇసుకను వాహనాల్లో ఎత్తిపోసుకోవడానికి డ్యాం నుంచి సకాలంలో గేట్లు తెరవలేదు. ఫలితంగా 39 మంది ప్రాణాలు పోయాయి. 9 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. 3 వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వందలాది ఎకరాలు నాశనం అయ్యాయి. డ్యాం తెగిపడే విషయం అర్ధమై డ్యాం లష్కర్ శ్రీ రామయ్య గారు తాను చేయాల్సిన సాయం చేసి, అందరికీ ఫోన్లు చేసి చెప్పడంతో ఎన్నో ప్రాణాలను ఆయన కాపాడగలిగారు. అలాంటి గొప్ప పని చేసిన శ్రీ రామయ్య గారిని జనసేన పార్టీ తరఫున తగిన సాయం చేసి, గౌరవించుకున్నాం. అయితే నాయకుల ఇసుక దోపిడీని మాత్రం మరిచిపోలేం. అంతమందిని పొట్టపెట్టుకున్న వీరి ఇసుక దాహానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలి.
• పెద్దిరెడ్డి ఈ ప్రాంతాన్ని రౌడీయిజానికి అడ్డా చేశారు
పెద్దిరెడ్డి ఇక్కడ స్థానిక యువతకు ఉపాధిని దూరం చేశాడు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చింది లేదు. పైగా అమర్ రాజా లాంటి పరిశ్రమను వెళ్లగొట్టారు. ఈ ప్రాంతం ఆయన జాగీరులాగా వ్యవహరిస్తున్నారు. సభ పెట్టుకోవడానికి అంగళ్లు వచ్చిన శ్రీ చంద్రబాబు గారి మీద దాడి చేయించి, తిరిగి 5 కేసులు పెట్టించాడు. పుంగనూరులో అడ్డగోలుగా పంచాయతీలను భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టిప్పర్ల మీద వీళ్ల పేరుంటే ఎవరూ ఆపడానికి లేదు. పులిచర్లలో ఓ సగటు మనిషి ప్రశ్నిస్తే అతడి రెండు చేతులు విరగ్గొట్టారు. మరో చోట దందా ఏంటని అడిగితే రెండు కాళ్ల నరికేశారు. ఏంటి వీళ్ల అరాచకం.. అసలు ఎందుకీ రౌడీయిజం. ఇలాంటి నాయకులను ఇంటికి పంపాలా లేదా..? మనం భయపడుతూ ఎంత కాలం బతకాలి..? వీళ్లకు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్దిచెప్పే సమయం వచ్చేసింది. కూటమి ప్రభుత్వం వస్తేనే శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. సగటు మనిషికి రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడి యువత కోపం, కసి మనల్ని ఎవడైతే బాధ పెడుతున్నాడో వాళ్లమీద చూపించాలి.
• ఆయన ప్రాంతానికి అమూల్ రాదు.. శ్రీజ డెయిరీని నాశనం చేశారు
రూ.10 వేల కోట్ల జీఎస్టీని ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యక్తి పెద్దిరెడ్డి… అతడి గుంపు. ఈ ప్రాంతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫాక్షనిజం, రౌడీయిజం తీసుకొచ్చారు. ఈ రౌడీయిజం పోవాలి అంటే కూటమి రావాలి. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి. ఎన్నో వేల మందికి ఉపాధి చూపించే హెరిటేజ్ ను తీసేస్తానని చెప్పిన జగన్ అమూల్ ను తీసుకొచ్చాడు. రాష్ట్రమంతా అమలయ్యే అమూల్ పాలు పెద్దరెడ్డి ఇలాకాలో కనిపించవు. తన శివశక్తి డెయిరీ కోసం అమూల్ ఉండదు. గతంలో ఈ ప్రాంతంలో మహిళలతో నడిచే శ్రీజ డెయిరీ 5 వేల లీటర్ల పాలు సేకరించేది. దాన్ని రాకుండా చేశారు. శ్రీజ డెయిరీను ఈ ప్రాంతంలో నాశనం చేశారు. వీళ్ల జోలికి ఎవరు వచ్చినా వాళ్లని నాశనం చేసే ఆలోచన వీళ్లది. ఎంతకాలం వీరి దాష్టికాలను భరిస్తాం. అసలు ఈ ముఖ్యమంత్రికి క్లాస్ వార్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
• ప్రసాద్ స్కీంతో ఈ ప్రాంత అభివృద్ధి
ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీ గొంతునవుతా. అన్నమాచార్య, కన్నప్ప వంటి మహానుభావులు తిరిగిన నేల ఇది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. సోమశిల బ్యాక్ వాటర్ ను పర్యాటక ప్రాంతంగా, బౌద్దరామాలు, సిద్దవటం కోట, ఒంటిమిట్ట క్షేత్రం, నందలూరు సోమనాథ ఆలయం వంటి అన్ని ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘‘ప్రసాద్’’ స్కీం ద్వారా ఈ ప్రాంతాలను కలిపి అద్భుత ప్రాంతాలుగా చేయవచ్చు. దీన్ని ఈ ప్రాంతానికి తీసుకు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. ప్రజల భవిష్యత్తు కోసం దశాబ్దంగా పోరాటం చేస్తున్నా. నాకు ఇదేమీ సులభంగా రాలేదు. కష్టపడ్డాను. రాయలసీమలో కూడా వైసీపీని నేలకొరిగేలా చేస్తాం. మీరు ఎవరికీ, దేనికి భయపడకండి. మీరు నిర్భయంగా ఓటేయండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకుంటా. జగన్ ను మీరు వేసే ఓటు ద్వారా అధ:పాతాళానికి తొక్కిపడేయండి. కూటమి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. రాజంపేట ఎంపీగా శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల సుబ్రమణ్యం గారికి ఓటు వేయండి’’ అని కోరారు. ఈ సభలో జనసేన పార్టీ నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ అతికారి దినేష్, శ్రీ శ్రీనివాస రాజు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్