పిఠాపురంలో అఖండ మెజారిటీతో గెలవబోతున్నాం

పిఠాపురం

• శ్రీ పవన్ కళ్యాణ్ పాలనలో ప్రతీ కార్యకర్తకు భాగస్వామ్యం ఉంటుంది
• స్థానిక నేతలతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని, ప్రతీ కార్యకర్తకు గౌరవప్రదమైన స్థానం లభిస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురంలో శనివారం శ్రీ నాగబాబు గారిని కలిసిన స్థానిక నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు దగ్గర కార్యకర్తగా పని చేయడానికి ఒక్క రోజు అవకాశం దక్కినా దానికి మించిన సంతృప్తి ఉండదని, అలాంటిది ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో మమేకమై పని చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి, జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రొ.కె.శరత్ కుమార్, శ్రీ కొలికొండ శశిధర్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
• జనసేనతో కలసి నడిచేందుకు…
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో జనసేనతో కలిసి పని చేయడానికి వివిధ వర్గాల ప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. శ్రీ నాగబాబు గారిని కలిసి తమ సుముఖత తెలుపుతున్నారు. వారికి తగిన బాధ్యతలను అప్పగిస్తున్నారు.
• బీజేపీ నేతలతో భేటీ
భారత దేశ భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం భరోసా ఇస్తోందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. బీజేపీ పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్ ఆధ్వర్యంలో పిఠాపురంలోని బీజేపీ ముఖ్య నాయకులు శనివారం శ్రీ నాగబాబు గారిని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆ నేతలకు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ శ్రేణులు క్రమశిక్షణకు మారుపేరుగా దేశం పట్ల అంకితభావంతో పని చేస్తారని అన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతీ స్థానంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ ఉండడం శుభ పరిణామం అని తెలిపారు. పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగా జనసేన పరిపాలనలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల భాగస్వామ్యం కూడా ఉంటుందని వివరించారు.
• అనకాపల్లి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తా
అనకాపల్లి లోక్ సభకు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత శ్రీ సీ.ఎం. రమేష్ గెలుపు కోసం తానూ ప్రచారం చేస్తానని శ్రీ నాగబాబు గారు వెల్లడించారు. నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు అనకాపల్లి లోక్ సభ సీటును భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానంతో సంతోషంగా త్యాగం చేసినట్లు చెప్పారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పట్ల గౌరవంతో అనకాపల్లిలో బిజేపి అభ్యర్థికి అఖండ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలని ఇప్పటికే జనసేన నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేశామని తెలిపారు. త్వరలో తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. బీజేపీ నాయకులు శ్రీ దాట్ల రాజు, శ్రీ గండి కొండల రావు, శ్రీ బుర్రె మురళి, శ్రీ తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్