వైసీపీ ఓడిపోవాలని వైసీపీ వాళ్ళే అనుకుంటున్నారు

వైసీపీ

• కాకినాడ పార్లమెంట్ కమిటీ సభ్యులతో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు

అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని వైసీపీ వాళ్ళే అనుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు వ్యాఖ్యానించారు. నేను అవినీతిపరుడినే.. కానీ అంత ఎక్కువ అవినీతి పరుడిని కాదు అని వైసీపీ అవినీతి నాయకులు అవినీతిలో కూడా గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. కాకినాడ లోక్ సభ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నేతృత్వంలో కాకినాడ పార్లమెంట్ కమిటీ సభ్యులు శనివారం పిఠాపురంలో శ్రీ నాగబాబు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. ప్రకృతి విధ్వంసం చేయొద్దని అడ్డు పడిన జర్నలిస్టులను ఇసుక లారీలు కింద పడేసి తొక్కి చంపాలన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లాంటి వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. నీతి, నిజాయతీ, ధర్మం, త్యాగంతో ప్రజా ప్రయోజనకరమైన సిద్ధాంతాలతో పని చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అకారణంగా నోరు పారేసుకున్న దుర్మార్గుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అని దుయ్యబట్టారు. మైనింగ్ మాఫియాతో కాంట్రాక్టర్ల వద్ద వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న చలమలశెట్టి సునీల్ లాంటి వ్యక్తుల కంటే సొంత వ్యాపారాలతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లాంటి వారిని గెలిపించుకుంటే కాకినాడ అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు శ్రీ వేములపాటి అజయ్ కుమార్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా నాయకులు శ్రీ తోట సుధీర్, శ్రీ మల్లాడి రాజేంద్ర, శ్రీ బడే కృష్ణ, శ్రీ అట్ల సత్యనారాయణ, శ్రీమతి దారపు శిరీష, శ్రీమతి మిరియాల హైమావతి, వివిధ మండలాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్