27వ రోజు ( హైలెట్స్ ) – గాజువాక బహిరంగ సభ

గాజువాక
  • అఖండ స్వాగతం పలికిన గాజువాక ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఓడిపోయిన నాకు ఓటమి తెలియడం లేదు, అంతటి ఘనస్వాగతం, ప్రేమ నేను ఊహించలేదు, గీతా సారాంశం నేను పాటిస్తాను, పనిచేస్తూ వేళ్ళు, ప్రతిఫలం ఆశించవద్దు అని, నేను అదే చేస్తున్నాను
  • ఒక ఆశయంతో వచ్చాను, దోపిడీ చేస్తాడు అని తెలిసి కూడా వైయస్ జగన్ కు గెలుపు ఇచ్చి, నాకు ఓటమి ఇచ్చింది విధి, ఓడిపోయిన తరవాత ఎలా అని ఆలోచించిన నాకు, మళ్ళీ నెల గడిచే సరికి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిన ఈ వైసీపీపార్టీ ప్రభుత్వం
  • భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో సభ అంటే భయపడ్డాను, ఓడిపోయిన నన్ను ఎలా నాకు అండగా నిలబడతారు అని, కానీ ఊహించని విధంగా 2 లక్షల పైగా జనం వచ్చి, ఆశయంతో ఉన్న వాడికి గెలుపు, ఓటములు అతీతం అని నిరూపించి నిలబడ్డారు ఇక్కడి ప్రజలు
  • 2024 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాక లో ఎగురుతుంది
  • గాజువాక నా నియోజకవర్గం, ఇది మన ప్రాంతం
  • ఇక్కడకు రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం గుర్తుకు వస్తుంది, దారిపొడవునా ఇదే నినాదం వినిపించింది. స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు 30మంది ప్రాణత్యాగాలు చేసి సాధించారు. ఇది విశాఖకు కాదు రాష్ట్రానికి గుండె లాంటిది
  • విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు
  • విశాఖ స్టీల్ ప్లాంట్, అగనంపూడి ప్రాంత కౌష్యం, గంగవరం పోర్టు, మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఎప్పటినుండో ఉన్నాయి
  • విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇప్పటికీ సరైన పరిహారం ఇవ్వలేదు
  • 2019 లో మా పార్టీ నాయకుడిని MP గా గెలిపించాల్సింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకునే వాళ్ళం. రాజకీయాల్లో ఓటమి తీసుకోలేని వ్యక్తులు రాజకీయాల్లోకి రాకండి, ఒక్క ఓటమికి భయపడి పోయేవారు రాజకీయాల్లోకి దయచేసి రావద్దు
  • విశాఖ ఎంపీ గ మీరు గెలిపించిన MVV సత్యనారాయణ ఒక రౌడీ షీటర్, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే, కనీసం పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేక పోయాడు, ప్రధాని గారిని కలిసి ఎందుకు అడగలేదు అని ప్రశ్నించాలి
  • నేను అమిత్ షా గారి కార్యాలయానికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దు, సొంత గనులు కేటాయించండి అని అడిగాను, వైసీపీపార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేక పోతున్నారు
  • వైసీపీ ఎంపీలు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు
  • ఇక్కడకు వచ్చిన వారి పిల్లలు 2047 వచ్చేటప్పటికి 25 యేళ్లు నిండుతాయి, అప్పుడు వారి భవిష్యత్తుకు భరోసా ఇక్కడ? ఇలాంటి వైసీపీపార్టీ గూండాలు పాలిస్తే భవిష్యత్తు ఉంటుందా
