10వ రోజు ( హైలెట్స్ ) – అమలాపురం నాయకులతో సమావేశం

అమలాపురం

సాయంత్రం 3 గం. నియోజకవర్గం పార్టీ నాయకులతో భేటీ  

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • దాదాపు రాజకీయాల్లోకి వచ్చి 14 యేళ్లు అయింది. అరణ్యవాసం పూర్తయింది. ఇక యుద్ధం చేద్దాం
  • కోనసీమలో మొదలైన మార్పు రాష్ట్రమంతా చూపించాలి
  • కోనసీమలో ఉన్న కోపం ఆవేదన మనలో మనం కొట్టుకోవడానికి కాకుండా మనల్ని దోపిడీ చేస్తూ, అన్యాయానికి గురి చేస్తున్న వ్యక్తులపై చూపిద్దాం-
  • అమలాపురంలో పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ ఉండాలి. అందుకే ఇక్కడ త్వరలో ఆఫీస్ పెడతాను, మీకోసం కూలీలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను
  • కూలదోసేవాడు ఒకడుంటే నిలబెట్టేవాడు ఒకడు ఉంటాడు, విడదీసే వాడు ఒకడుంటే కలిపేవాడు ఒకడుంటాడు
  • వివాదాల జోలికి వెళ్లకండి, ఎంత బలమైన ఉద్యమం అయినా సరే హింస ఉంటే ఆ ఉద్యమం వెనక్కు వెళ్ళిపోతుంది కాబట్టి హింస, వివాదాలు మన దరిదాపుల్లోకి రానివ్వకండి
  • కోపాలు అందరికీ ఉంటాయి. నాకు కోపం ఉంది కానీ ఆ కోపాన్ని వివేకంగా ప్రదర్శించాలి లేకపోతే అర్ధం ఉండదు
  • నీలోంచి మార్పు రావాలి. అందుకే నేను మారి చూపించాను. నేను అన్ని కులాలకు సమాన గౌరవం ఇస్తాను, అందరినీ కలుపుకుపోతాను
  • YCP MLC అనంతబాబు ఒక దళిత డ్రైవర్ ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతను కాపు కులస్తుడు అని నేను సమర్థించలేదు, తప్పు చేసిన వాడు ఏ కులమైన సరే శిక్ష పడాలి
  • బాపట్లలో ఒక గౌడ కులస్తుడైన బాలుడిని వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి తగలబెట్టి చంపేస్తే అది రెడ్డి కులం వారికి ఆపాదించకండి, తప్పు చేసిన వాడు రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, దళిత ఏ వర్గమైన సరే అందరూ ఖండించాలి, కులాలను వెనుక వేసుకురావద్దు
  • కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఎందుకు, ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం ప్రజల కన్నీళ్లు తుడవటమే
  • మీ ప్రేమను రాష్ట్ర నిర్మాణానికి, యువత భవిష్యత్తుకు, అన్ని కులాల అభివృద్ధికి ఉపయోగిస్తాను, నాకోసం ఉపయోగించను

 

  • అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలో రోడ్ షో 
  • అక్కడి నుంచి దిండి (రాజోలు నియోజకవర్గం) చేరుకున్నారు. 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్