గెలుస్తున్నాం.. అభివృద్ధి చేసి చూపుతాం

అభివృద్ధి

• తెనాలి వారాహి విజయభేరి సభలో శ్రీ నాదెండ్ల మనోహర్
      జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, తెనాలి శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలిలో జరిగిన వారాహి విజయభేరి సభలో మాట్లాడుతూ.. “ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించబోతోంది. తెనాలిని అభివృద్ధి చేసి చూపించబోతున్నాం. గతంలో చేశాం. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తాం. ఓట్ల కోసం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ప్రజల కోసం నిలబడాలి అభివృద్ధి చేయాలి. ఆరు నెలల క్రితం తెనాలి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మార్కెట్ వద్ద కొత్త భవనం నిర్మిస్తామన్నారు. షాదీ ఖానా నిర్మిస్తామన్నారు. కొల్లిపరలో రూ. 5 కోట్లతో మార్కెట్ యార్డు నిర్మిస్తామన్నారు. ఈ సీఎం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనా? గతంలో శాసనసభ్యుడిగా నేను తెనాలి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే తెనాలి నుంచి జాతీయ రహదారికి నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తాం. ముస్లిం యువతకు స్కిల్ డెవలప్ చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. షాదీ ఖానాలు నిర్మిస్తాం. ఎస్సీ సొదరులకు శ్మశానవాటికలు నిర్మిస్తాం. పాదయాత్రలో బీసీ సోదరుల కోరిక మేరకు కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం. తెనాలిలో గంజాయి ఎన్నడూ లేని విధంగా భయంకరంగా విస్తరించింది. లా అండ్ ఆర్డర్ లేకుండా పాలక పక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వంలోకి వచ్చిన వారం రోజుల్లో తెనాలిలో గంజాయి కనబడకుండా చేస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన రాజకీయాలకు నిలబడ్డారు. ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయండి. మన భవిష్యత్తు కోసం మన ఓటు వేయండి’’ అని అన్నారు.
• అవినీతికి తావు లేకుండా పని చేస్తాను: డా.పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి
          గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కూటమి తరఫున టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా.పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ “ప్రజల కోసం తన సొంత సంపాదనను ధారపోసిన నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు. ఆయన సాక్షిగా చెబుతున్నాను.. అవినీతికి తావు లేకుండా ప్రజల కోసం పని చేస్తాను. వైసీపీ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. కచ్చితంగా కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్