  • కేసులు ఉన్నవారికి, గూండాలకు, దోపిడీదారులకు ప్రధాని గారిని అడిగే దమ్ము లేదు
  • జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకుల కాళ్ళ మీద పడితే, అడుక్కుంటే అప్పుడు కేంద్రం మొన్న 10 వేల కోట్లు ఇచ్చింది, హక్కులను దైర్యంగా అడగలేని నాయకులు
  • నిజంగా నిజాయితీపరులు, ఏ అక్రమ మైనింగ్ చెయ్యని 30మంది ఎంపీలు ఉంటే ఎందుకు అడగలేరు? వైసీపీపార్టీ నాయకులు దోపిడీదారులు, పాలసీలపై అవగాహన లేని వ్యక్తులు అని కేంద్రం భావిస్తుంది. ఇదే సమయంలో ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల వారి హక్కులు సాడించుకుంటున్నాయి కదా అనే విషయం ప్రజలు ఆలోచించాలి
  • ఈరోజు ప్రజలు రోడ్డు మీదకు వచ్చిన అంశాన్ని ప్రధాని, హోంశాఖ మంత్రి పరిగణలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను మాట్లాడుతాను
  • మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడితే కేంద్ర నాయకులు చెప్పారు, నష్టాల్లో ఉంది, మీరు అడిగితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కంపెనీని ప్రైవేటీకరణ చెయ్యకుండా ఆపాము అన్నారు, నేను చెప్పను సొంత గనులు కేటాయించండి ఖచ్చితంగా లాభాల్లోకి వెళుతుంది అని చెప్పాను, కానీ MP లు లేరు నా దగ్గర, ఉంటే అడిగేవాడిని, ఇప్పుడు అడిగేవారు లేరు
  • ఈ ఒక్క ఎన్నిక డబ్బు లేకుండా మాకు అండగా ఉండండి ఖచ్చితంగా మీకోసం నిలబడతాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
  • సేలం స్టీల్ ప్లాంట్ అంశంపై అన్ని పార్టీలు కలిసి పోరాడి ప్రైవేటీకరణ అడ్డుకున్నాయి, ఇక్కడ కూడా మనం అందరం కలిసి పోరాటం చెయ్యాలి
  • ఒక రౌడీ షీటర్ ను ఎంపీ గా గెలిపిస్తే వెళ్లి క్రిష్టియన్ భూములు దోచుకుంటున్నారు
  • గంగవరం పోర్టు 2 మత్స్యకార గ్రామాలను ధ్వంసం చేసి, ఒక మత్స్యకారుడిని మీ నాన్న హయాంలో తూటాలతో చంపి కట్టారు జగన్ వైయస్ జగన్ 
  • దారిలో వైఎస్ విగ్రహం చూస్తే మత్స్యకారుడిని కాల్చి చంపించిన వ్యక్తి విగ్రహంగా అనిపించింది
  • గంగవరం పోర్టు లో దేశ రక్షణ దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడి పెడితే దానినింకూడ వైయస్ జగన్ ప్రభుత్వం అమ్ముకుంది. నిన్ను ఎన్నుకుంది ప్రజల ఆస్తులు అమ్ముకోవడానికా
  • మత్స్యకారుల బలిదానాలపై గంగవరం పోర్ట్ కట్టారు
  • గంగవరం పోర్టు బాధితులకు న్యాయం చేయలేని నువ్వు, రాజధాని విశాఖకు మార్చి ఏం చేస్తావ్ నువ్వు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు వైయస్ జగన్
  • స్వార్దం లేకుండా ప్రజల కోసం మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీ గారు, హోమ్ మంత్రి అమిత్ షా గారు వింటారు, కానీ చెప్పేవారు లేరు, అందుకే ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వండి
  • గంగవరం పోర్టు లాభాల్లో ఉంది, మరి ఎందుకు కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు?
