• చేతి వృత్తిదారుల చేతుల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది
• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
చేనేత, కల్లు గీత, నాయి బ్రాహ్మణ, మత్స్యకార, యాదవ, రజక తదితర చేతివృత్తి దారులైన బీసీ కులాలను వైసీపీ ప్రభుత్వం అణగదొక్కుతోందని, చేతి వృత్తి దారుల శ్రమను దోచుకుంటున్న వైసీపీ చేతి వృత్తి దారుల చేతుల్లోనే చిత్తుగా ఓడిపోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురంలో బుధవారం శ్రీ నాగబాబు గారిని కలిసిన వీవర్స్ ఫెడరేషన్ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థితి గతులు చూస్తుంటే 2019కు ముందు ఉన్న పరిస్థితి చాలా ఉత్తమం అనిపిస్తోందని అన్నారు. అగ్గి పెట్టెలో పట్టేటంత చీరను తయారు చేసి కింగ్ జార్జ్ కు కానుక ఇచ్చిన ఘనత సాధించిన చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అడ్డుకట్ట వేసి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయల కార్మికుల శ్రమను వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని చెప్పారు.
• 40 లక్షల మందిలో 3.5 లక్షల మందికి మాత్రమే నేతన్న నేస్తం ఇస్తున్నారు: వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు
రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు ఉంటే అందులో 3.5 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం అమలు చేస్తున్నారని వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు శ్రీ నాగబాబు గారికి తెలియజేశారు. పవర్ లూమ్ వ్యవస్థకు మద్దతుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, చేనేత కార్మికుల కోసం చేసిన చట్టాలు అమలు కావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాల తయారీ ద్వారా రావాల్సిన సబ్సిడీ కూడా తమకు దక్కట్లేదని, ప్రభుత్వమే దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తోందని చెప్పారు. రానున్న జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని శ్రీ నాగబాబు గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి శ్రీ శరత్ గారు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శ్రీ పప్పు దుర్గా రమేష్, కర్ణ భక్త సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విశ్వనాథం సత్య పరదేశి, పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు శ్రీ కోమాకుల సత్యనారాయణ, కరికాల భక్త సంక్షేమ సంఘం నాయకులు శ్రీ జలదాని బాబి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నాయకులు శ్రీ ఇసుకపల్లి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం యువసేన నాయకులు శ్రీ జక్కిలింకి రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులు శ్రీ కొల్లి శివ నాగేశ్వరావు, పద్మశాలి సంఘం నాయకులు శ్రీ తంగెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.