కదం తొక్కుతూ పదం పాడుతూ వారాహి రథం కదన రంగంలోకి కదిలింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన యాగం పూర్ణాహుతితో ముగిసిన అనంతరం వారాహికి ప్రత్యేక పూజలుగావించారు. వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయం సిద్దించాలని ఆశీర్వచనం చేశారు. వారాహి రథం నాలుగు వైపులా గుమ్మడికాయలు కొట్టి, నీరు వార బోసి చివరిగా వారాహికి హారతినిచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కరించారు. అనంతరం వారాహి బయలుదేరగా దాని ముందే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విజయ సంకేతం చూపుతూ నడిచారు.