  • AP డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చుకుంటున్నాడు
  • Don’t shout into your argument
    మీరు అరిచేస్తే భయపడను, మీరు తిడితే వెనక్కి వెళ్ళను, నేను మొండి మనిషిని జగన్, ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను
  • పోలవరం పూర్తి చేయలేరు, సుజల స్రవంతి తీసుకురాలేరు, పోలవరం ATM మెషిన్ లా మారింది అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ సెఖావత్ గారు చెప్పారు
  • జగన్ తన 300 కోట్ల విలువైన ఆస్తులు కాపాడుకోవడం కోసం, లక్ష కోట్ల విలువైన ప్రజల ఆస్తులను వదిలేసి తెలంగాణ నుండి వచ్చాడు జగన్
  • దసపల్లా, సిరిపురం, CNBC భూములు కబ్జా చేసేశారు, మా నాయకులు కార్పొరేటర్ మూర్తియదవ్ పోరాటం చేసి కొంతమేర కాపాడారు
  • నేను పూర్తిగా మంగళగిరికి షిఫ్ట్ అయ్యాను, విశాఖను నా రెండో ఇల్లుగా మార్చుకుంటాను, మీకు అండగా ఉంటాను
  • పోలీస్ శాఖ అధికారులు ప్రభుత్వ ఒత్తిడి వలన కొన్నిసార్లు మనపై ఒత్తిడి పెడతారు, నేను అర్దం చేసుకుంటాను వారి ఇబ్బందులు, వారికి కనీసం TA, DA కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు, వారి సమస్యలు, హోంగార్డు సమస్యలు నాకు తెలుసు. పోలీస్ వారికి రోజంతా ఒత్తిడి ఉంటుంది, కనీసం వారాంతపు సెలవు కూడా ఇవ్వడం లేదు
  • జనసేన ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను బలోపేతం చేస్తాం
  • పెందుర్తి లో వాలంటీర్ చేసిన దారుణం చూసారు. నేను వాలంటీర్ వ్యవస్థ లోపాలపై మాట్లాడితే అందరూ తిట్టని తిట్లు తిట్టారు, మరి ఈ హత్యకు భాధ్యత ఎవరు తీసుకుంటారు
  • వాలంటీర్స్ హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి జగనా? MLA నా? చీఫ్ సెక్రటరీ నా అనే దానికి ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు వైసీపీపార్టీ ప్రభుత్వం
  • విశాఖ లో ఎంతమంది యువతకు IT ఉద్యోగాలు వచ్చాయి? ఇక్కడ ఎందుకు IT కంపెనీలు లేవు? మళ్ళీ హైదరాబాద్ వలస వెళ్ళాలా? అక్కడి వారి యువత పొట్ట కొట్టాలా అని యువత అడుగుతుంది
  • జనసేన ప్రభుత్వం అధికారం లోకి వేస్తే విశాఖలో IT ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం. 3 ఏళ్లలో IT రంగాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నాను
  • వివేకానంద రెడ్డి ని చంపేసి ఆ కేసు మా మీదకు, మా కుటుంబ సభ్యుల మీదకు రాకూడదు అని కాళ్ళు పట్టుకుంటే ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతారు ఈ వైయస్ జగన్
  • నువ్వు క్రిమినల్ జగన్
  • కొండ మీద దేవుడు ఉంటాడు, క్రిమినల్ ఉండటానికి మేము ఒప్పుకోము, జగన్ లాంటి క్రిమినల్ వ్యక్తి రుషికొండ మీద కూర్చోడానికి ఒప్పుకోను
  • ఈ దేశానికి నిజాయితీపరుడు అయిన వ్యక్తులు కావాలి. వేల కోట్లు ఉన్న వైయస్ జగన్ ఏ ఆస్తి లేని ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర మోకరిల్లి కూర్చుంటాడు. ఒక అసమర్థుడు, క్రిమినల్ ను ఎన్నుకుంటే ఇలానే ఉంటుంది, ఉద్యోగాలు, పరిశ్రమల గురించి ఎలా మాట్లాడుతాడు
  • 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారి డేటా జనసేన బయటకు తీసుకొచ్చింది, ప్రభుత్వం పట్టించుకోకపోతే వారికి కోట్ల రూపాయలు ఇచ్చాం
  • ఆఖరికి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ సాయం లో కూడా లంచాలు అడిగి శవాల మీద పేలాలు ఏరుకునే స్థితికి వెళ్లారు వైసీపీపార్టీ నాయకులు
  • 13,372 మంది సర్పంచులకు నా మాట
    పార్టీలకు అతీతంగా మీరు స్థానిక సమస్యలు, కాలుష్యం, అభివృద్ది కోసం నిలబడండి, మీకు నిధులు వచ్చేలా కేంద్రంతో మాట్లాడుతాను
  • ఆంధ్రా యూనివర్సిటీ 600 పై ఎకరాలలో ఉంది, విశాఖ కాలుష్యం నుండి రక్షించే ఊపిరితిత్తులు. అలాంటిది అక్కడ చెట్లు కొట్టించేస్తున్నాడు VC
  • ఆంధ్రా యూనివర్సిటీ VC పై పిర్యాదులు వచ్చాయి. సిబ్బంది నుండి శ్రమదోపిడి చేస్తున్నాడు, వైసీపీపార్టీ మద్దతుదారు ఈ VC
  • జగన్  రుషికొండ లో నువ్వు చేస్తున్నది వోల్టా యాక్ట్ ను ఉల్లంఘన.
