• కండువాలు కప్పి ఆహ్వానించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో చేరికలు ముమ్మరమయ్యాయి. యు. కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాలలోని వివిధ గ్రామాల నుంచి, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల నుంచీ 225 మందికి పైగా ప్రముఖులు, వైసీపీ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలన అంతం అవ్వడానికి పిఠాపురం వేదిక అయిందని, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా కదిలి రావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రొ.కె.శరత్ కుమార్, శ్రీ కొలికొండ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.