మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ఇంఛార్జులు, సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మచిలీపట్నంలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం నేతల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసింది. స్థానిక పరిస్థితులను వివరించారు. టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ కొనకళ్ల నారాయణ, మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్దప్రసాద్, మాజీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు శ్రీ బొడే ప్రసాద్, శ్రీ కమ్మలి విఠల్ రావు, శ్రీ బూరగడ్డ వేదవ్యాస్, శ్రీ కాగిత కృష్ణప్రసాద్, శ్రీ వర్ల కుమార్ రాజా, శ్రీ యార్లగడ్డ వెంకట్రావు, శ్రీ రావి వేంకటేశ్వర రావు, శ్రీ కొనకళ్ల జగన్నాథరావు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.