ఎన్నికల ప్రచార కరపత్రం ఆవిష్కరణ

కరపత్రం

పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం నిమిత్తం టిడిపి ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారి ఆధ్వర్యంలో టిడిపి రూపొందించిన కరపత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనే అంశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతో చెప్పిన హామీలను ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ప్రాంతం. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తాం. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇరిగేషన్ సంబంధిత అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకొని, ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను. టిడిపి ఇంఛార్జి శ్రీ వర్మ గారి అనుభవం ఈ ఎన్నికలకి ఎంతో దోహదం చేస్తుంది. ఇంటింటి ప్రచారం కోసం ఆయన ప్లాన్ చేశారు. సమన్వయంతో ముందుకు వెళ్తాం” అన్నారు.శ్రీ వర్మ గారు మాట్లాడుతూ… “పిఠాపురం నియోజకవర్గం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పిన హామీలు, మా కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి చెబుతాం. రేపటి నుంచే ఇంటింట ప్రచారం మొదలుపెడతాం. అన్ని మండలాల్లో తిరిగేందుకు ప్లాన్ చేశాము” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్