  • సిరిపురం జంక్షన్ వద్ద రౌడీ షీటర్ MP క్రిష్టియన్ భూములు ఆక్రమించుకున్నాడు. 4 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 26 అంతస్థులు కడుతున్నారు.
  •  MP MVV కడుతున్న అక్రమ కట్టడంలో దయచేసి ఎవరూ ఫ్లాట్స్ కొనకండి, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం రాగానే కూల్చేస్తాం
  • MVV గుర్గావ్ లో నీ 36 అంతస్థుల బిల్డింగ్ కూల్చేసిన విషయం గుర్తు ఉంచుకో. విశాఖలో దయచేసి MVV అక్రమ కట్టడాలలో పెట్టుబడి పెట్టకండి, వాటిని కూల్చేస్తాం
  • ఎక్కడైనా ఆస్తి డెవలప్ చేస్తే 30% ఓనర్ కు, 70 శాతం బిల్డర్ కు వెళుతుంది. కానీ ఈ MP MVV సత్యనారాయణ కూర్మనపాలెంలో బెదిరించి 99% బిల్డర్ కు, 0.96% ఓనర్ కు ఇచ్చి దోపిడీ చేశాడు
  • ఈ MP కుటుంబ సభ్యులను, ఆడిటర్ ను ఇంట్లో కిడ్నాప్ చేసి రౌడీ షీటర్ బెదిరిస్తే ఏం చేయలేకపోయాడు. ప్రభుత్వానికి, పోలీసులకు తెలియకుండా జరిగిందా? ఇక్కడ వ్యాపారం చేయలేను, హైదరాబాద్ వెళ్తా అంటాడు, అలాంటప్పుడు ఇకక్డ ఎందుకు నువ్వు MP గా జగన్ ప్రజలు వస్తున్నారు, సింహాసనం ఖాళీ చెయ్, వెళ్లి పులివెందుల ఎస్టేట్ లో కూర్చో
  • నేను సినిమాలు ఆపడానికి సిద్దంగా ఉన్నాను, కానీ నాకు వేరే సంపాదన లేదు, అందుకని కొద్దిపాటి సమయం సినిమాలు చేస్తున్నాను, ఆ సంపాదనతో, కొంతమంది ఇచ్చిన విరాళాలతో పార్టీ నడుపుతున్నాను, ఏ దోపిడీలు చేయలేదు
  • ఏ పదవి లేని నన్ను విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలిపించారు, కలిసి మాట్లాడారు
  • నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను, మీరు చేస్తే ముఖ్యమంత్రి అవుతాను, మీరు గెలిపిస్తే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను, 10 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను, ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను. జగన్ ఇంకోసారి వద్దు
  • నేను ఓట్ చీలకూడదు అనడానికి కారణం, వైయస్ జగన్ దుర్మార్గుడు, అలాంటి వాడు ఇంకోసారి రాకూడదు అని
  • ఎన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావు జగన్?
    ఇక్కడ చిన్నపాటి వ్యాపారులు, వాచ్ మెన్లు పూట గడవడానికి కష్టపడుతుంటే, ఏ కష్టం చెయ్యకుండా ప్రజల ఆస్తులు దోచుకుంటున్నావు
  • కోటి మంది ప్రజలు వచ్చి నిన్ను చుట్టుముడితే ఎక్కడకు పారిపోతావ్ వైయస్ జగన్? ఎంతమంది పోలీసులను అడ్డు పెట్టుకుంటావు? అలాంటి రోజు వస్తుంది జాగ్రత్త
  • అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి
    అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి
    జనం బాగుండాలంటే వైయస్ జగన్ పోవాలి
    “హల్లో ఏపీ – బై బై వైసీపీ”
    “హల్లో ఏపీ – వెల్కమ్ JSP”
    #HelloAP_WelcomeJSP
  • దేవుడు అని భుజాన ఎక్కించుకుని వైయస్ జగన్ ను గెలిపిస్తే దయ్యమై ఊరి మీద పడి దోచుకుంటున్నాడు

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్