7వ రోజు ( హైలెట్స్ ) – కాకినాడ ముస్లిం ప్రతినిధులతో సమావేశం

కాకినాడ

            మధ్యాహ్నం 12 గం.: కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశం 

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్

  • శ్రీ పవన్ కళ్యాణ్ గారు కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు – జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
  • ముస్లిం మైనారిటీ వర్గాల కోసం నేను నిలబడతాను అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలలో చెప్పారు. మీకుబై విధమైన అన్యాయం జరిగినా సరే ముందుగా స్పందించి మీ తరపున నిలబడేది. జనసేన
  • జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే సచార్ కమిటీ నివేదిక అమలు పరిచి ముస్లిం యువతకు, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
  • నేను అన్ని రాజకీయ పార్టీలా కాకుండా మీ సోదరుడిలా, ఒక మనిషిగా, భారతీయుడిగా మాట్లాడుతాను, నేను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చాను – ముస్లిం వర్గాలతో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • 1947 లో జిన్నా గారు తీసుకున్న నిర్ణయం ముస్లిం లకు ప్రత్యేక దేశం అనే కారణంగా 2 దేశాలుగా మతప్రాతిపదికన విడిపోయాయి
  • ఏ మతంలోనైనా అతివాదాన్ని మన అందరం ఖండించాలి
  • నిజంగా భారతదేశం అంత దుర్మారమైనది అయితే 17% ముస్లింలు ఇలా కలిసి ఉండలేరు. కొంతమంది. రాజకీయ నాయకుల వల్లనే సమస్యలు, ఘర్షణలు వస్తాయి
  • పాకిస్థాన్ నుండి చాలామంది హిందువులు పారిపోయారు. చాలామందిని చంపేశారు. కానీ భారతదేశంలో మాత్రం హిందూ, ముస్లిం లు కలిసి ఉన్నారు, ఇది మన దేశ గొప్పతనం
  • నేను హిందువుని, మీరు నా సహోదరులు, నేను మీకోసం పనిచేస్తాను. నేను సత్యాన్ని నమ్మే వ్యక్తిని, మీకు నమ్మకం ఉంటే నాకు అండగా ఉండండి
  • గత ఎన్నికల్లో 3 MLA సీట్లు, 3 MP సీట్లు ముస్లిం వర్గాలకు కేటాయించాను, ఇతర ఏ పార్టీ కూడా నిలబడలేదు
  • ముస్లిం ల నుండి నాయకులు రావాలి, అన్ని వర్గాలకు నాయకుడిగా మారాలి, అన్ని మతాలను కలుపుకు పోవాలి
  • నిజంగా మతాన్ని నమ్మేవాళ్ళకు ఇబ్బంది లేదు, కేవలం మతాన్ని రాజకీయం చేసేవాళ్ళకు ఇబ్బంది
  • అబ్దుల్ కలాం గారు దేశ రాష్ట్రపతి అయ్యారు అంటే అది దేశ గొప్పతనం, హిందువుల గొప్పతనం, మహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్ అయ్యాడు అంటే అతను మనవాడు అని అందరూ అనుకున్నాం కాబట్టే, పాకిస్తాన్ లో ఈ పరిస్థితి ఉండదు, అది భారత్ లో మాత్రమే సాధ్యం
  • మొన్న రంజాన్ మాసం సమయంలో 25 లక్షలు మసీద్ ముస్లిం విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఇచ్చాను. అధికారంలోకి వస్తే ఎంత చేయగలనో అర్థం చేసుకోండి
  • ఉత్తర భారతం చాలా దండయాత్రలను తట్టుకుని వచ్చింది అందుకే వారి స్పందన వేరు. మన దగ్గర అందరూ కలిసి ఉంటాము
  • మీరు ప్రార్థించే అల్లాహ్ మీద ఎవరైనా ఏమైనా అంటే మీరు స్పందిస్తారు, నేను పూజించే రాముడి విగ్రహం తల నరికేస్తే నేను స్పందిస్తాను. అంత మాత్రాన ఒక మతానికి నిలబడేవాడిని కాదు
  • నేను మీరు ఒకటే, మీరు నన్ను వేరుగా చూడకండి, నన్ను మీలో ఒకడిగా చూడండి
  • మొన్న కడపలో మైనారిటీ అమ్మాయి పై అత్యాచారం జరిగితే జనసేన స్పందించింది, అక్కడనున్న ఉప ముఖ్యమంత్రి, సారి ముస్లిం యువతిపై జరిగిన అఘాయిత్యంపై స్పందించలేదు. నన్ను నమ్ముతారా. అతన్ని నమ్ముతారా
  • మనకు అండగా నిలబడని వాడు ముస్లిం నాయకుడు అయితే ఏంటి, హిందూ నాయకుడు అయితే ఏంటి
  • ఈసారి ఎన్నికల్లో మాకు అండగా నిలబడండి. మీకోసం మరింత పని చేస్తాను.

సాయంత్రం 4 గం.: కాకినాడ నుంచి బయలుదేరారు

యానాంలో రోడ్ షో 

అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి చేరారు. 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్