శ్రీ చిరంజీవి ప్రోత్సాహంతో జనసేన బలం రెట్టింపయింది

చిరంజీవి

• మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో శ్రీ కె.నాగబాబు
       ఎవరెస్ట్ శిఖరం లాంటి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించడం చాలా సంతోషకరమైన అంశమని, ఇంతవరకు శ్రీ చిరంజీవి గారి మద్దతు జనసేనకు లేదనే వాళ్ళ నోర్లు ఇప్పుడు మూత పడ్డాయని, శ్రీ చిరంజీవి గారి ఆశీస్సులు జనసేనకు ఎల్లప్పుడూ ఉంటాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు, జిల్లా అధ్యక్షులు శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ (కత్తిపూడి బాబీ) ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురంలో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో శ్రీ కె. నాగబాబు గారు ముఖ్య అతిథిగా, రాష్ట్ర అధ్యక్షులు పీ. భవానీ కుమార్, జనసేన స్టార్ కాంపైనర్ శ్రీ సాగర్ (అర్.కే.నాయుడు), ఉపాధ్యక్షులు శ్రీ ఏడిద శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. మెగా అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, రాజకీయ కార్యక్రమాల పట్ల కూడా చురుకైన పాత్ర పోషించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మెగా అభిమానులు అంతా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన అంతం కావాలంటే అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. శ్రీ చిరంజీవి గారి మద్దతు ద్వారా జనసేనకు బలం రెట్టింపైందని తద్వారా మెగా అభిమానులు అందరికీ బాధ్యత పెరిగిందని పునరుద్ఘాటించారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని గెలిపించాలి: శ్రీ సాగర్ (అర్.కే.నాయుడు), జనసేన స్టార్ కాంపైనర్
             తమ వ్యక్తిగత సంపాదన దాచుకోకుండా కుల, మత, ప్రాంతీయ ఆలోచనలు కూడా లేకుండా సమాజం పట్ల బాధ్యతతో ఎంతో మందికి ఉపయోగ పడేలా సేవ చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దాతృత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని జనసేన స్టార్ కాంపైనర్ శ్రీ సాగర్ (అర్.కే.నాయుడు) అన్నారు. ఒక వ్యక్తిగా ఇంత చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థకు ప్రతినిధిగా ఉంటే ఇంకెంత చేయగలరనేది ఆలోచించాలని అన్నారు. మెగా కుటుంబం మన్ననలు లభించడం తమ అదృష్టమని జనసేన కుటుంబ సభ్యుడిగా జనసేన గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు ఎల్. శ్యామ్ ప్రసాద్, కె. కృష్ణప్రసాద్, రవికుమార్, చంద్రశేఖర్ రెడ్డి, బైరు వెంకన్న గౌడ్, వీ. రమేష్ నాయుడు, కోపల్లి శ్రీనివాస్, జీ. కొండల్ రావు, జనసేన నాయకులు శ్రీ శరత్, శ్రీ కూసంపూడి శ్రీనివాస్, శ్రీ తుమ్మలపల్లి సాయి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్